శ్రీశైలం నల్లమల అడవుల్లో పెద్ద పులులు గాండ్రిస్తున్నాయి. మహా శివరాత్రి నేపథ్యంలో అడవి కాలిబాటలో శివభక్తుల అడుగులు శ్రీశైలం వైపు సాగుతూనేన్నాయి. నల్లమల అడవిలో బుధవారం బుధవారం శివ భక్తులకు పెద్దపులి తారసపడింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అడవిలో గుంపులుగా వెళుతున్న భక్తుల బృందానికి పొదల్లో ఉన్న ఓ పెద్దపులి కనిపించింది.
"అదిగో అక్కడ పులి పొదల్లో ఉంది" అని ఓ యాత్రికుడు చెబుతుండగానే గాండ్రించింది. టార్చ్ లైట్ వెలుగులో పులిని ఓ యాత్రికుడు చూపించారు. ఆ అరుపు కూడా యాత్రికులను భయపెట్టలేదు. ఆ పులిని చూస్తూనే యాత్రికులు శ్రీశైలం వైపు నడక సాగించారు.
నల్లమల అడవిలోని పెచ్చెరువు వద్ద కాలి నడక దారిపక్కన పులి గాండ్రించింది. దోర్నాల మండలం సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఈ పెద్దపులి కనిపించింది. అన్నదానం కోసం సరుకులు తీసుకుని వెళుతున్న వాహనం నుంచి శ్రీశైలం వెళ్లే యాత్రికులు ఈ పెద్దపులిని సెల్ ఫోన్లో బంధించారు.
జనసంద్రంగా నల్లమల..
శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అత్యధికంగా కర్ణాటక నుంచి యాత్రికులు పాదయాత్రతో శ్రీశైలంకు చేరుకుంటున్నారు. దీంతో వన్య మృగాలకు ప్రధానంగా పెద్దపులులు, చిరుతలకు నిలయమైన నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్టు పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం శివ భక్తుల పాదయాత్ర సాగుతోంది. అటవీ ప్రాంతంలో 40 కిలోమీటర్లు చెంచుగూడేలా మీదుగా ప్రయాణిస్తున్నారు.
మార్గం ఇది..
కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి దోర్నాలకు వెళితే అక్కడ నుంచి వెంకటాపురం మీదుగా యాత్రికులు అడవిలోకి ప్రవేశిస్తున్నారు. సుమారు 40 కిలోమీటర్ల దూరం శ్రీశైలం వరకు దట్టమైన అడవిలోనే నడక సాగించాలి.. అంటే అటవీ మార్గంలోని పెద్ద చెరువు నాగులూరు భీమని కొలనుమీదుగా కైలాస పర్వతం వరకు చేరవచ్చు.. అక్కడ నుంచి రోడ్డుపైకి చేరితే శ్రీశైలంలోని భ్రమరాంబా సమేత మల్లికార్జున సన్నిధి వరకు సునాయాసంగా వెళ్లవచ్చు.ఈ అడవిలో గతంతో పోలిస్తే, నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య మరింత పెరిగింది.
గాండ్రిస్తున్న పులులు..
నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య మరింత పెరిగింది. నల్లమల అడవుల్లో ప్రస్తుతం పెద్దపురుల సంఖ్య 87 కు చేరిందని ఎన్ ఎస్ టి ఆర్ ఫీల్ డైరెక్టర్ విజయకుమార్ గతంలోనే మీడియాకు చెప్పారు. చిరుత పనుల సంఖ్య కూడా ఏమాత్రం తక్కువ లేదని అటవీ శాఖ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం. 2022లో పెద్దపుల సంఖ్య 74 ఉన్నట్లు సెన్సెస్ జరిగినప్పుడు నిర్ధారించామని విజయకుమార్ చెప్పారు.
"నల్లమల అడవుల్లో 50 కి పైగానే పులి పిల్లలు ఉన్నాయి" అనే విషయం లెక్కింపు సమయంలో స్పష్టమైందని అటవీశాఖ అధికారులు చెప్పారు.
"నల్లమల అడవుల్లో వన్నె మృగాలు స్వేచ్ఛగా సంచరించడానికి ఆస్కారం ఉంది.. వర్షాలు కురిసిన నేపథ్యంలో ఏం కావాలి నీరు ఉంది. వాటికి ఆహారం దొరుకుతుంది. ఆవాసం ఉండడానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి" పెద్ద పులుల సంతతి, చిరుత పురుల సంచారం పెరగడానికి ఇదే కారణమని ఎన్ ఎస్ టి ఆర్ డైరెక్టర్ విజయకుమార్ విశ్లేషించారు. పర్యావరణాన్ని కాపాడడం, అడవుల సంరక్షణలో ఇవన్నీ మృగాలు కీలక పాత్ర ప్రశ్నిస్తున్నందున వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు కూడా ఆయన వివరించారు.
భయం లేకుండా..
శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శించుకోవడానికి మహాశివరాత్రి సమయంలోనే యాత్రికులు నల్లమల అడవుల్లో సాహస పాదయాత్ర సాగిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల వారిది ఒక ఆచారం అయితే..
"మా ఆడబిడ్డకు మహాశివరాత్రి, ఉగాది నాడు సారి సమర్పించడం అనేది మా ఆచారం" అని కర్ణాటక ప్రాంత యాత్రికులు చెబుతారు. కొందరు యాత్రికులు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్లు నడక తోనే శ్రీశైలం చేరుకుంటారు. తెలుగు రాష్ట్రాలు కు చెందిన చాలామంది ఆత్మకూరు సమీపంలోని దోర్నాల వద్ద ఉన్న వెంకటాపురం గ్రామం నుంచి అడవిలోకి ప్రవేశించి కాలిబాటన సాగుతూ ఉంటారు.
శ్రీశైలం అడవుల్లో శివ భక్తులు నడిచి వెళుతూ ఉండగా పెద్దపులి కనిపించిన భయపడకుండా ముందుకు సాగారు. ఆ పులిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జనం ఎక్కువగా ఉండడం వల్ల పులి కూడా ముందుకు కదల్లే లేకపోయినట్లు ఈ వీడియో లో కనిపిస్తుంది.
శ్రీశైలం వెళ్లే మార్గంలోని నల్లమల అడవుల్లో యాత్రికుల రక్షణ కోసం మరింత కట్టు తీర్థమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని విషయం ఈ ఘటన స్పష్టం చేస్తోంది. అటవీశాఖ అధికారులు కూడా ఆ దిశగానే దృష్టి సారించినట్లు సమాచారం.