
తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురం శ్రీవేదవల్లి సమేత వేదనారాయణస్వామి ఆలయంలోకి ప్రవేశిస్తున్న సూర్యకిరణాలు (ఫైల్)
సూర్యాస్తమయాన వేదనాయణుడి విగ్రహాన్ని స్పర్శించనున్న కిరణాలు
పడమటి సంధ్యారాగంలో 24వ తేదీ నుంచి మూడు రోజులు అద్భుత దృశ్య కావ్యం.
మార్చి 21న మత్స్య త్స్య జయంతి
24 నుంచి 28వ తేదీ వరకు సూర్యపూజ
సాయంత్రం కనువిందు చేయనున్న సూర్యకిరణాలు
రాష్ట్రంలోని ప్రధాన సూర్యదేవాలయాల్లో తిరుపతి జిల్లా నాగలాపురం వద్ద ఉన్న శ్రీవేదవల్లి సమేత వేదనారాయణస్వామి ఆలయం కూడా ఒకటి. రాజగోపురం లోపలి నుంచి చొచ్చుకుని వచ్చే సూర్యకిరణాలు 630 అడుగుల దూరంలోని వేదనారాయణస్వామి విగ్రహాన్ని స్పర్శించడమే ఇక్కడి ప్రత్యేకత. ఈ అద్భుత దృశ్యం ఏడాదికి ఒకసారి మాత్రమే కనిపిస్తుంది. ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజులపాటు సాయంత్రం వేళ ఈ అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. ఈ నెల 21వ తేదీ మత్స్య జయంతి నిర్వహణతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అరసవిల్లిలో సూర్యజయంతి నాడు ఒక రోజు మాత్రమే విగ్రహాన్ని సూర్యకిరణాలు స్పర్శించే దృశ్యం కనిపిస్తుంది.
"తిరుపతి జిల్లాలోని నాగలాపురం వద్ద ఉన్న వేదనారాయణస్వామి వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాలు మార్చి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం " అని టీటీడీ అధికారులు తెలిపారు.
సూర్యాస్తమయం జరిగే సమయంలో పడమటి సంధ్యారాగం దృశ్యకావ్యాన్ని ఆవిష్కరిస్తుంది. 630 అడుగుల దూరంలో ఆలయంలోని విగ్రహాలను సూర్యకిరణాలు దూసుకుని వెళతాయి. ఆ కిరణాలు మూడు రోజులు వరుసగా ఈ నెల 24వ తేదీ నుంచి నాగలాపురం వద్ద కనువిందు చేయనుంది. సంప్రదాయ ఆలయ కళలో అంతుచిక్కని రహస్యానికి ఇదో అద్భుతంగా చెప్పవచ్చు.
ఇదీ కథనం
చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీవేదనారాయణస్వామి దేవాలయాన్ని పల్లవులు, శ్రీకృష్ణదేవరాలవారి కాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు మత్య్యావతారం (చేప)లో ఉన్నప్రాచీనా ఆలయం.
శ్రీమహావిష్ణువు మత్స్యావతారం రూపంలో సంవత్సరాల పాటు యుద్ధం చేశారంట. అలసిని స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలనుప్రసరింపచేయడమే సూర్యపూజోత్సవం అని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి 630 అడుగుల దూరంలో ఉన్న మూలవిరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలను సూర్యకిరణాలు స్పర్శిస్తాయి. రెండో రోజు స్వామివారి విగ్రహం నాభిపైన, మూడో రోజు స్వామి నుదురు (శిరస్సు)పై సూర్యకిరణాలు ప్రసరించడం ద్వారా దివ్యరూపాన్ని మరింత తేజోవంతంగా కనిపించేలా చేస్తాయి.
ఆలయ ప్రత్యేకతలు..
సోమకుడనే రాక్షసుడి నువంచి వేదాలను రక్షించడానికి విష్ణువు మత్స్యావతామరం ధరించిన ప్రదేశంలో నాగలాపురం ఆలయానికి ఉన్న చరిత్రం. శ్రీకృష్ణదేవరాయలువారు తల్లి నాగమాంబికా గౌరవార్ధం ఈ ఆలయం నిర్మించినట్లు కూడా కథనం ఉంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో సూర్యపూజ నిర్వహించడం ఆనవాయితీా 1967 సెప్టెంబర్ 24వ తేదీ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న టీటీడీ ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
సూర్య పూజ నాడు ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సూర్యరశ్మి నేరుగా ప్రధాన మూలమూర్తులను స్పర్శించే విధంగా ఆలయ నిర్మాణం చేయడంలో స్థపతులు తమ మేధస్సును ప్రదర్శించారు.
ఎలా వెళ్లాలంటే...
తిరుపతి నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో నాగలాపురం ఉంది. చెన్నై నగరం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు నగరాల నుంచి ఆర్టీసీ బస్సులు నాగలాపురం వెళ్లడానికి అందుబాటులో ఉన్నాయి.
21వ తేదీ మత్స్య జయంతి
శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 21వ తేదీ మత్స్య జయంతి నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం ఐదు గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి, తోమాల, అర్చన నిర్వహించనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారికి మత్స్య జయంతి ఉత్సవం(తిరువీధి ఉత్సవం) నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శాంతిహోమం, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగుతు భక్తులను అనుగ్రహిస్తారు.
సూర్యజయంతి ఉత్సవాలు..
శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వార్షిక సూర్యపూజ మహోత్సవం, తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు భక్తులకు సూర్యపూజ, దర్శనం కల్పించనున్నారు. రాత్రి 7.30 గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది.
24 నుంచి తెప్పోత్సవాలు
శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. రోజూ సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు తెప్పోత్పవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారు, రెండవ రోజు గోదాదేవి సమేత వేదనారాయణస్వామివారు, మూడవ రోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, నాల్గవ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేదనారాయణస్వామివారు, ఐదవ రోజు శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు. తెప్పోత్సవాల అనంతరం మొదటి మూడు రోజులు స్వామి, అమ్మవార్ల (తిరుచ్చి) తిరువీధి ఉత్సవం, నాల్గవ రోజు ముత్యపుపందిరి వాహనం, ఐదవ రోజు పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
Next Story

