తల్లీ... నాకు ఊపిరి ఎందుకు పో(తీ)శావు..
x

తల్లీ... నాకు ఊపిరి ఎందుకు పో(తీ)శావు..

తిరుపతి స్వర్ణముఖి నది ఇసుకలో శోకిస్తున్న బాలక అంతరాత్మ..


తల్లి ఒడిలో సేద తీరాల్సిన రెండున్నర సంవత్సరాల పాప శవమై స్వర్ణముఖి నది ఇసుకమేట కింద అంతరాత్మ శోకిస్తోంది. తల్లి నాకెందుకు జన్మ ఇచ్చావు. అర్ధంతరంగా నా ఊపిరి ఎందుకు తీశావు. నీ ఆనందం కోసం నన్ను అంతం చేశావు తల్లీ. అని ఆ పసిపాప అంతరాత్మ ఘోషిస్తోంది. మాతృత్వానికి మచ్చ తెచ్చిన సంఘటన మరో తిరుపతిలో వెలుగులోకి వచ్చింది.

తిరుపతి నగరం ఆటోనగర్ ప్రాంతానికి చెందిన నాగరత్నమ్మ కూతురు ఆశాలత (19), రెండున్నర సంవత్సరాల మనవరాలు ఉంది.
"మూడు రోజులుగా నా కూతురు, మనవరాలు కనిపించడం లేదు ఏదన్నా అఘాగత్యానికి పాల్పడ్డారా" అని నాగరత్నమ్మ ఆందోళనకు గురైంది. ఈ నెల 19వ తేదీ ఈస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు తీసుకున్న ఈస్ట్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో దిమ్మెరపోయే వాస్తవం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు ద్వారా తెలిసింది. ఆటోనగర్ ప్రాంతానికి చెందిన ఆశాలతకు నాలుగేళ్ల కిందట రాజేష్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ దంపతులకు రెండున్నర సంవత్సరాల కుమార్తె ఉంది. మనస్ఫర్ధలతో భర్తతో విడిపోయిన ఆశాలతో రెండున్నేరళ సంవత్సరాల కూతురుతో కలిసి తిరుపతిలోని పోస్టల్ కాలనీలో నివాసం ఉంటుంది. ఆశాలత తల్లి నాగరత్నమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

రెండో పెళ్లికి అడ్డుగా ఉందనీ..

తిరుపతి నగరం పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్న ఆశాలతకు ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన రెడ్డికుమార్ తో వ్యక్తిగత పరిచయం ఏర్పడింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఆశాలత, ఆమె ప్రియుడు రెడ్డికుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేశారు.
రెండో పెళ్లి చేసుకునేందుకు రెండున్నర సంవత్సరాల కూతురును అడ్డు తొలగించుకోవాలని ఆశాలత దర్యాప్తులో అంగీకరించినట్లు సమాచారం.
"రెండున్నర సంవత్సరాల పాపను ప్రియుడితో కలిసి అంతం చేశారు. రెడ్డికుమార్ సొంత ఊరు ఏర్పేడు వద్ద ఉన్న స్వర్ణముఖి నదిలో ఆశలత తన కూతురిని పూడ్చినట్లు" పోలీసులు విచారణలో తేలిందని సమాచారం.
శ్రీకాళహస్తి నియోజకవర్గం సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో రెండున్నర సంవత్సరాల బాలికను పూడ్చిపెట్టిన ప్రదేశానికి నిందితులుగా గుర్తించిన ఆశాలత, రెడ్డి కుమార్ ను కూడా ఆ ప్రాంతానికి పోలీసులు తీసుకువెళ్లనున్నట్లు ఈస్ట్ పోలీసుల ద్వారా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి నిజాలు ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయని పోలీసులు ఈరోజు సాయంత్రం లోపల వెల్లడించే అవకాశం ఉంది.
Read More
Next Story