ఆ దేశాలపై టారిఫ్ విధిస్తూ ట్రంప్ ఉత్తర్వూలు

భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు మరోసారి ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు;

Update: 2025-07-08 05:54 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకోకుండా తాత్సారం చేస్తున్న 14 దేశాల సుంకాలు విధించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న యూకే, చైనాతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, భారత్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి దగ్గరగా ఉన్నామని చెప్పారు. సుంకాల చర్చలు విఫలమైన దేశాలకు అమెరికా ఒక లేఖ పంపబోతోందని కూడా ఆయన అన్నారు.

‘‘ఇప్పుడు మేము యూకేతో ఒప్పందం కుదుర్చుకున్నాము. మేము చైనాతో ఒక ఒప్పందం చేసుకున్నాము. భారత్ తోనూ ఒప్పందం చేసుకోవడానికి దగ్గరగా ఉన్నాము.
ఇతర దేశాలను కలిశాము. మేము ఒప్పందం కుదుర్చుకోగలమని మేము అనుకోము. కాబట్టి వారికి ఒక లేఖ పంపుతాము. మీరు ఇక్కడ అడగుపెట్టాలంటే చేయాల్సిన పని ఇదే’’ ని ట్రంప్ అన్నారు.
14 దేశాలకు లేఖలు..
అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకుండా వస్తు సేవలను పంపిన 14 దేశాలకు ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా లేఖలు పంపింది. తమ దేశంలో ఈ దేశాలు పంపిన వస్తువులపై విధించే సుంకాల రేట్లు అందులో వివరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ సంతకం చేసిన ఈ లేఖలను అందుకున్న దేశాలు బంగ్లాదేశ్, బోస్నియా, హెర్జెగోవినా, కంబోడియా, ఇండోనేషియా, జపాన్, కజకిస్తాన్, లావో పీపుల్స్ డెమొక్రాటిక్ రిపబ్లిక్, మలేషియా, సెర్బియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, థాయిలాండ్, ట్యూనీషియా దేశాలు ఉన్నాయి.
‘‘మేము వివిధ దేశాలకు లేఖలు పంపుతున్నాము. వాళ్లు ఎంత సుంకాలు చెల్లించాలో తెలియజేస్తున్నాము’’ అని ట్రంప్ అన్నారు.
అమెరికాను చీలుస్తున్నారు..
‘‘కొన్ని దేశాలు అమెరికాను చీల్చివేసి, ఇంతకుముందు ఎవరూ చూడని స్థాయిలో మా పై సుంకాలను వసూలు చేస్తున్నాయి’’అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 200 శాతం సుంకాలను వసూలు చేసి వ్యాపారం చేయడం అసాధ్యం చేస్తున్న కొన్ని దేశాలు జాబితా మా దగ్గర ఉందని అన్నారు.
వైట్ హౌజ్ లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ద్వైపాక్షిక విందుకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ - పాక్ వివాదం..
భారత్- పాక్ వివాదంపై ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో తానే మధ్యవర్తిత్వం చేశానని, రెండు దేశాలు వాషింగ్టన్ వాణిజ్యం చేయదని చెప్పడం ద్వారా తాను యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పునరావృతం చేశారు.
‘‘మేము భారత్, పాకిస్తాన్, సెర్బియా, కొసావో, రువాండా, కాంగోలతో కలిసి పనిచేశాము. ఇదంతా గత మూడు వారాలుగా జరిగింది. ఇవి పోరాడటానికి సిద్దంగా ఉన్నాయి’’ అని ట్రంప్ అన్నారు.
‘‘మేము చాలా పోరాటాలను ఆపాము. నేనే చాలా పెద్ద యుద్ధాన్ని ఆపాను. భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలను నిలిపివేశాను. దీనిని వాణిజ్యం కారణంగా ఆపాము’’ అని చెప్పారు.
‘‘మీరు పోరాటం ఆపకపోతే మేము మీతో వాణిజ్యం చేయము. వారు అణ్వాయుధాలు వాడే స్థితిలో ఉన్నారు. అవి రెండు అణ్వాయుధ శక్తులు. దానిని ఆపడం ముఖ్యమని నేను భావించాను’’ అని ట్రంప్ అన్నారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం..
రష్యా- ఉక్రెయిన్ వివాదాన్ని నిలిపివేయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని ట్రంప్ చెప్పారు. ఈ యుద్ధం జో బైడెన్ చేసిన రాక్షస చర్యగా అభివర్ణించారు.
‘‘రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఈ విషయం భయంకరమైనది. పుతిన్ ప్రవర్తనతో నేను అస్సలు సంతోషంగా లేను. కానీ అప్పట్లో నేను అధ్యక్షుడి ఉండినట్లయితే ఇది జరిగి ఉండేది కాదు’’ అన్నారు.
నోబెల్ బహుమతి..
ట్రంప్ కు నోబెల్ బహుమతి అందజేయమని ఇజ్రాయెల్ చేసిన విన్నపానికి సంబంధించిన లేఖ ప్రతిని ట్రంప్ కు నెతన్యాహూ అందజేశారు.
గతంలో భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు, రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య వివాదాలను సమర్థవంతంగా నిలుపుదల చేసినప్పటికి నోబెల్ రాదని ట్రంప్ బాధపడ్డారు.
ముఖ్యంగా అణ్వాయుధ యుద్ధం తాను ఆపానని గతంలో పలుమార్లు ట్రంప్ చెప్పుకున్నారు. అయితే భారత్ ఈ వాదలను ఖండించింది. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈవిషయం ట్రంప్ కే చెప్పారు.
భారత్- పాక్ మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో ఎక్కడా అమెరికా ప్రస్తావన రాలేదని, కేవలం ఇరు దేశాల డీజీఎంల స్థాయిలో చర్చలు జరిగి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి..
పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ నియంత్రణలో జమ్మూకాశ్మీర్, పాక్ ప్రధాన భూభాగంలో ఉన్న ఉగ్రవాద సైనిక శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది.
తరువాత రెండు దేశాలు సైనిక దాడులు చేసుకున్నాయి. ముఖ్యంగా మే 8,9 న భారత్ చేసిన దాడులతో పాక్ కాళ్లబేరానికి వచ్చింది. పాక్ లో 11 వైమానిక బేస్ లు పూర్తిగా ధ్వంసం చేయడంతో ఆ దేశానికి వేరే గత్యంతరం లేకపోయింది.


Tags:    

Similar News