నేడు భారత్-రష్యాల మధ్య పలు కీలక ఒప్పందాలు..
వాణిజ్యం, రక్షణ రంగాలతోపాటు పలు కీలక ఒప్పందాలపై అంగీకారం కోసం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశం కానున్న మోదీ, పుతిన్..
భారత ప్రధాని మోదీ(PM Modi), రష్యా(Russian) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) నేడు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అజెండాలో ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ ఒప్పందాలు ఉన్నాయి.
లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో ప్రధాని మోదీ పుతిన్‌కు విందు ఇచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పుతిన్‌ను మోదీ రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లారు. రాష్ట్రపతి భవన్ వద్ద భారత త్రివిధ దళాలు వారికి లాంఛనంగా స్వాగతం పలికాయి. పుతిన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆహ్వానించారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో సదస్సులో పాల్గొన్నారు. ఇదే భవనంలో పుతిన్‌కు, ఆయన ప్రతినిధి బృందానికి మోదీ విందు ఏర్పాటు చేశారు.
23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం ఉదయం 11:50 గంటలకు హైదరాబాద్ హౌస్‌లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. పుతిన్ చివరిసారిగా డిసెంబర్ 6, 2021న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి భారత్ సందర్శించారు. కానీ అది చిన్న పర్యటన కావడంతో ఆయన మీడియానుద్దేశించి మాట్లాడలేదు.
చమురు కొనుగోళ్లపై అమెరికా భారత్‌పై అదనంగా 25% సుంకాన్ని విధించిన కొన్ని నెలల తర్వాత ఈ సమావేశం జరగబోతుంది.
ఇక ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాల్లో ముఖ్యమైనవి..
1. RELOS ఒప్పందం (Reciprocal Exchange of Logistic Support)
- రష్యా పార్లమెంట్ 2025లో ఆమోదించిన కీలక ఒప్పందం.
- రెండు దేశాల సైన్యాలు ఒకరి నౌకాదళ, వైమానిక స్థావరాలు, లాజిస్టిక్ సదుపాయాలు ఉపయోగించుకోవచ్చు.
2. 2021–2031 సైనిక-సాంకేతిక సహకార కార్యక్రమం
- 2021లో 2+2లో సంతకం.
- పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ వంటి విభాగాల్లో దీర్ఘకాలిక సహకారం.
3. సుఖోయ్–30 MKI ఒప్పందం
- 1996లో మొదటి ఒప్పందం.
- 50 విమానాల కొనుగోలు, 140 విమానాల HALలో లైసెన్స్ ఉత్పత్తి.
4. బ్రహ్మోస్ క్షిపణి సంయుక్త ప్రాజెక్ట్
- భారత్-రష్యా సంయుక్త సంస్థ (BrahMos Aerospace).
- ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ వ్యవస్థ.
5. మిగ్–29 అప్‌గ్రేడ్, కొనుగోలు ఒప్పందాలు
- పలు దశల్లో మిగ్–29 విమానాల కొనుగోలు, అప్‌గ్రేడ్.
6. అణు జలాంతర్గామి (INS Chakra) లీజ్ ఒప్పందాలు
- రష్యా నుండి అణు శక్తితో నడిచే జలాంతర్గాముల లీజ్.
7. S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒప్పందం
- 2018లో సంతకం.
- ఐదు రెజిమెంట్ల కొనుగోలు.
8. కా-226T హెలికాప్టర్ సంయుక్త ఉత్పత్తి ఒప్పందం
- భారత్‌లో తయారీకి ఒప్పందం
9. AK-203 అసాల్ట్ రైఫిల్ ఉత్పత్తి ఒప్పందం
- ఉత్తరప్రదేశ్‌లో సంయుక్త ఉత్పత్తి.
10. పది అంతర్ ప్రభుత్వ ఒప్పందాలు, 15 వాణిజ్య ఒప్పందాలు (2025)
- పుతిన్ పర్యటనలో సంతకం చేయడానికి సిద్ధం చేసిన ప్యాకేజ్.
11. సంయుక్త సైనిక విన్యాసాలు
- ఇండ్రా (INDRA)
- అవియాడ్రిల్
- నౌకాదళ, వైమానిక, భూసేనల సంయుక్త వ్యాయామాలు.
12. అంతరిక్ష–రక్షణ సహకారం
- గగనయాన్ వ్యోమగాముల శిక్షణలో రష్యా పాత్ర.