Breaking | కర్ణాటకలో కూలీలను వెంటాడిన మృత్యువు..
x

AIPic

Breaking | కర్ణాటకలో కూలీలను వెంటాడిన మృత్యువు..

నలుగురు మృతి, 15 మందికి గాయాలు. రామసముద్రంలో విషాదం.


చింతకాయలు కోయడానికి వెళ్లిన ఆంధ్రా కూలీలను కర్ణాటకలో మృత్యువు వెంటాడింది. బొలొరే వాహనం బోల్తా పడిన సంఘటనలో నలుగురు మరణించారు. మరో 15 మంది గాయపడినట్టు ప్రాధమిక సమాచారం అందింది. మృతులు, గాయపడిన వారంతా మదనపల్లెకు నియోజకవర్గం రామసముద్రం మండలానికి చెందిన వారే. దీంతో ఆ గ్రామంలో విషాదం ఏర్పడింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి ఆంధ్రా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శ్రీనివాసపుర వద్ద జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఉమ్మడి చితూరు జిల్లాలో జాతీయ రహదారుల వెంట చింతచెట్ల నీడనిస్తూ, ఉంటాయి. మదనపల్లె నుంచి కర్ణాటకకు వెళ్లే మార్గంలో కూడా రోడ్డు వెంట చింతచెట్లకు కొదవ లేదు. కర్ణాటక రాష్ట్రంలో చింతచెట్ల తోపులు (వనాలు) ఎక్కువగా ఉంటాయి.
మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం చంబకూరు గ్రామానికి చెందిన కూలీలను చింతకాయలు కోయడానికి బొలేరో జీపులో తరలించారని తెలిసింది. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శ్రీనివాసపురాలో చింతచెట్ల నుంచి కాయలు రాల్చే పనులకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఆ కూలీలను వాహనంలో తిరిగి వారి స్వగ్రామానికి పంపించడానికి వాహనంలో ఎక్కించారని చెబుతున్నారు. పనులు చేసి, అలసిపోయిన వారంతా, వాహనంలో ప్రయాణిస్తుండగా, శ్రీనివాసపుర వద్దకు వచ్చే సరికి వాహనం బోల్తాపడినట్టు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.

మృతులు వీరే..

కర్ణాటకలో జరిగిన బాహనం బోల్తా పడిన ఘటనలో రామసముద్రం మండల వాసులు నలుగురు మృతి చెందారు. వారంలో చంబకూరు మండలం పూలకుంట్లపల్లెకు చెందిన వారే ఉన్నారు. పూలకుంట్లపల్లికి చెందిన శ్రీనివాసులు (25), వెంకటమ్మ (60), మునెప్ప( 65) తోపాటు మరో వ్యక్తి చనిపోయిన వారిలో ఉన్నారని సమాచారం అందింది. ఈ ఘటనలో మరో 15 మంది వరకు గాయపడ్డారు. సంఘటన జరిగిన ప్రదేశం ఆంధ్రకు సరిహద్దులో ఉండడం వల్ల గాయపడిన వారందరినీ మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ సమాచారం అందిని వెంటనే శ్రీనివాసపుర పోలీస్ ఇన్ స్పెక్టర్ ఘటన స్థలానికి వెళ్లారని ఆ స్టేషన్ కానిస్టేబుల్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.
"మాకు కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. మా సీఐ, సీనియర్ అధికారులు సంఘటన ప్రదేశంలో ఉన్నారు" అని ఆ కానిస్టేబుల్ చెప్పారు. గాయపడిన వారిని మదనపల్లె ఆస్పత్రిలో కొందరికి చికిత్స అందిస్తున్నారు.
Read More
Next Story