
నగరిలో స్టాల్స్ పరిశీలిస్తున్న సీఎం నారా చంద్రబాబు
సీఎం పర్యటనకు ప్రతికూల వాతావరణం..
గంట ఆలస్యంగా నగరికి చేరుకున్న చంద్రబాబు
చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటనకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. సుమారు గంట ఆలస్యంగా ఆయన నగరికి చేరుకున్నారు. నిర్ణీత కార్యక్రమం ప్రకారం నగరి నియోజకవర్గంలో శనివారం ఉదయం ముఖ్యమంత్రి పర్యటన కోసం అన్నయ్య ఏర్పాట్లు చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన ఉదయం ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:20 ఆ గంటలకు నగరి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కు చేరుకోవాల్సి ఉంది. నగిరి లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 11 గంటలకు ప్రజా వేదిక నుంచి ప్రజలతో మాట్లాడేందుకు ఏర్పాట్లు జరిగాయి. పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించే హాస్టల్ను కూడా ఆయన పరిశీలించడానికి ఏర్పాట్లు జరిగాయి.
ప్రతికూల వాతావరణం
రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆకాశం మెగావృతమై ఉంది. మబ్బులు కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు కూడా జాతీయ రహదారులపై ఇబ్బంది వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో ఆకాశంలో కూడా మంచు తెరలు దట్టంగా వ్యాపించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 11:30 గంటల నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కూడా కురిశాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు భావించారు. వాతావరణ శాఖ నుంచి పూర్తి క్లియరెన్స్ తీసుకున్న తరువాత ఇబ్బందులు లేవని నిర్ధారించుకున్న తరువాత ఆయన పర్యటనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
Next Story

