రష్యాతో వ్యాపారం చేశారో జాగ్రత్త.. భారత్ కు నాటో హెచ్చరిక

శాంతి చర్చలను పుతిన్ వ్యతిరేకిస్తున్నాడన్న నాటో సెక్రటరీ మార్క్ రుట్టే.. బ్రెజిల్, చైనాలకు సైతం;

Update: 2025-07-16 10:34 GMT
నాటో సెక్రటరీ మార్క్ రుట్టే

భారత్ కు నాటో హెచ్చరికలు జారీ చేసింది. రష్యాతో వ్యాపారం చేస్తే 100 శాతం ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. భారత్ తో పాటు బ్రెజిల్, చైనాలకు ఇదే విధమైన శిక్ష తప్పదని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే కఠిన స్వరంతో అన్నారు.

అమెరికా సెనేటర్లతో బుధవారం ఆయన సమావేశం అయ్యారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ, బీజింగ్, బ్రెజిల్ లోని నాయకులు శాంతి చర్చలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఒత్తిడి చేయాలని కోరారు.
‘‘చైనా, బ్రెజిల్ అధ్యక్షులు, భారత ప్రధానమంత్రి మీరు రష్యాతో వ్యాపారం చేస్తున్నారు. వారి నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ ఉంటే మీకు తెలుసు మాస్కో శాంతి చర్చలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి. అదే జరిగితే నేను వంద శాతం ఆంక్షలు విధిస్తాము’’ అని రుట్టే అన్నారు.
‘‘ఈ మూడు దేశాలకు ముఖ్యంగా నా ప్రొత్సాహం ఏమిటంటే మీరు ఇప్పుడు బీజింగ్ లేదా ఢిల్లీలో నివసిస్తుంటే లేదా మీరు బ్రెజిల్ అధ్యక్షులైతే మీరు దానిని పరిశీలించాలనుకోవచ్చు.
ఎందుకంటే ఇది మిమ్మల్నీ తీవ్రంగా దెబ్బతీస్తుంది’’ అని నాటో సెక్రటరీ జనరల్ అన్నారు. మూడు దేశాల నాయకులు పుతిన్ తో మాట్లాడి శాంతి చర్చలకు కట్టుబడి ఉండేలా చూడాలని ఆయన కోరారు.
‘‘కాబట్టి దయచేసి వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేసి శాంతి చర్చల గురించి ఆయన సీరియస్ గా తీసుకోవాలని చెప్పండి, లేకుంటే ఇది బ్రెజిల్, భారత్, చైనాపై భారీ స్థాయిలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది’’ అని రుట్టే అన్నారు.
ట్రంప్ హెచ్చరిక..
ఉక్రెయిన్ కు సైనిక మద్దతును విస్తరించే ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఒక రోజు తరువాత రష్యా తో వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.
ముఖ్యంగా రష్యాతో చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న బ్రిక్స్ దేశాలపై భారీ సుంకాలను విధిస్తామని ఆయన బెదిరించిన తరువాత రుట్టే ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘రష్యా ఎగుమతులపై వందశాతం సుంకాలను తగ్గించడం’’ గురించి ట్రంప్ హెచ్చరించారు. 50 రోజుల్లోపు ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు ఉంటాయని కూడా అన్నారు.
రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని ట్రంప్ కు ఇచ్చే కొత్త చట్టాన్ని 100 మందిలో 85 మంది అమెరికన్ సెనెటర్లు సమర్థిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
‘‘50 రోజుల చివరిలోపు మనకు ఒప్పందం కుదరకపోతే అది దారుణంగా ఉంటుంది. సుంకాలు కొనసాగుతాయి. ఇతర ఆంక్షలు కూడా కొనసాగుతాయి’’ అని ట్రంప్ అన్నారు.
అయితే ట్రంప్ తాజా బెదిరింపులకు రష్యా లైట్ గా తీసుకుంది. ‘‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చలు జరపడానికి రష్యా సిద్దంగా ఉంది. కానీ ఈ అల్టిమేటంలు ఆమోదయోగ్యం కావు. ఎటువంటి ఫలితాలు తీసుకురావు’’ అని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ అన్నారు.


Tags:    

Similar News