ముద్దులొలికే ఈ పాపను చంపడానికి మనసెలా వచ్చిందిరా..?
x
ప్రజలతో కలిసి మదనపల్లెలో ఆందోెళనకు దిగిన ట్రాన్స్ జెండర్లు. ఇన్ సెట్ హత్యకు గురైన బాలిక రిషిక

ముద్దులొలికే ఈ పాపను చంపడానికి మనసెలా వచ్చిందిరా..?

రాత్రంతా మృతదేహంతో జాగారం. మదనపల్లెలో దారుణ ఘటన.


అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్యకు గురైంది. పాపను కిడ్నాప్ చేసిన ఓ యువకుడు చంపేశాడు. తన ఇంటిలోనే నీటి డ్రమ్ములో శవాన్ని ఉంచి రాత్రంతా హాయిగా నిద్రపోయాడు. 24 గంటల తరువాత బాధితుడి ఇంటికి ఎదురుగానే ఉన్న వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు సీసీ కెమెరా పుటేజీతో కనిపెట్టారు. బాధిత కుటుంబానికి కాలనీ ప్రజలు అండగా నిలిచారు. ట్రాన్స్ జెండర్లు కూడా ఆందోళనకు దిగడంతో మదనపల్లె పట్టణంలో ఉద్రిక్తత ఏర్పడింది.


ఆదివారం అదృశ్యం..

మదనపల్లి పట్టణం నీరుగట్టు వారి పల్లెలో కట్లాటపల్లి రోడ్డులో చేనేత కార్మికుడు గోపీనాథ్ నివాసం ఉంటున్నారు. తన కూతురు రిషిక కనిపించలేదని తండ్రి గోపీనాథ్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఒకపక్క గాలిస్తూనే ఉన్నారు. వీధిలోని వారంతా ఆందోళనగా వెతుకులాట ప్రారంభించారు. ఫిర్యాదు అందగానే మదనపల్లి జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, డిఎస్పి మహేంద్ర స్పందించారు. వన్ టౌన్ సిఐ మొహమ్మద్ రఫీ సారధ్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.

పాప శంతో జాగారం

మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లెలోని కట్లాటపల్లి రోడ్డులో చేనేత కార్మికుడు గోపీనాథ్ కు ఒక కొడుకు, ఓ కూతురు. ఇంటికి పెద్ద కూతురు ఏడేళ్ల రిషిక ఇంటి వద్ద ఆడుకుంటూ ఉంది. వారి నివాసానికి ఎదురుగానే ఉంటున్న కులవర్ధన్ (27) ఆ పాపను కిడ్నాప్ చేశాడని తెలిసింది. తన ఇంటిలోకి బాలికను తీసుకుని వెళ్లిన కులవర్ధన్ ఏమి చేశాడో తెలియదు. కానీ పాపను చంపేసి ఇంట్లోనే ఓ డ్రమ్ములో పడేశాడు. ఆదివారం రాత్రంతా పాప శవం ఉన్న డ్రమ్ము ఉంచిన తన ఇంటిలోనే హాయిగా నిద్రపోయాడు. బయటికి కూడా రాలేదని స్థానికుల ద్వారా తెలిసింది.

సోమవారం నిందితుడిని పట్టించిన పుటేజీ..

మదనపల్లె పట్టణంలో ఏడేళ్ల బాలిక రిషిక కనిపించలేదనే ఫిర్యాదుతో వన్ టౌన్ సీఐ హహ్మద్ రఫీ సారధ్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నేరాల నియంత్రణ కోసం మూడేళ్ల కిందట పట్టణంలోని ప్రతి వీధిని కవర్ చేసే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి వ్యక్తి కదలికను గమనించడానికి గతంలోనే పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కెమెరాలే రషిక ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి.
అదృశ్యమైన ఏడేళ్ల బాలిక రిషిక ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులు సీపీ కెమెరాల పుటేజీ పరిశీలించారు. దీంతో బాలిక అదృశ్యం మిస్టరీ వీడింది. అప్పటికే నిర్జీవంగా నీటి డ్రమ్ములో బాలిక శవమై తేలింది.
మదనపల్లి పట్టణం నీరుగట్టు వారి పల్లెలో కట్లాటపల్లి రోడ్డులో చేనేత కార్మికుడు గోపీనాథ్ ఇంటికి ఎదురుగానే నివాసం ఉంటున్న కులవర్ధన్ (27) బాలికను తీసుకుని వెళుతున్న దృశ్యాలు సీపీ కెమెరాల పుటేజీలో కనిపించాయి. ఈ విషయం తెలుసుకోవడానికి పోలీసులకు దాదాపు 24 గంటలు పట్టినట్లు తెలుస్తోంది.
మదనపల్లె వన్ టౌన్ సీఐ మహ్మద్ రఫీ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం కులవర్ధన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిలోనే డ్రమ్ములో ఉన్న బాలిక మృతదేహం ఉన్నట్లు కనిపెట్టారు. ఇంట్లోనే ఉన్న నిందితుడు కులవర్ధన్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో నీరుగట్టువారిపల్లెలోని కట్లాటపల్లి రోడ్డులో ఉన్న రామిరెడ్డి లేఅవుట్ ప్రాంత ప్రజలు కన్నీటిసముద్రంలో మునిగి పోయారు.

ఒక్కసారిగా ఉద్రిక్తత

తమ కళ్లముందు ఉల్లాసంగా ఆడుకుంటూ కనిపించే పాపను చంపేశారనే తెలుసుకున్న రామిరెడ్డి లే అవుట్ లోని వీధి ప్రజలు మొత్తం ఆందోళనకు దిగారు. పట్టణంలోని ట్రాన్స్ జండర్లు భారీగా వీధివదద్దకు చేరుకున్నారు.
"పాపను చంపిన నిందితుడు కులవర్ధన్ ను మాకు అప్పగించండి. ప్రజాకోర్టులో శిక్షిస్తాం. నిందితుడు జీవించడానికి వీలులేదు" అని స్థానికులతో పాటు ట్రాన్స్ జెండర్లు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ, ఆందోళనకు దిగారు. అప్పటికే వన్ టౌనఓ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. వీధిలో పరిస్థితి అదుపుతప్పకుండా భారీగా పోలీసులు మోహరించారు. బాధితులను శాంతింప చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముద్దులొలికే పాపను నిందితుడు ఎందుకు కిడ్పాప్ చేశాడు? రాత్రంతా బాలిక శవంతో జాగారం చేసిన అమానవీయ ఘటన వెనుక దారుణ విషయాలు పోలీసుల దర్యాప్తు, పోస్టుమార్టంలో వైద్యులు నివేదికలో ఏమి వెల్లడిస్తారనేది వేచి చూడాలి.
Read More
Next Story