రష్యా- ఉక్రెయిన్ తో చర్చలు జరుపుతున్నాం: అమెరికా

నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతున్నామన్న వైట్ హౌజ్ ప్రతినిధి

Update: 2025-12-22 06:30 GMT
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

గత నాలుగు సంవత్సరాలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా నిర్మాణాత్మక చర్చలు జరుతున్నాయని వైట్ హౌజ్ ప్రతినిధి విట్ కాఫ్ తెలిపారు. ఉక్రెయిన్ వివాదానికి సంబంధించి యూఎస్ఏ, యూరప్ మధ్య భాగస్వామ్య వ్యూహాత్మక విధానాన్ని సమన్వయం చేయడం ఈ చర్చల లక్ష్యం అన్నారు.

‘‘మా ఉమ్మడి ప్రాధాన్యత హత్యలను ఆపడం, భద్రతకు హమీ ఇవ్వడం, ఉక్రెయిన్ కోలుకోవడం, స్థిరత్వం, దీర్ఘకాలిక శ్రేయస్సు కోసం పరిస్థితులను సృష్టించడం. శాంతి అనేది శత్రుత్వాలను నిలిపివేయడం మాత్రమే కాదు.
స్థిరమైన భవిష్యత్ కు గౌరవప్రదమైన పునాది కూడా కావాలి’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాయబారీ అన్నారు. ఈ చర్చలు ట్రంప్ పరిపాలన బృందం నెలల తరబడి శాంతి కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగం. యుద్దాన్ని ముగించడానికి ట్రంప్ విస్తృతమైన దౌత్యపరమైన ఒత్తిడిని పెట్టారు.
అయితే ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఇటు మాస్కో, అటూ కీవ్ అధినేతలు ఇద్దరు అంగీకరించడం లేదు. భారీ నష్టాలు ఉన్నప్పటికీ మాస్కో దళాలు యుద్ధభూమిలో ముందుకు సాగుతుండగా, ఉక్రెయిన్ డిమాండ్లను తాను అంగీకరించనని పుతిన్ ఇటీవల పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.
రష్యాతో సానుకూలంగా చర్చలు జరుగుతున్న తరుణంలో విట్కాఫ్ నుంచి ప్రకటన వచ్చింది. ఫ్లోరిడాలో చర్చలు నిర్మాణాత్మకంగా కొనసాగుతున్నాయని క్రెమ్లిన్ రాయబారీ శనివారం తెలిపారు.
‘‘చర్చలు నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. అవి ముందుగానే ప్రారంభించాము. నేడు కొనసాగుతాయి.’’ అని కిరిలమ డిమిత్రివ్ మియామీలో విలేకరులతో అన్నారు. ఇక్కడ డిమిత్రి విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ తో సమావేశం అయ్యారని రష్యన్ వార్తా సంస్థ ఆర్ఐఏ నివేదించింది.
ఉక్రెయిన్ కోసం అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆదివారం టెలిగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. దౌత్యప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయని, ఫ్లోరిడాలోని మా బృందం అమెరికన్లతో పనిచేస్తోందని చెప్పారు. ఉక్రెయిన్, రష్యా, అమెరికన్లతో కలిసి చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
రష్యన్ దళాలు ఉక్రెయిన్ లో మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నాయని, ఉక్రెనియన్ సుమీ సరిహద్దు ప్రాంతంలోని 50 మంది ఉక్రెనియన్లను రష్యన్ దళాలు కిడ్నాప్ చేశాయని ఆరోపణలు వస్తున్నాయి. అంతకుముందు గురువారం హ్రబోవ్స్కే గ్రామంలోని ప్రజలను చట్టవిరుద్దంగా అదుపులోకి తీసుకున్నాయని కూడా కీవ్ ఆరోపణలు గుప్పించింది.
ఫ్రెంచ్- రష్యన్ చర్చలు సాధ్యమే అని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కార్యాలయం తెలిపింది. పుతిన్ తో మాట్లాడానికి మాక్రాన్ కు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించింది.
‘‘రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ భవిష్యత్ కు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పింది. విరామం, శాంతి చర్చల అవకాశాలు స్పష్టంగా కనిపించిన వెంటనే పుతిన్ తో మాట్లాడటం మళ్లీ ఉపయోగకరంగా మారుతుంది’’ అని మాక్రాన్ కార్యాలయం తెలిపింది.
యూరోపియన్ యూనియన్ నాయకులు శుక్రవారం ఉక్రెయిన్ కు రాబోయే రెండేళ్ల పాటు సైనిక, ఆర్థిక అవసరాలను తీర్చడానికి 90 బిలియన్ యూరోలు అందించడానికి అంగీకరించారు.
అయితే వారు బెల్జియంతో విభేదాలు పరిష్కరించలేకపోయారు. దీని వలన నిధులను సేకరించడానికి స్తంభింప చేసిన రష్యన్ ఆస్తులను ఉపయోగించుకునే అవకాశం ఉంది.


Tags:    

Similar News