తిరుమలలో మార్చి 19న ఉగాది ఆస్థానం
x
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ సన్నిధి (ఫైల్)

తిరుమలలో మార్చి 19న ఉగాది ఆస్థానం

మే నెలలో నిర్వహించే విశేష ఉత్సవాలు ఇవీ..


తిరుమల శ్రీవారి క్షేత్రం నిత్య కల్యాణం పచ్చతోరణం. ఏడాది పొడవునా ఇక్కడ నిర్వహించే ఉత్సవాలు కనువిందు చేస్తుంటాయి. ఈ ఏడాది మార్చి నెలలో వరుసగా విశిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరుసగా మూడు ఆస్థానం అనే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమలో శ్రీవారి సన్నిధిలోని బంగారు వాకిలి వద్ద మూడు ఆస్థానాలు నిర్వహించే అరుదైన పర్వదినాలు రానున్నాయి. 19వ తేదీ ఉగాది ఆస్థానం, 27వ తేదీ శ్రీరామనవమి ఆస్థానం, 28వ తేదీ శ్రీరామ పట్టాభిషేక ఆష్థానం కూడా నిర్వహించడానికి కార్యక్రమాలు నిర్ణయించారు.
తిరుమలలో ఆగమశాస్త్రం ప్రకారం నిత్య కైంకర్యాలు నిర్వహించడం ఆచారం. ఆ కోవలోనే శ్రీవారికి ఆగమశాస్ర్త పండితులు కార్యక్రమాలను ఖరారు చేస్తారు. ఆ కేలండర్ ప్రకారం శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఉదయాత్పూర సేవల తో పాటు నిత్య కార్యక్రమాలను శ్రీవారి ఆలయ అర్చకులు పాటిస్తుంటారు.
తిరుమలలో మార్చి నెలలో నిర్వహించే విశేష పర్వదినాలు
మార్చి 2 :వ తేదీతో తిరుమలలో ఐదు రోజుులుగా నిర్వహిస్తున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు సమాప్తి అవుతాయి.
మార్చి 3 : కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహిస్తారు. తిరుమలలోని శేషాచల అడవుల్లో కుమారధార తీర్థ ముక్కోటి ఏడాదికి ఒకసారి నిర్వహించడం ఆనవాయితీ. సాహసోపేతంగా అడవుల్లో నడకమార్గంలో యాత్రికులు వెళ్లడానికి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడంలో టీటీడీ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
మూడో తేదీ చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మూసివేయనున్నారు. ఆ రోజుల ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది.
మార్చి 15న వైష్ణవ ఏకాదశి.

బంగారు వాకిలి వద్ద..

తిరుమల శ్రీవారి ఆలయం లోపల ఈ నెలలో మూడు ఆస్థానాలు నిర్వహించనున్నారు. 19,27,28వ తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమాల నేపథ్యంలో ఆర్జిత సేవలు కూడా టీటీడీ రద్దు చేసింది.
మార్చి 19 :వ తేదీ ఉగాది పండుగ సందర్భంగా శ్రీవారి ఆలయం సన్నిధికి ముందే బంగారువాకిలి వద్ద ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.
మార్చి 27 :వ తేదీ శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు.
మార్చి 28 :వ తేదీ శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం జరగనుంది ఈ కార్యక్రమాలు.
మార్చి 30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
Read More
Next Story