భారత్, పాక్ లతో ఫోన్లులో మాట్లాడిన అమెరికా విదేశాంగ కార్యదర్శి

పహల్గాం దాడిపై విచారం వ్యక్తం చేసిన మార్కో, దక్షిణాసియాలో శాంతి కోరుతున్నామని వెల్లడి;

Translated by :  Praveen Chepyala
Update: 2025-05-01 07:45 GMT
అమెరికా, భారత్ విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, ఎస్ జైశంకర్, పాక్ ప్రధాని షెహాబాజ్ షరీఫ్

పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర సైనిక ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహాబాజ్ షరీఫ్ లలతో విడివిడిగా ఫోన్ లో మాట్లాడారు. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా చూసుకోవాలని ఇరుదేశాలకు సూచించారు.

బుధవారం రాత్రి జైశంకర్ తో మాట్లాడిన మార్కో.. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్ కు సహకరించడానికి అమెరికా తన నిబద్దతను పునరుద్ఘాటించారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
26 మంది పౌరులు ప్రాణాలను బలిగొన్న పాశవిక దాడిలో ఇస్లామాబాద్ సహకరించాలని రూబియో షహాబాజ్ షరీఫ్ తో మాట్లాడిన సందర్భంలో మార్కో కోరినట్లు తెలిసింది.
భారత్ న్యాయం కోరుతోంది..
పహల్గామ్ దాడికి బాధ్యులు, దాని నేరస్థులు ఫైనాన్షియర్లు, ప్రణాళికలు వేసిన వారిని న్యాయం ముందు నిలబెడతామని మార్కో కు జైశంకర్ నొక్కి చెప్పారు. ‘‘పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి నిన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో చర్చించాను. దాడికి పాల్పడినవారు, మద్దతుదారులు, ప్రణాళిక వేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం’’ అని జైశంకర్ గురువారం ఎక్స్ లో పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ సైనిక చర్యకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కో తో, ఎస్. జైశంకర్ ఫోన్ లో సుదీర్ఘంగా మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికా ప్రశాంతతను కోరుతోంది..
ఈ విషాదకరమైన ప్రాణనష్టం పట్ల కార్యదర్శి రూబియో విచారాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తో కలిసి పనిచేయడానికి అమెరికా నిబద్దతను పునరుద్ఘాటించారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ధృవీకరించారు.
ఉద్రిక్తతలను తగ్గించడానికి, ప్రాంతీయ శాంతిని కాపాడటానికి భారత్, పాకిస్తాన్ తో సంబంధాలను పెట్టుకోవాలని రూబియో కోరారు. షరీఫ్ తో రూబియో సంభాషణ గురించి బ్రూస్ మాట్లాడుతూ.. భారత్ తో సహకరించాలని, ప్రత్యక్ష కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్దరించాలని, దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడంలో సహాయపడాలని కార్యదర్శి పాకిస్తాన్ ను ప్రొత్సహించారని అన్నారు.
ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దంగా ఉన్నారా?
ఈ దాడిలో సరిహద్దు కోణాలను ఉటంకిస్తూ ఇందులో పాల్గొన్న వారికి కఠినమైన శిక్ష విధిస్తామని భారత్ ప్రతిజ్ఞ చేసింది. మంగళవారం సైనిక దళాధిపతులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రతిస్పందన విధానం, లక్ష్యాలు, సమయాన్ని నిర్ణయించుకోవాలని సూచించారు.
ఉగ్రవాదాన్ని అణచివేయడం జాతీయ సంకల్పం అని మోదీ నొక్కి చెప్పారు. దాడి తరువాత ఏప్రిల్ 23న భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అట్టారీ వద్ద ఉన్న భూ సరిహద్దును మూసివేసి, పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలను తగ్గించడం వంటి చర్యలకు దిగింది.
పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత కమర్షియల్ విమానాలకు మూసివేయడం ద్వారా, మూడో పార్టీ దేశాల ద్వారా సహ భారత లోని అన్ని వాణిజ్యాలకు నిలిపివేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. ఇస్లామాబాద్ కూడా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని తిరస్కరించింది. నీటి ప్రవాహాలను నిలిపివేయడాన్ని నిరోధించే ఏ ప్రయత్నమైన యుద్ద చర్యగా పరిగణిస్తామన బీరాలు పలికింది.


Tags:    

Similar News