నా దేహం వైద్య విద్యకు పాఠం కావాలి..
x
టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కు అపిడవిట్ అందిస్తున్న సూపరింటెండెంట్ కట్టమంచి ఇందిర

నా దేహం వైద్య విద్యకు పాఠం కావాలి..

మరణానంతరం భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి దానం ఇస్తూ టీటీడీ మహిళా అధికారి నిర్ణయం


భర్తలో భార్య సగం దేహం అంటారు. భర్త బాటలోనే టీటీడీ మహిళా అధికారి నడవాలని నిర్ణయించుకున్నారు. తన భర్త లాగే మరణానంతరం నా భౌతికకాయాన్ని శ్రీపద్మావతీ మహిళా వైద్య కాలేజీకి డొనేషన్ గా తీసుకోండని టీటీడీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ కట్టమంచి ఇందర అఫిడవిట్ సమర్పించారు.

"మరణానంతరం దేహం మట్టిలో కలవడం కంటే, విద్యార్థులకు పాఠం కావాలి" అని టిటిడి మహిళా సంక్షేమ విభాగం అధ్యక్షురాలు, ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ కట్టమంచి ఇందిర అన్నారు. గత ఏడాది మరణానంతరం ఆమె భర్త శివాజీ మృతదేహాన్ని ఆమె స్వయంగా వైద్య కాలేజీకి అందించారు. నేను అదే బాటలో ఉంటానని స్పష్టం చేశారు.
"నా దేహం వైద్య విద్యార్థులకు పాఠం కావాలి. నా మరణానంతరం నా భౌతికకాయాన్ని తిరుపతిలోని శ్రీపద్మావతి వైద్య కళాశాలకు దానంగా తీసుకోండి" అని టీటీడీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఆడిటింగ్ విభాగం సూపరింటెండెంట్ కట్టమంచి ఇందిర నిర్ణయం తీసుకున్నారు. ఆమె భర్త డాక్టర్ శివాజీ కూడా గత ఏడాది నవంబర్ లో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని కూడా మెడికల్ కాలేజీకి డొనేషన్ ఇచ్చారు.

"నా మరణానంతరం పార్థీవదేహాన్నిస్విమ్స్ శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇవ్వడానికి అంగీకారం తెలియజేస్తున్నా" అని ఇందరి ప్రకటించారు.ఆ మేరకు శుక్రవారం టిటిడి పరిపాలనా భవనంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కు అఫిడవిట్ అందజేశారు.

తిరుపతిలోని లీలా మహల్ వద్ద కొందరికి ఉపాధి చూపించవచ్చు అనే ఉద్దేశ్యంతో కే. ఇందరి, శివాజీ దంపతులు కార్పొరేట్ స్కూలు స్థాపించారు. ఎందరో విద్యార్థులకు తక్కువ ఫీజులతో చదువు చెప్పించారు.

విద్యార్థులకు ఉపయోగపడాలనే..

మరణం తరువాత భౌతికకాయం మట్టిలో కలిసిపోకూడదు. వైద్య వైద్యార్థులు పరిశోధన, పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగపడాలి అనేది నా అభిప్రాయమని టీటీడీ ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ కట్టమంచి ఇందిర వ్యాఖ్యానించారు. గత ఏడాది నవంబర్ 15వ తేదీ న భర్త డాక్టర్ కె. శివాజీ చనిపోయారని ఆమో తెలిపారు. నా భర్త భౌతికకాయాన్ని కూడా మెడికల్ కాలేజీలోకి డొనేషన్ ఇచ్చిన విషయాన్ని ఇందిర గుర్తు చేశారు. డాక్టర్ కే. శివాజీ అనేక కార్పొరేట్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా పనిచేశారని ఆమె వివరించారు.
"నా భర్త చనిపోయినప్పుడు ఆయన భౌతికకాయం వైద్య విద్యార్థులకు పాఠంగా ఉపయోగపడింది. నా మరణానంతరం కూడా నా శరీరం వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలనేది నా ఆశయం" అని ఇందరి స్పష్టం చేశారు.

టీటీడీ ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ కట్టమంచి ఇందిర నిర్ణయాన్ని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు. "మరణానంతరం పార్థీవదేహం మట్టిలో కలిసిపోవడం కంటే మెడికల్ విద్యార్థులకు ఉపయోగపడేలా కె. ఇందిర తీసుకున్న నిర్ణయం అభినందనీయం" అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి మనిషికీ సమాజంపై ప్రేమ, సేవాభావం ఉండాలనేందుకు ఇందిర, శివాజీ దంపతులు స్ఫూర్తిదాయకం అన్నారు. ఇందిర అందించిన అఫిడవిట్ ను శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల అనాటమి డిపార్ట్ మెంట్ అధికారులకు టిటిడీ ఈఓ సింఘాల్ పంపించారు.


Read More
Next Story