బంగ్లా: ఎన్నికలు వాయిదా పడాలని జమాతే ఇ ఇస్లామ్ కోరుకుంటుందా?

ఇస్లామిక్ ఖలీఫా రాజ్యాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ

Update: 2025-12-22 09:41 GMT
నిరసన చేస్తున్న జమాతే ఇ ఇస్లామీ కార్యకర్తలు

బంగ్లాదేశ్ ను కుదిపేస్తున్న అతిపెద్ద నిరసనలకు భారత్ ప్రధాన కేంద్రంగా మారింది. భారత వ్యతిరేకి, విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది అంత్యక్రియల తరువాత ఢాకాలోని షాబాగ్ లో ఇటీవల జరిగిన ర్యాలీలో కూడా భారత వ్యతిరేకత బలంగా వినిపించింది.

బంగ్లాలో కొనసాగుతున్న హింస వల్ల ఫిబ్రవరి 12న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవే ఆందోళనలు ప్రస్తుతం అందరి మదిలోనూ మెదులుతున్నాయి.

పత్రికలపై దాడులు..
దేశంలోని అనేక సంస్థలపై ఇస్లామిక్ జిహాదీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. వాటిలో రెండు ప్రముఖ వార్తాపత్రికలు.. ఫ్రోథోమ్ అలో, డైలీ స్టార్ కూడా ఉన్నాయి. అలాగే బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజిబుర్ రెహ్మన్ నివాసం కూడా దాడులకు ధ్వంసం అయిన వాటిలో ఉన్నాయి.
రెండు పత్రికలు షేక్ హసీనా విధానాలు విమర్శించాయి. అయితే బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న వారి త్యాగాలను మాత్రం హైలైట్ చేస్తూ వచ్చాయి. పాక్ సైన్యం 1971 లో బెంగాళీలపై చేసిన ఆకృత్యాలకు పెద్ద పీట వేశాయి.
దీనితో జమాతే ఇ ఇస్లామి కు చెందిన ఇస్లామిస్టులు ఈ పత్రికలే లక్ష్యంగా మూకదాడులకు పాల్పడ్డాయి. ఇది బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటాలను గుర్తు చేయడం, పాక్ ను విమర్శించడం తమకు నచ్చలేదని ప్రత్యక్షంగా ప్రకటించినట్లు అయింది. హసీనా పదవి నుంచి దిగిపోయిన తరువాత పాక్ తో దాని బంధాలు క్రమంగా బలపడుతున్నాయి.


 


యువ నాయకుడి మరణం..
భారత వ్యతిరేకి, ఇస్లామిక్ భావాలు ఉన్న హాదిని మరణం తరువాత ఢాకాలో ఇప్పుడు నిరసనలు భారీగా జరుగుతున్నాయి. డిసెంబర్ 12న రద్దీగా ఉండే ఢాకా వీధిలో పట్టపగలు మోటార్ బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అతనిపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు.
చికిత్స కోసం అతడిని సింగపూర్ కు తరలించినప్పటికీ డిసెంబర్ 19 న మరణించాడు. గత సంవత్సరం హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో హాది పాల్గొన్నాడు.
ఇంకిలాబ్ మంచా అనే సంస్థను నడుపుడుతున్నాడు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నికల ద్వారానే బంగ్లాదేశ్ ముందుకు సాగుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తి హాది.
ఢాకాలో నివసించే ఒక ఎడిటర్ మాట్లాడుతూ.. రాజకీయ వర్గాల నుంచి మద్దతు లేకపోతే నిరసనకారులకు పత్రికా కార్యాలయాల్లోకి వెళ్లి దాడి చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.
దేశంలో జరుగుతున్న నిరసనల వెనక జమాతే ఇస్లామీ నేతృత్వంలోని మతోన్మాద శక్తులు ఉన్నాయని చాలామంది పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికలను రద్దు చేసి నిరవధికంగా వాయిదా వేస్తే మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతులైనప్పటి నుంచి బంగ్లాదేశ్ లో తన ప్రభావాన్ని వ్యాప్తి చేయడంలో విజయం సాధించిన జమాతే ఇస్లామీ, తన పట్టును దేశంలో నిలుపుకోవడానికి ఇస్లామిస్ట్ లను ఏకం చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం సంతరించుకుంది.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) సహ చైర్ పర్సన్ పార్టీ వాస్తవ నాయకుడు తారిఖ్ రెహమాన్ లండన్ లో 18 సంవత్సరాల స్వీయ ప్రవాసం తరువాత బంగ్లాదేశ్ లో ఈ నిరసనలు జరుగుతున్నాయి.
షేక్ హసీనా లక్ష్యంగా..
బంగ్లాదేశ్ కు ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన షేక్ హసీనా, గత ఏడాదిలో విద్యార్థుల ఉద్యమం పేరిట జరిగిన హింస తరువాత దేశం నుంచి శరణార్థిగా భారత్ కు రావాల్సి వచ్చింది.
నవంబర్ లో ప్రత్యేక ట్రిబ్యూనల్ యుద్ద నేరాల కింద హసీనాను దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. అనేకమంది న్యాయమూర్తులు, రాజకీయ నిఫుణులు దీనిని ఒక మోసపూరిత విచారణగా భావించారు.
1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో చేసిన నేరాలకు గాను 2008 లో ఆమె అధికారంలో ఉన్నప్పుడూ జమాత్ నాయకులకు చేసినట్లుగా, ఇప్పుడు వారు హసీనాకు మరణశిక్ష విధించేలా పావులు కదిపారు.
హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ అధికారికంగా అభ్యర్థించినప్పటికీ భారత్ ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన తెలియపరచలేదు. హాదిపై దాడికి హసీనానే కారణమని ఇస్లామిస్టులు నిందిస్తున్నారు.
దాడి చేసిన వ్యక్తులు భారత్ కు పారిపోయారని, ఆమె స్వయంగా వారికి ఆశ్రయం కల్పిస్తున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. హాదీ పై దాడి జరిగిన తరువాత చిట్టగాంగ్ లోని భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ జనరల్ వద్ద పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి.
భారీ గోడను బద్దలు కొట్టి ఆవరణలోకి ప్రవేశిస్తామని కూడా భారతీయ అధికారులను బెదిరించారు. నిరసనకారుల్లో ఎక్కువ మంది జమాత్, దాని అనుబంధ గ్రూపులకు చెందినవారే ఎక్కువ. హసీనా, హాది హంతకుడిని వెంటనే బంగ్లాకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.
భారత్ తో ఉద్రిక్తతలు..
డిసెంబర్ 14న ఢాకాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించి, హసీనా చేసిన ప్రకటనపై నిరసన తెలియజేసింది.
కొన్ని రోజుల తరువాత భారత్ కూడా బంగ్లాదేశ్ హైకమిషనర్ ను పిలిపించి అక్కడ శాంతియుతంగా స్వేచ్ఛగా, న్యాయంగా అందరిని కలుపుకుని ఎన్నికలు జరగాలని కోరింది. అయితే భారత్ చేసిన వ్యాఖ్యలు ఢాకా ప్రస్తుత నాయకత్వానికి నచ్చలేదు.
హసీనా గత పదిహేను సంవత్సరాలుగా అధికారంలో ఉండి చాలామందిని ఓటు హక్కు లేకుండా చేశారని భారత్ ఇందులో జోక్యం చేసుకోవడం మానుకోవాలని ఆయన సూచించారు.
బంగ్లాదేశ్ తన వృద్ధి, అభివృద్ధిలో ఢాకాతో క్రమం తప్పకుండా వ్యవహరిస్తూ ఉండటం వలన ఎన్నికలపై యూరోపియన్ యూనియన్ సూచనలను అంగీకరించడానికి సిద్దంగా ఉందని హుస్సేన్ అన్నారు. భారత్ స్నేహపూర్వక దేశం కాదనే అంతరార్థం అందులో ఉన్నట్లు మన పెద్దలు గమనించారు.
తారిక్ రాక..
హింసాత్మక నిరసనలు, రాజకీయ అస్థిరతను నిపుణులు తారిక్ రెహమాన్ బీఎన్పీ నాయకత్వానికి ఒక సంకేతంగా భావిస్తున్నారు.
డిసెంబర్ 25న ఢాకాకు తిరిగి రావాలనే తన కోరికను తారిఖ్ ప్రకటించాడు. అయితే హింస కొనసాగి పరిస్థితి మరింత దిగజారితే అతను తన ప్రణాళికలను మార్చుకునే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేదు.
తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఎన్నికలు జరుగుతాయనే సందేహాలు ఇప్పటికే ఉన్నందున తారిక్ రెహమాన్ రాక పార్టీ నాయకులు, కార్యకర్తలకు నూతనోత్సాహం కలిగిస్తుందని బీఎన్పీలో అంచనా ఉంది.
ఆయన రాక పార్టీని ఎన్నికల వాతావరణంలోకి నెడుతుంది. దేశంలో తదుపరి ప్రభుత్వాన్ని బీఎన్పీ ఏర్పాటు చేస్తుందని చాలామంది రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
జమాత్ వ్యూహం..
జమాతే ఏ ఇస్లామీ గతంలో బీఎన్పీ ప్రభుత్వంలో జూనియర్ పార్ట్ నర్ గా వ్యవహరించింది. ఇటీవల అంచనాల ప్రకారం.. బీఎన్పీ అధికారంలో ఉన్నప్పుడూ అవినీతికి పాల్పడిన కారణంగా జమాత్ ప్రతిష్ట మసకబారింది.
బంగ్లాను ఇస్లామిక్ ఖలీఫా రాజ్యంగా మార్చడానికి జమాత్ పార్టీ స్వయంగా ముందుకు వెళ్లి ఇస్లామిస్టుల మహా కూటమిని సృష్టించాలని భావిస్తోంది. హసీనా నిష్ర్కమణ తరువాత తన సంస్థను బలోపేతం చేసింది.
కానీ బీఎన్పీ వంటి పార్టీలను ఎదుర్కోవడానికి దానికి మరికొంత సమయం కావాలి. లేకపోతే అది ప్రతిపక్షానికే పరిమితం కావచ్చు. లేదా మరోసారి సంకీర్ణ భాగస్వామిగా మారవచ్చు. బంగ్లాను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి దానికి ఇప్పుడు అర్జంట్ గా ఎన్నికలు వాయిదా పడాలని కోరుకుంటోంది.
భారత్ ఛాయిస్..
ప్రస్తుత పరిస్థితి భారత్ కు చాలా తక్కువ ఛాయిస్ లు ఉన్నాయి. కానీ షెడ్యూల్ ప్రకారం సమ్మిళిత స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహిస్తే బీఎన్పీ గెలిస్తే భారత్ తో సంబంధాలు నెరపవచ్చు.
కానీ బీఎన్పీలో అనుకూల, మితవాద వర్గం పార్టీని నియంత్రించేలా భారత్ లో సంబంధాన్ని నిర్ణయించేలా చూసుకోవడానికి ఢిల్లీ అవామీ లీగ్ దాని సంప్రదాయ ఎన్నికల చిహ్నంతో ఎన్నికల్లో పోటీ చేసేలా చూసుకోవాలి.
ప్రతిపక్షంలో ఉన్న అవామీ లీగ్ కూడా ఇస్లామిక్ ఎజెండా ను తగ్గించడంలో అర్థవంతమైన పాత్ర పోషించగలదు. ఢాకా - ఢిల్లీ రెండూ ఒకరి ప్రధాన వ్యూహాత్మక ప్రయోజనాలను గౌరవించుకుంటాయని, వాటిని ప్రమాదంలో పడేయకుండా చూసుకోవాలి.


Tags:    

Similar News