
తెలంగాణ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ. శరత్
టీటీడీ జేఈఓగా తెలంగాణ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
సీఎం బాబుకు సన్నిహితంగా మెలిగిన శరత్ కు అవకాశం.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) జేఈవోగా తెలంగాణ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ. శరత్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఏడాది తరువాత ఈ పోస్టును టీడీపీ కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. తిరుపతిలో సరిగ్గా సంవత్సరం కిందట తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో జేఈఓ గౌతమిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.
టీటీడీ జేఈఓగా నియమితులైన తెలంగాణ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ. శరత్ టీటీడీ విద్య, ఆరోగ్య విభాగాలను పర్యవేక్షించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన డాక్టర్ ఏ. శరత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన అధికారుల్లో ఒకరుగా పేరు పొందారు. 2004లో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నకుప్పంలో కడా (kuppam urban development authority) ప్రత్యేక అధికారిగా పనిచేశారు.
తెలంగాణలో..
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ డాక్టర్ ఏ. శరత్ రిటైర్ అయ్యారు. మూడు నెలల వ్యవధిలోనే అంటే 2025 ఆగస్టు 19వ తేదీ ఆయనను తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్) చైర్మన్గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నియమించారు.
రెండో జేఈఓ
టీటీడీలో మొదటి నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) తర్వాత, తిరుపతి, తిరుమలలో ఐఏఎస్ అధికారులను జేఈవోలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించేది. 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిటిడి కి తిరుపతిలో ఇద్దరు జేఈవో లను నియమించే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఒకరు పరిపాలన వ్యవహారాలు పర్యవేక్షిస్తే, మరో ఐఏఎస్ అధికారి విద్య, ఆరోగ్య విభాగాలపై శ్రద్ధ తీసుకునేవారు.
2025 జనవరి 9వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేయడంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, 40 మంది గాయపడిన సంఘటన తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో టీటీడీ జేఈవోగా ఉన్న గౌతమిని బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ఆ పోస్టును సంవత్సరం తర్వాత టిడిపి కూటమి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ శరత్ ను నియమించడం ద్వారా భర్తీ చేసింది.
బాబుకు సన్నిహిత అధికారి..
టిటిడి జేఈఓ గా నియమితులైన తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ అధికారి డాక్టర్ ఏ శరత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగిన అధికారుల్లో ఒకరు. 2005 సర్వీసెస్ అండ్ బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ ఆయన రిటైర్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డాక్టర్ ఏ శరత్ కడ (kuppam urban development authority) ప్రత్యేక అధికారిగా పనిచేశారు. నారా చంద్రబాబు సీఎం గా ఉన్న, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా డాక్టర్ ఏ శరత్ ఆయన వెంటే ఉన్నారు. 2004 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అప్పటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఆ అధికారులను మార్చలేదు.
తెలంగాణ సీఎంలు మెచ్చిన అధికారి
తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా డాక్టర్ ఎస్ శరత్ కీలక బాధ్యతలు నిర్వహించారు. సంగారెడ్డి తర్వాత కామారెడ్డి జిల్లా కలెక్టర్గా పని చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభానినికి వచ్చిన సందర్భంగా ఆనాటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళ్లు మొక్కడంపై విమర్శలు చెలరేగాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా పనిచేస్తూ రిటైర్డ్ కావడానికి ముందు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అదే సమయంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో గత ఏడాది తెలంగాణ సీఎం ఏ రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొని వస్తుండగా కాళ్లు మొక్కిన ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఉద్యోగ విరమణ చేసిన మూడు నెలల తర్వాత ఆయన ను తెలంగాణ సీఎం కి రేవంత్ రెడ్డి"తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్"కు నియమించారు. అంతకుముందు కామారెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్ చేసి శరత్ ఈ ఆఫీస్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టం అమలు చేయడం ద్వారా పారదర్శక పాలన అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. స్వచ్ఛభారత్, రైతు వేదికలు, పల్లె ప్రగతి వంటి పథకాల అమలులో కూడా తెలంగాణలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ శరత్ కీలక పాత్ర వహించడం ద్వారా ప్రజల మన్ననలు అందుకున్నారు.
మొదటి నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి jeoగా రిటైర్డ్ ఐఎస్ అధికారిని నియమించడం మొదటిసారి తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన అధికారిగా శరత్ కు పేరు ఉంది. కుప్పంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన డాక్టర్ ఏ.శరత్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తిరుపతి jeo గా అవకాశం దక్కింది.
Next Story

