
ప్రయివేటు ఫీ'జులుం'కు కళ్లెం వేసిన విద్యా శాఖ..
23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం. పేద విద్యార్థులకు ఉపశమనం ఎలా కల్పించారంటే..
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కాలేజీలతో సంబంధం లేకుండా, మనమిత్ర వాట్సప్ గవర్నెస్ ద్వారా ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్లు తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల రాష్ట్రంలో ఇంటర్మీయట్ ప్రయివేటు కాలేజీల యాజమాన్యాల ఆగడాలకు ప్రభుత్వం కళ్లెం వేసింది. తద్వారా పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించింది.
హాల్ టికెట్ పై ప్రైవేటు కాలేజీ యాజమాన్య ప్రతినిధుల్లో ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు. వాట్సప్ లో డైన్ లోడ్ చేసుకుని విద్యార్థులు పరీక్షకు హాజరు కావచ్చు" అని తిరుపతి ఆర్ఐఓ (District Regional Supervisory Officer (RIO Intermediate) రాజశేఖరరెడ్డి చెప్పారు.
2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్
పరీక్ష సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు
ఫిబ్రవరి 23: ద్వితీయ భాష
25:ఇంగ్లీష్
27: హిస్టరీ, బోటనీ
మార్చి 2: మ్యాథమేటిక్స్ - IA
మార్చి 5: బయాలజీ, మ్యాథమేటిక్స్- IB, జువాలజీ
మార్చి 7: ఎకనామిక్స్
మార్చి10: ఫిజిక్స్
మార్చి10:
మార్చి12 : కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్
మార్చి14: సివిక్స్, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్
మార్చి17: కెమిస్ట్రీ
మార్చి20:పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్
మార్చి24: మాడర్న్ లాంగ్వేజ్, జియాగ్రఫీ
ద్వితీయ సంవత్సరం
ఫిబ్రవరి 24 : ద్వితీయ భాష
26 : ఇంగ్లీష్
28 : బోటనీ, హిస్టరీ
మార్చి 3 : మ్యాథమేటిక్స్-IIA, సివిక్స్
మార్చి 6 : జువాలజీ, ఎకనామిక్స్
మార్చి 9 : మ్యాథమేటిక్స్
మార్చి 11 : కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్
మార్చి 13 : ఫిజిక్స్
మార్చి 16 : మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ, బ్రిడ్జి కోర్స్ మాధ్స్
మార్చి 18 : కెమిస్ట్రీ
మార్చి 23 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్
హాల్ టికెట్ జారీలో సంస్కరణలు
"ఫీజులు చెల్లించకుంటే హాల్ టికెట్ ఇవ్వం" అనే కాలేజీ యాజమాన్యాల వేధింపులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వాట్సప్ గవర్నెస్ సంస్కరణ ( Reforms through WhatsApp Governance) తీసుకుని వచ్చారు.
2025 ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ విధానం అమలులోకి వచ్చింది. అప్పుడు కూడా అనేక కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులు ఫీజులు చెల్లించలేదనే సాకుతో హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. ఫీజులు చెల్లించిన వారికి హాల్ టికెట్ ఇచ్చినా, దానిపై ప్రిన్సిపాల్ సంతకం చేస్తేనే పరీక్షకు అనుమతించే వారు. ఆ సమయంలో కూడా యాజమాన్యాల పక్షాన కాలేజీలో ప్రిన్సిపాల్స్ ఫీజులు చెల్లించని వారికి సంతకం చేయడానికి నిరాకరించడం, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగిన సంఘటనలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు 10,57899 మంది ప్రధమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నారు.
2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ముందు టీడీపీ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మరో సంస్కరణ తీసుకుని వచ్చింది.
పరీక్షలకు హాజరు కావడానికి వాట్సప్ లో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోండి. దానిపై కాలేజీ ప్రిన్సిపల్, ప్రతినిధులు ఎవరూ సంతకం చేయాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్ ఉంటే చాలు పరీక్షకు హాజరుకావచ్చు" అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమలు చేసిన మరో సంస్కరణ వల్ల పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హాయిగా ఊరిపి పీల్చుకునేంత ఉపశమనం కల్పించారు.
ప్రభుత్వ నిర్ణయంతో..
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మానసిక వేదన నుంచి ఉపశమనం కలిగింది. కాలేజీలతో సంబంధం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాల్ టికెట్ జారీ చేసే విధానం అమలు చేయడం వల్ల ప్రైవేట్ కాలేజీలకు మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది.
హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ తో పాటు మన మిత్ర వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు హాల్ టికెట్ తీసుకునే వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చింది.
95523 00 009 నంబర్ వాట్సప్ కు Hi అని మెసేజ్ పంపించగానే..
Education service లో ipe 2026 hall ticket ఆప్షన్ వస్తుంది. ఇందులో విద్యార్థి రోల్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయడమే ఆలస్యం. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే హాల్ టికెట్ కనిపిస్తుంది. దీనిని సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
"పేద విద్యార్థులకు ఇది ఒక వరం" అని ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చలపతి వ్యాఖ్యానించారు. గత సంవత్సరం కూడా హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం చేయాలనే నిబంధనతో చాలా మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారని చలపతి గుర్తు చేశారు.
"హాల్ టికెట్ పై సంతకం అవసరం లేదు" అనే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి తీసుకున్న నిర్ఱయం వల్ల విద్యార్థులు స్వేచ్ఛగా పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించడంపై అభినందించతగిన నిర్ణయమని చలపతి వ్యాఖ్యానించారు.
పేదల పిల్లలకు ఉపశమనం
ప్రభుత్వ కళాశాలలను పక్కన ఉంచితే, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు తమ శక్తికి మించి ప్రైవేట్ కాలేజీల్లో చదివించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మధ్యతరగతి కుటుంబాలు యాజమాన్యాలకు ఫీజులు చెల్లించకుంటే పరీక్షలకు ముందు హాల్ టికెట్ జారీ చేయడానికి ఇప్పటివరకు ససేమిరా అంటూ ఉన్నాయి.
"ఇది చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తాం" అనే మాటలతో అనేక ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్యాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక వేదనకు గురిచేసిన సంఘటనలు అనేకం జరిగాయి.
ఈసారి ఇంటర్ విద్యార్థులకు ఆ కష్టాలు ఏమీ లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని District Regional Supervisory Officer (RIO Intermediate) రాజశేఖరరెడ్డి చెప్పారు.
"తిరుపతి జిల్లాలో జిల్లాలో 194 ప్రయివేటు కాలుజీలు, 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఒక ఎయిడెడ్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు (Intermediate students) మొదటి సంవత్సరంలో 30,319 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 30,696 మంది పరీక్షలకు హాజరవుతున్నారు" అని ఆర్ఐఓ రాజశేఖరరెడ్డి చెప్పారు. జిల్లాలో 84 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు.
Next Story

