
శ్రీవారి లడ్డు: ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి లెక్క తేలింది..
36 మంది నిందితుల్లో.. 12 మంది టీటీడీ ఉద్యోగులని నిర్ధారించిన సిట్.
శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యి లెక్కలు సిట్ (special investigate your team) అధికారులు తేల్చారు. కల్తీ నెయ్యి కేసులో 36 మందిని నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఇందులో 24 మందిని నిందితులు ఉండగా, మరో 12 మంది టీటీడీ ఉద్యోగుల ప్రమేయం ఉందని కోర్టుకు నివేదించారు. 2019 నుంచి 2024 వరకు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారని దర్యాప్తులో తేలిన అంశాలను ప్రస్తావిస్తూ 600 పేజీల చార్జిషీట్ ఏసిబి కోర్టులో దాఖలు చేశారు. పాలు సేకరించని సంస్థ 60 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయడానికి దారితీసిన వ్యవహారంపై లోతుగా దర్యాప్తు సాగింది. దీనివల్ల టీటీడీకి 251 కోట్ల డబ్బు దుర్వినియోగం చేయడమే కాకుండా, శ్రీవారి యాత్రికుల మనోభావాలను దెబ్బతీశారని దర్యాప్తు సంస్థ తేల్చింది.
రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం వెలుగు చూసింది.
2024 సెప్టెంబర్ 18వ తేదీ జరిగిన టిడిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ,
"తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారు. ఇందులో ఆవు, గొడ్డు కొవ్వు కలిపిన నెయ్యి ఉంది" అని నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి.
ఫిర్యాదే.. నిందితుడు...
తిరుమల కల్తీ నెయ్యి సరఫరాపై అధికారుల ఆదేశాలతో టీటీడీ మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేసిన సుబ్రమణ్యం తిరుపతి ఈస్టు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సిట్ దర్యాప్తు చేపట్టిన తరువాత ఆయనను ఏ-29 నిందితుడా అరెస్టు చేశారు. 2017 -18, 2020-2023 కాలంలో టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ గా ఆయన పనిచేశారు.
"డెయిరీ ప్లాంట్లు ప్రత్యక్ష్యంగా పరిశీలించకుండానే అనుకూలం నివేదికలు ఇచ్చారు. అర్హత లేని భోలేబాబా డైరీ, వైష్ణవీడైరీ, మలంగంగా మిల్క్ అగ్రో ప్రొటక్ట్స్ లిమిటెడ్ నుంచి తిరుమలకు నెయ్యి సరాఫరా చేయించారు. వెండి ప్లేటు, శాంసంగ్ మొబైల్ ఫోన్, రూ.3.50 లక్షలు లంచం తీసుకున్నారు" అని సిట్ అధికారులు సుబ్రమణ్యంపై అభియోగాలు మోపారు.
చెన్నైలో దొరికిన తీగ..
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో మొదట రాష్ట్ర ప్రభుత్వం సెట్ (SIT) ఏర్పాటు చేసింది, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ సారధ్యంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక బృందం ఏర్పాటయింది.
టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడులోని దిండిగల్ వద్ద ఉన్న ఏఆర్ మిల్క్ డైరీపై మొదట సందేహాలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశంతో మొదట గుంటూరు రేంజ్ డీఐజీ సర్వశిష్ట త్రిపాఠి సారధ్యంలోని దర్యాప్తు బృందం మూడు రోజుల దర్యాప్తు చేసింది. ఈ వ్యవహారంపై జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సిబిఐ దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. అందులో కూడా ఏపీ అధికారులు దర్యాప్తులో ఉండాలని ఆదేశం జారీ చేసింది.
ఎన్నో రాష్ట్రాల్లో మూలాలు..
తమిళనాడులోని దిండిగల్ వద్ద ఉన్న ఏఆర్ డైరీ నుంచి దర్యాప్తు ప్రారంభిస్తే వాటి మూలాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరించి ఉన్నట్లు తేలింది. కల్తీ నెయ్యి కేసులో విచారణకు ఏర్పాటైన దర్యాప్తు కోసం సిబిఐ జెడి వీరేష్ ప్రభు, విశాఖపట్నం డిఐజి మురళి రాంబ, ఏపీ నుంచి గుంటూరు ఎంజి ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్, ఎఫ్ఎస్ఏఐ నుంచి డాక్టర్ సత్యాన్ కుమార్ పాండా దర్యాప్తు బృందంలో సభ్యులుగా పని చేశారు. ఈ కేసు దర్యాప్తులో తిరుపతి అదనపు ఎస్పి వెంకట్రావును విచారణ అధికారిగా నియమించారు. దర్యాప్తు కోసం ప్రశ్నలు తయారు చేసిన అధికారులు వైసీపీ నేతలు, టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఈఓ ఏవి ధర్మారెడ్డి తో పాటు వారి కాలంలో పనిచేసిన టిటిడి పాలక మండల సభ్యులను విచారణ చేశారు. అంతేకాకుండా టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు కూడా ప్రశ్నించారు.
12 రాష్ట్రాల్లో విచారణ
టిటిడి కి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఆరోపణలపై మొదట తమిళనాడులో ఉన్న ఏ ఆర్ మిల్క్ ప్రొడక్ట్స్ డైరీ పై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ఈ మూలాలు గుజరాత్ సహా అనేక రాష్ట్రాలకు విస్తరించి ఉందని గుర్తించడంతో ఏపీతోపాటు 12 రాష్ట్రాల్లోని పాలకర్మాగారాలు, వాటితో ప్రమేయం ఉన్న వ్యక్తులను విచారణ చేసింది.
టీటీడీకి 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి 235 కోట్ల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ సారథ్యంలోని సిట్ అధికారులు నిర్ధారించారు. నెయ్యి సరఫరా కాంటాక్ట్ తమిళనాడులోని ఏఆర్ డైరీ ఇచ్చినప్పటికీ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న ఉత్తరాఖండ్ కు చెందిన హోలీ బాబా డైరీ కీలక పాత్ర పోషించని దర్యాప్తులో స్పష్టం చేసింది. ఈ డైరీ యజమానులే కీలక సూత్రధారులుగా వ్యవహరించినట్లు కూడా తేల్చారని సమాచారం.
తమిళనాడులోని దిండిగల్ వద్ద ఉన్న ఏఆర్ డైరీ నుంచి ప్రారంభమైన దర్యాప్తులో బోలే బాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు తమిళ్ జైన్, విపిన్ జైన్ ప్రధాన పాత్రధారులుగా సిబిఐ గుర్తించింది. కల్తీ నెయ్యి తయారీ కోసం ఢిల్లీ హర్యానా రాజస్థాన్ నుంచి రసాయనాలు తెప్పించి ఉత్తరాఖండ్లో తయారు చేశారని విచారణలో తేలింది.
2024 ఫిబ్రవరి 9వ తేదీ ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖరన్, ఉత్తరాఖండ్ డైరీ నుంచి ప్రతినిధులు జైన్ విపిన్ జైన్, అపూర్వ విజయకాంత్ చావ్డా, ఆ తర్వాత అజయ్ కుమార్ సుగంథ్, ఆశిష్ అగర్వాల్, హరిమోహన్ రాణాను అరెస్టు చేశారు.
పాల సేకరణే లేదు..
"ఉత్తరాఖండ్ లోని బోలె బాబా డైరీ పాల సేకరణ చేయకుండా, కల్తీ నెయ్యి సరఫరాలో కీలకంగా వ్యవహరించింది" అని కూడా సిపిఐ సీట్ గెలిచినట్లు సమాచారం. పామాయిల్, పాము కార్నెల్ ఆయిల్ తో సిద్ధం చేసిన పదార్థాన్ని నెయ్యి అని చెబుతూ టిటిడి కి అందించినట్లు స్పష్టం చేశారు. దీనికి నెయ్యి తరహా వాసన రావడానికి బీటా కెరోటిన్ లాంటి రసాయనాలను మిళితం చేశారని కూడా దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు. ఈ తరహాలోనే ఐదేళ్ల కాలంలో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరిపరా జరిగినట్లు సిబిఐ దర్యాప్తులో తేల్చింది.
"కల్తీ నెయ్యి ద్వారా 235 కోట్ల రూపాయల టీటీడీ నిధులు దుర్వినియోగం చేయడం, తిరుమల శ్రీవారి యాత్రికుల మనోభావాలను కూడా దెబ్బతీశారు" అని cbi తన చార్జిషీట్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
"టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో కొందరు ఉద్యోగులు, అధికారులు మిలాఖత్ అయ్యారు" అని కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
వై వి సుబ్బారెడ్డి పీఏ పాత్ర
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో వైసిపి ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఎ (Personal Assistent) కె. చిన్నఅప్పన్న పాత్ర కీలకంగా ఉన్నట్లు సిబిఐ అధికారులు నిర్ధారించారు.
"పాలకర్మా గారాల సంస్థల ప్రతినిధులతో చిన్న అప్పన్న బేరసారాలు జరపడం, హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారు. అప్పన్న బ్యాంకు ఖాతాలో 2019 నుంచి 2024 కాలంలో 4.69 కోట్ల రూపాయలు జమ అయిన సొమ్ము నుంచి 4.64 కోట్ల రూపాయలు వివిధ ఖాతాలకు మళ్లించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థల నుంచి చిన్న అప్పన్న కిలోకి 25 రూపాయల లంచం కూడా డిమాండ్ చేసి తీసుకున్నారు" అనే విషయాలను కూడా సిబిఐ తన చార్జిషీట్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
నిబంధనలకు పాతర
టీటీడీకి మేలు రకం నెయ్యి సరఫరా చేయడానికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. పాలు సేకరించే సంస్థలే నెయ్యిని సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలను 2019లో సడలించారు. టిటిడి కి నెయ్యి, సరఫరా చేసే పాల పరిశ్రమలకు పాల సేకరణ, విన్న ద్వారా నెయ్యి ఉత్పత్తిలో సామర్థ్యంతో సంబంధం లేకుండా గత టీటీడీ పాలక మండలి నిబంధనను సరళం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలి అంటే 250 కోట్ల రూపాయల టర్నోవర్ అవసరం. దీనిని 150 కోట్లకు తగ్గించారు. నిబంధనలను ఇలా సరళించడం వల్లే కల్తీ నెయ్యి సరఫరాకు తెర తీసినట్లు సిబిఐ గుర్తించినట్లు సమాచారం.
ఈ అంశాల ఆధారంగానే కల్తీ నెయ్యి కేసులో రంగంలోకి దిగిన సిబిఐ సారధ్యంలోని సిట్ అధికారులు 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు, తనిఖీలు చేశారు.
ఇందులో భాగంగానే, టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డి, పాలగమండలిలో ఎక్స్ అఫీషియస్ సభ్యుడిగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు టీటీడీ కొనుగోలు కమిటీలో సభ్యులుగా పనిచేసిన వారిలో టిడిపి కూటమిలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, కోవూరు టిడిపి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని కూడా ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి సభ్యులుగా పనిచేసిన వారంతా ఓకే మాట చెప్పారనేది సమాచారం.
"నెయ్యి కొనుగోలులో మా పాత్ర ఏమీ లేదు. అంతా అధికారులదే" అని దర్యాప్తు సందర్భంగా సిట్ అధికారుల ముందు చెప్పారనేది మీడియా కథనాలు.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన సమయంలో మార్కెటింగ్ విభాగం అధికారులను కూడా సిబిఐ సీట్ అధికారులు అరెస్టు చేశారు.
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. దశలవారీగా 15 నెలల పాటు సాగించిన దర్యాప్తులో సీబీఐ సారధ్యంలోని సీట్ అధికారులు నిందితులను గుర్తించారు. ఇందులో మరో పరిణయం మంది హస్తం ఉన్నట్లు అధికారులు కోర్టుకు నివేదించిన చార్జిషీట్లో ప్రస్తావించడం గమనించదగిన విషయం. టీటీడీలో పనిచేసే సిబ్బందిలో ఇదే విషయంపై ఇంకా కలవరం వీడలేదు. న్యాయస్థానంలో జరిగే విచారణలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.
Next Story

