ఎఫ్టీఏపై సంతకం చేయబోతున్న భారత్- యూకే

మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న చర్చలు కొలిక్కి;

Update: 2025-07-24 06:41 GMT
యూకేలో భారత ప్రధాని నరేంద్ర మోదీ

భారత్- యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) మార్కెట్ ప్రవేశాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని, ఏటా దాదాపు 34 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుతుందని బ్రిటిష్ ప్రభుత్వం గురువారం తెలిపింది.

ఈ చారిత్రక ఒప్పందం కుదరడానికి ముందు యూకే ఈ ప్రకటన చేసింది. యూరోపియన్ యూనియన్ నుంచి నిష్కమించిన తరువాత యూకే కు ఈ ఒప్పందం ముఖ్యమైన వాణిజ్య పత్రం అవుతుంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ- బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఈ ఒప్పందంపై సంతకం చేయబోతున్నారు. ప్రపంచంలో వేగవంతమైన మార్పులు జరుగుతున్న సమయంలో తన భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలను తీసుకెళ్లడానికి ఇద్దరు ప్రధానులు ‘యూకే- ఇండియా విజన్ 2035’ ను కూడా ఆవిష్కరిస్తారు.

యూకే- భారత్ వాణిజ్యం
ఎఫ్టీఏ ప్రారంభమైన తరువాత సగటు సుంకాలు 15 శాతం నుంచి మూడు శాతానికి తగ్గుతాయి. కాబట్టి భారతీయ వినియోగదారులు బ్రిటిష్ కు చెందిన కూల్ డ్రింక్స్(శీతల పానియాలు), సౌందర్య సాధనాల నుంచి కార్లు, వైద్య పరికరాల వరకూ చాలా చవకగా లభించే అవకాశం ఉంది.
యూకే ఇప్పటికే భారత్ నుంచి 11 బిలియన్ పౌండ్ల వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. అలాగే భారతీయ వస్తువులపై సుంకాలను సరళీకరించడం వలన బ్రిటిష్ వినియోగదారులు, వ్యాపారాలు భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం సులభంగా ఉంటుంది. యూకేకు మనం ఎగుమతి చేయబోయే వస్తువులు పెరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘భారత్ తో మా మైలురాయి వాణిజ్య ఒప్పందం బ్రిటన్ కు ఒక పెద్ద విజయం’’ అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. ఈ ఒప్పందంతో యూకే అంతటా వేలాది మంది బ్రిటిష్ వారికి ఉద్యోగాలను సృష్టిస్తుందని, కొత్త వ్యాపార అవకాశాలకు తలుపులు తెరుస్తుందని అన్నారు. దేశంలో ప్రతిమూల వృద్దిని పెంచుతుందన్నారు.
2035కి దృక్ఫథం..
2035 సంవత్సరానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన కొత్త దార్శనికత వాణిజ్యానికి అనువుగా ఉంటుందని కొత్త రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ ద్వారా ఇరు దేశాల శ్రేయస్సు, రక్షణ సహకారం ఆవిష్కరించడానికి ఇది ఉపయోగపడుతుందని యూకే తెలిపింది.
‘‘ఇది మన దేశాల సరిహద్దులను భద్రపరచడానికి, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, విద్యా సంబంధాలను పెంపొందించడానికి వీలు కల్పిస్తుంది’’. ఎఫ్టీఏపై యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏటా 25.5 బిలియన్ పౌండ్లు(34 బిలియన్ యూఎస్ డాలర్లు) పెంచుతుందని ఒక అంచనా
భారత్ తో అత్యంత సమగ్రమైన ఒప్పందం, ఈయూ నుంచి నిష్క్రమించిన తరువాత యూకే అత్యంత ఆర్థికంగా ముఖ్యమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంగా ఇది నిలుస్తుందని యూకే తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు దేశాల పర్యటనలో భాగంగా మొదట యూకేలో పర్యటిస్తున్నారు. తరువాత ఆయన మాల్దీవులకు రానున్నారు.
కన్జర్వేటివ్ లు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఎఫ్టీఏ పై చర్చలు జరుగుతున్నాయి. కానీ అప్పట్లో భారత్ ను ఇబ్బంది పెట్టే చర్యలకు యూకే దిగడంతో భారత్ వీటిని ఆలస్యం చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై కన్జర్వేటివ్ లు న్యూఢిల్లీని దిగ్భంధనం చేసే పరిస్థితులు తీసుకురావడంతో మన పాలకులు కినుక వహించారు. ఎట్టకేలకు మూడు సంవత్సరాల చర్చ తరువాత రెండు దేశాల మధ్య ఇప్పుడు ఈ ఒప్పందంపై సంతకాలు జరగబోతున్నాయి.


Tags:    

Similar News