గ్రామీణాభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా స్వర్ణ నారావారిపల్లె...
x
తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, అధికారులతో మాట్లాడుతున్న సీఎం నారా చంద్రబాబు

గ్రామీణాభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా స్వర్ణ నారావారిపల్లె...


స్వర్ణనారావారిపల్లెకు కుప్పం ఆదర్శం.

అభివృద్ధి నమూనాగా చంద్రగిరి.
ప్రణాళిక ప్రకటించిన సీఎం చంద్రబాబు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలాన్ని అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. కుప్పం తరహా నమూనాతో నారావారిపల్లెలో ఏడాదిలోనే వంద శాతం జీవన ప్రమాణాలు పెంచాం.డంలో విజయం సాధించాం. ఈ ఫార్ములానే చంద్రగిరి మండలానికి విస్తరిస్తామని ఆయన ప్రకటించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
"స్వర్ణ కుప్పం, స్వర్ణ నారావారిపల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళిక అమలు చేయండి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ తో పాటు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ఈ మేరకు సిఎం చంద్రబాబు దిశానిర్థేశం చేశారు.
సంవత్సరం కిందట
చంద్రగిరి మండలంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయనున్నారు. గత ఏడాది సంక్రాంతికి కందులవారిపల్లి, చిన్న రామాపురం, ఎ రంగంపేట గ్రామాలను కలిపి స్వర్ణ నారావారిపల్లికి కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఏడాది కాలంలోనే అన్ని ఇళ్లకూ వంద శాతం సౌర ప్యానెళ్లను అమర్చడం ద్వారా ఇంధన స్వయం సమృద్ధిని సాధించింది. తద్వారా ప్రతీ ఇంటికీ ఉచితంగానే విద్యుత్ వెలుగులు వచ్చాయి. శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమను ప్రోత్సహించడం, ప్రకృతి సేద్యం విస్తరణ తదితర ప్రణాళికల ద్వారా తలసరి ఆదాయం 20 శాతం మేర పెరిగింది.
సంక్రాంతి పండుగ కోసం సొంత ఊరు నారావారిపల్లెలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

"గత ఏడాది సంక్రాంతి పండుగ రోజు ప్రారంభించిన స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు సమగ్ర గ్రామీణాభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచింది. సంవత్సరంలో మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఈ ప్రాజెక్టు ఆశించిన లక్ష్యాలను మించి ఫలితాలను సాధించింది" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు.
జీవన ప్రమాణాల పెంపుదల కోసం..
చంద్రగిరి మండలంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఈ అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు. గత ఏడాది సంక్రాంతికి ప్రారంభించిన స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు ద్వారా సంవత్సరంలోనే అద్భుత ఫలితాలు సాధించామని ఆయన తెలిపారు. సంవత్సరంలో అన్ని ఇళ్లకూ వంద శాతం సౌర ప్యానెళ్లను అమర్చడం ద్వారా ఇంధన స్వయం సమృద్ధిని సాధించిందని ఆయన వెల్లడించారు.
"ప్రతి ఇంటికీ ఉచితంగానే విద్యుత్ వెలుగులు వచ్చాయి. వంద శాతం సోలారైజేషన్ సాధించిన గ్రామంగా స్వర్ణ నారావారిపల్లె రికార్డులు సాధించింది" అని ముఖ్యమంత్రి నాారా చంద్రబాబు చెప్పారు. ప్రజల తలసరి ఆదాయం లోనూ గణనీయమైన వృద్ధి నమోదైందని ఆయన తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల్లో పాడిపరిశ్రమను ప్రోత్సహించడం, ప్రకృతి సేద్యం విస్తరణ తదితర ప్రణాళికల ద్వారా తలసరి ఆదాయం 20 శాతం మేర పెరిగిందని వివిరించారు.
ఉపాధి అవకాశాలు మెరుగు
నారావారిపల్లెలో ఉపాధి అవకాశాలు మెరుగు పరిచిన విషయాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ..
"మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేలా ప్రత్యేక స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ కార్యక్రమాలను కూడా సమర్ధంగా అమలు చేశాం. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో ప్రతీ లబ్దిదారుడికి చేరేలా చేశాం. ఈ కార్యాచరణ అమలులో, మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యత ఇచ్చాం. తద్వారా స్వర్ణ నారావారిపల్లె ఏడాదిలోనే అద్భుత ఫలితాల సాధనకు ఉపకరించింది." అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. దీంతో చంద్రగిరి మండలానికి ఈ ప్రాజెక్టును విస్తరించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
దేశానికి దిక్సూచి..
గత ఏడాది సంక్రాంతి పండుగ రోజు ప్రారంభించిన స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు సమగ్ర గ్రామీణాభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. ఏడాది కాలంలో మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఈ ప్రాజెక్టు ఆశించిన లక్ష్యాలను మించి ఫలితాలను సాధించింది. స్వల్ప కాలంలోనే ఈ అభివృద్ధి సాధించేందుకు కారణమైన జిల్లా యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
Read More
Next Story