మహారాష్ట్ర ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో రిలీజ్.. హామీలివే..

288 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఫలితాలు వెలువడతాయి.

Update: 2024-11-10 10:40 GMT

మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తు్న్న వేళ పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నారు. అందులోభాగంగానే బీజేపీ మేనిఫెస్టోను ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సహా సీనియర్ నేతలతో కలిసి మహారాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీ రోడ్‌మ్యాప్‌ను షా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. రాష్ట్ర అభివృద్ధి, మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీవ్ర విమర్శలు చేశారు. బాలాసాహెబ్‌, సావర్కర్‌ను అవమానించిన వారి పక్కనే ఆయన చేరారని మండిపడ్డారు. మహా వికాస్‌ అఘాడీలో భాగమైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌, ఎన్సీపీ (ఎస్పీ)లపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను ఇంకా నెరవేర్చలేదు. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌పై కూడా విమర్శలు చేశారు షా. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పని చేసిన ఆయన మహారాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం చేసిన పనులేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మహారాష్ట్ర వాసులకు బీజేపీ హామీలివే..

లడ్కీ బెహన్‌ స్కీమ్‌ కింద ప్రతినెల ఇచ్చే రూ.1500లను రూ.2100కు పెంపు

వ్యవసాయ రుణాలు మాఫీ, ఆహార భద్రతకు హామీ, నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణకు చర్యలు

వృద్ధాప్య పింఛనును రూ.2100కు పెంపు

యువతకు 25లక్షల కొత్త ఉద్యోగాలకు హామీ.

రాష్ట్రంలో పది లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10వేలు చొప్పున స్టైఫండ్‌

45 వేల గ్రామాలకు కొత్తగా రోడ్లు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విజన్‌ మహారాష్ట్ర 2028 విడుదల

మహారాష్ట్రను 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏఐ శిక్షణ, నైపుణ్య గణన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతు

వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక సాయం, ప్రజలకు ఆరోగ్య బీమా

288 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఫలితాలు వెలువడతాయి.

Tags:    

Similar News