కర్ణాటకలో చన్నపట్న నుంచి డీకే సురేష్?

కర్ణాటకలో జరిగే ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ డీకే సురేష్ చన్నపట్న నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.

Update: 2024-10-20 12:28 GMT

కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13న మూడు నియోజకవర్గాలు చన్నపట్నం, షిగ్గావ్ సండూర్ (ఎస్టీ రిజర్వ్‌డ్)లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే సురేష్ చన్నపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ నేతృత్వంలో చన్నపట్నం తాలూకా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకున్నానని, వారి కోరిక మేరకు పోటీ చేస్తున్నట్లు ఆదివారం తెలిపారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సురేష్ స్వయానా సోదరుడు.

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా..

“అభ్యర్థిగా కంటే, పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. అందుకు నాకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకులను కోరాను. రెండు మూడు రోజుల్లో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నాయకులు, కార్యకర్తలంతా కట్టుబడి ఉంటారు." అని సురేష్ అన్నారు.

హెచ్‌డీ కుమారస్వామి ఎంపీ కావడంతో..

2018, 2023 అసెంబ్లీ ఎన్నికలలో చన్నపట్నం నుంచి జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి బీజేపీ అభ్యర్థి సీపీ యోగీశ్వర్‌పై పోటీ చేసి గెలిచారు. 2013లో సీపీ యోగీశ్వర్‌ సమాజ్‌వాదీ పార్టీ తరుపున, అంతకుముందు కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2024 పార్లమెంటు ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థిగా మాండ్య స్థానం నుంచి ఆయన విజయం సాధించడంతో ప్రస్తుతం చన్నపట్నానికి ఉపఎన్నిక జరుగుతోంది.

ఇంకా అభ్యర్థిని ప్రకటించని బీజేపీ-జేడీ(ఎస్) ..

బీజేపీ-జేడీ(ఎస్) కూటమి చన్నపట్నం స్థానానికి తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. సీటును బీజేపీ జేడీ(ఎస్)కు అప్పగించడంతో కుమారస్వామి నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ త్వరలో అభ్యర్థిని ప్రకటించనుంది. అయితే కూటమి అభ్యర్థి తానేనని బీజేపీ ఎమ్మెల్సీ సీపీ యోగీశ్వర్ చెప్పుకుంటున్నారు. కాగా JD(S) యువజన విభాగం అధ్యక్షుడు, తన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని చన్నపట్న నుంచి పోటీ దింపే ఆలోచనలో ఉన్నట్లు కుమారస్వామి ఇటీవల పేర్కొన్నారు. ఇరువర్గాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం యోగేశ్వర్ జేడీ(ఎస్) టికెట్‌పై పోటీ చేయవచ్చని కూడా వార్తలు వచ్చాయి.

లోక్‌సభ ఎన్నికలో సురేష్ ఓటమి

2024 లోక్‌సభ ఎన్నికలలో డీకే సురేష్ కాంగ్రెస్ తరుపున బెంగళూరు రూరల్ నుంచి పోటీచేశారు. ఇదే స్థానం నుంచి బీజేపీ-జేడీ(ఎస్) ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ సీఎన్ మంజునాథ్ చేతిలో సురేష్ ఓడిపోయారు.   

Tags:    

Similar News