Breaking | నెల్లూరు:ప్రభుత్వాస్పత్రి ప్రసూతి వార్డులో అగ్నిప్రమాదం..
x
నెల్లూరు ప్రభుత్వాస్పత్రి వెలుపల నర్సింగ్ స్టాఫ్

Breaking | నెల్లూరు:ప్రభుత్వాస్పత్రి ప్రసూతి వార్డులో అగ్నిప్రమాదం..

అంధకారంలో ప్రసూతి వార్డు. ఇంతకీ ఏమి జరిగింది?


నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (Nellore Government General Hospital ) ప్రసూతి వార్డులో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. మంటలు చెలరేయడం వల్ల తీవ్ర ఇబ్బంది పడడమ కాకుండా, బాలింతలు, వారి సంబంధీకులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిసేపటి కిందట అంటే ఆదివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని అనుమానిస్తున్నారు.


"ఏమి జరిగిందో అర్థం కావడం లేదు సర్" అని ఆస్పత్రి సిబ్బంది కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ, సెల్ ఫోన్ వెలుగులో ఆందోళనగా తిరుగుతున్నారు. ఇదిలాఉండగా, ఆస్పత్రిలోని నర్సింగ్ స్టాఫ్ కూడా వార్డుల్లో ఆందోళనగా తిరగడం, కొందరు సిబ్బంది ఆస్పత్రి వెలుపల అంధకారంలో ఆందోళనగా చర్చించుకుంటూ ఉన్న వీడియోలు బయటికి వచ్చాయి.


నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో ఉన్న బాలింతలు, పిల్లల పరిస్థితి తెలియలేదు. సెల్ ఫోన్ లైట్ వెలుగులో బాలింతలను ఆసుపత్రి సిబ్బంది రక్షించారని తెలుస్తోంది. వారికి అలాగే సేవలు అందిస్తున్నట్లు తెలిసింది. ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ మంటలు చెలరేగింది తెలియలేదు. దీంతో ఆస్పత్రి ఆవరణ అంధకారంలో చిక్కుకుంది.


దీంతో పసి పిల్లలతో ఉన్న బాలింతలు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది కూడా పేషెంట్లను కొంతమందిని బయటికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.



Read More
Next Story