‘నాపై తప్పుడు ప్రచారానికి బీజేపీ రూ. 500 కోట్లు ఖర్చుపెట్టింది’

తనపై తప్పడు ప్రచారానికి కోట్లు గుమ్మరిస్తున్న బీజేపీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రజలను కోరారు.

Update: 2024-11-19 09:58 GMT

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీజేపీపై విరుచుకుపడ్డారు. తనపై దుష్ర్పచారానికి కాషాయ పార్టీ నేతలు రూ. 500 కోట్లు ఖర్చుచేశారని ఆరోపించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారని, అయితే జార్ఖండ్ ప్రజలు అటువంటి వాటిని అనుమతించరని చెప్పారు. బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్ నుంచి జనాలను రప్పించి..ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో తన గురించి చెడ్డగా చెప్పిస్తున్నారని, ఓటర్లలో లేనిపోని భయాన్ని నింపుతున్నాయని, ఈ తరహా జిమ్మిక్కు కోసం బీజేపీ ఒక్కో నియోజకవర్గంలో రూ.కోటి చేసిందని ఆరోపించారు. జార్ఖండ్‌లో JMM నేతృత్వంలోని సంకీర్ణానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి 95 వేల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారని, ఇంకా వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు రూ. కోట్ల ఖర్చు చేశారని ఆరోపించారు.

"మేం ఎలక్టోరల్ బాండ్లు రూపంలో డబ్బులు సేకరించలేదు. నకిలీ మందులు, నకిలీ టీకాలతో ప్రజల జీవితాలతో ఆడుకోలేదు. ఈ రోజు, రేపు నా కోసం బహిరంగంగా ప్రచారం చేయమని జార్ఖండ్ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ధైర్యంగా మాట్లాడండి.

సోరెన్ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. సోరెన్ మాటల్లో నిరాశ, నిస్పృహ కనిపిస్తున్నాయని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు.

సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులపై కేసులు..

ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పాలక JMM ఫిర్యాదు మేరకు.. జార్ఖండ్ పోలీసులు ఇద్దరు సోషల్ మీడియా ఖాతాదారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే.. తాను ప్రమోషన్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదని సోరెన్ పేర్కొన్నారు.  

Tags:    

Similar News