టీటీడీలో ఇంజినీర్ల నియామకానికి మోక్షం..
x
తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

టీటీడీలో ఇంజినీర్ల నియామకానికి మోక్షం..

వేదపారాయణదారులకు తీపి కబురు.


టిటిడిలోని ఇంజినీరింగ్ విభాగంలో రెండళ్ల తరువాత సివిల్ ఇంజినీర్ల ఏఈ ( Assistant Civil Engineer ) పోస్టుల భర్తీకి మోక్షం లభించింది. 56 ఏఈఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్ నెలలో అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు తేదీలు ఖరారు చేయాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ సమాచారం పాదర్శకంగా కూడా ఉండాలని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు. యాత్రికులు కోరే సమాచారం టీటీడీ వెబ్ సైట్ లో నిరంతరంగా అప్ డేట్ చేయాలన్నారు. వేదపారాయణదారులకు కూడా టీటీడీ తీపి కబురు అందించింది.

"టీటీడీ తోపాటు ఇతర ఆలయాల్లో 536 మం వేదపారయణదారుల నియామానికి ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేయండి" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం టిటిడి జేఈఓ వి. వీరబ్రహ్మం, ఎఫ్‌ఏ అండ్ సీఏఓ ఓ. బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణతో పాటు ఇతర అధికారులతో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షించారు.
రూ. ఐదే వేల కోట్ల బడ్జెట్
టీటీడీ 2025- 26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌ కు ధర్మకర్తల మండలి ఆమోదించింది. గత ఏడాది మార్చి 24వ తేదీ జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో బడ్జెట్ ఆమోదించినట్టు ఛైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో క్యాపిటల్ వర్కులకు 350 కోట్ల రూపాయలు కేటాయించారు. 150 కోట్లు ఇంజినీరింగ్ విభాగంలో పనుల నిర్వహణకు కేటాయించారు.
తిరుమలతో పాటు తిరుపతి దేశంలోని అనేక ప్రాంతాల్లో టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద పనులు నిరంతరాయంగా సాగుతుంటాయి. అందులో కొత్త పనులు చేపట్టడం, భవనాలు, రహదారుల ఆధునీకరన వంటి పనుల్లో టీటీడీ నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తుందనడంలో సందేహం లేదు.
26 నెలల తరువాత
టీటీడీలో ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణ కోసం అధికారులు, సిబ్బందిపై పనిభారం తగ్గించే లక్ష్యంగా ఏఈ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ 2023 నవంబర్ 23వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి ఈ పరీక్ష నిర్వహణ వాయిదా పడుతూనే ఉంది.
1) అసిస్టెంబ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు 27
2) అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టులు 10
3) అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 19
మొత్తం 56 పోస్టుల కోసం 37,121 మంది నిరుద్యోగ ఇంజినీరింగ్ పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నారు. దీనికోసం 42 సంవత్సరాల వయోపరిమితి విధించింది. 2024 ఎన్నికలు సమీపించడంతో ఈ అర్హత పరీక్ష నిర్వహణ మాటే మరిచారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పరీక్ష నిర్వహించాలని భావించారు. అనేక కారణాలతో మళ్లీ వాయిదా పడింది.
"టీటీడీలో ఏఈల నియామానికి ఏప్రిల్ నెలల అర్హత పరీక్షకు తేదీలు ఖరారు చేయాలని" టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిరుద్యోగుల్లో మరింత ఆశలు చిగురించాయి. 26 నెలల తరువాత తరువాత నిర్వహించబోతున్న ఈ పరీక్షకు హాజరు కావాలని దరఖాస్తు చేసిన వారిలో చాలా మందికి వయోపరిమితి దాటిపోయిన పరిస్థితి ఉంది.
వేద పారాయణదారులకు తీపి కబురు
టీటీడీలో కైంకర్యాల నిర్వహణలో వేదపారాయణదారులది కీలకపాత్ర. వారి ఎంపికోసం 2025 ఆగష్టులో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆ తరువాత అనేక ఆరోపణల నేపథ్యంలో నియామకాలు తాత్కాలికంగా ఆగాయి. ఎంపిక చేసిన వారిలో 164 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
"టీటీడీతో పాటు ఇతర ఆలయాల్లో మిగతా 536 మందిని నియమించడానికి ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేస్తాం" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. టీటీడీ సర్వీసెస్ విభాగం వేదపారాయణదారులకు నియమాక ఉత్వర్వులు జారీ చేయాలని కూడా ఆయన ఆదేశించారు.
"టిటిడి ప్రమాణాలకు అనుగుణంగా 150 మంది అర్చకులు, 68 మంది పోటు వర్కర్లకు ఫిబ్రవరి నెలలో మూడు విడతలుగా శిక్షణ ఇస్తాం" అని కూడా ఈఓ సింఘాల్ చెప్పారు దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా ఆయన ఆదేశించారు.
పారదర్శక సేవలు
టీటీడీలో సేవలన్నీ పారదర్శకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు టీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
"యాత్రికుల కోసం మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాలి. టిటిడి సేవలు, సమాచారం తదితర అంశాలపై భక్తుల నుంచి వస్తున్న ఈ - మెయిల్స్‌ విశ్లేషించాలి. పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు పంపించండి" అని ఈఓ సింఘాల్ ఆదేశించారు. యాత్రికులు కోరుతున్న తాజా సమాచారాన్ని టిటిడి వెబ్‌సైట్‌లో నిరంతరం అప్‌డేట్ చేయాలని సూచించారు.
ఆలయాల నిర్వహణపై
దేశంలోని అనేక రాష్ట్రాలలో టిటిడి ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని ఈఓ సింఘాల్ గుర్తు చేశారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్‌లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాలలో టిటిడి ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిర్మాణాలకు స్థలాలను కూడా కేటాయించినట్లు తెలిపారు. ఆ రాష్ట్రాల అధికారులతో టిటిడి అధికారులు చర్చించి, కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలక మండలి సమావేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
"చెన్నైలో కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్‌లు, పరిపాలనా అనుమతుల అంశాలను టిటిడి బోర్డు ఆమోదానికి సిద్ధం చేయండి" అని ఆదేశించారు. రుషికేష్‌లోని పీఏసీ (Pilgrim Amenities Complex) కూలిపోయే స్థితిలో ఉందంటూ, టిటిడి ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేయడం ద్వారా ఫిబ్రవరి నెలలోపు నూతన పీఏసీ నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
Read More
Next Story