
రాయలసీమ నేలతో కరచాలనం చేస్తున్న వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల కోఆర్డినేటర్
'సీమ' నీటి ఉద్యమ జెండా పట్టనున్న జగన్..
కడపలో నిర్వహించిన గ్రేటర్ రాయలసీమ రౌండ్ టేబుల్ మీట్ లో సజ్జల
రాయలసీమ రైతులు, ప్రజల ప్రయోజనాలు కాపాడే ఎత్తిపోతల పథకం ఉద్యమంలోకి వైసిపి చీఫ్ వైఎస్. జగన్ అడుగుపెట్టనున్నారు. వైసిపి కార్యాచరణకు సమయతమైంది.
"రాయలసీమ హక్కుల కోసం అన్ని శక్తులు ఐక్యం చేస్తాం. స్పష్టమైన కార్యాచరణలతో ప్రజా ఉద్యమానికి నాంది పలుకుతాం" అని వైసిపి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
రాయలసీమ హక్కుల కోసం వైఎస్ఆర్ సీపీ ఘోష పేరుతో ఆదివారం కడపలో ఆరు జిల్లాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాయలసీమ జిల్లాలోని వైసిపి ఎమ్మెల్యేలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు.
"రాయలసీమ ప్రయోజనాల కోసం ఇతర అనుకూల రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలతో చేతులు కలిపి భారీ స్థాయి పోరాటాలు సాగిస్తుంది" అని వైసిపి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. విద్యార్థులను చైతన్యం చేసే కార్యక్రమాలను ప్రారంభించామని, రాయలసీమ హక్కులు కాపాడుకునేందుకు రాజీపడే ప్రసక్తి ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ రగిలిస్తామని కూడా హెచ్చరించారు.
సీఎం నిర్ణయాలతో నష్టం..
రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయాలు ఉంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.78 అడుగులకు వైఎస్. జగన్ హయాంలో నిర్మిస్తుంటే, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు 40 అడుగులకు కేంద్రం కుదిస్తున్నా సీఎం చంద్రబాబు కిమ్మనకపోవడం ద్వారా అన్యాయం చేశారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కూడా ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో టిడిపి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న బిజెపి జనసేన నాయకులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ప్రశ్నించాలి ఆయన డిమాండ్ చేశారు.
లిఫ్ట్ పనులు మొదలు పెట్టండి
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని వైసిపి రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రజల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. పరుగు రాష్ట్రాల్లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపించే ప్రయత్నం చేయాల్సిన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టిడిపి అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉన్న వాటిని కూడా కోత విధిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాని నిలబెట్టుకోవడం అవసరం ఉందన్నారు.
ప్రజా చైతన్యంతో..
రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా ఉద్యమంలో భాగస్వామ్యంలో చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం టిడిపి కూటమినేతలపై ఒత్తిడి తీసుకురావడానికి విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేసి ఉద్యమంలో మమేకం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాలకు నాయకులు హాజరయ్యారు.
కడపలో నిర్వహించిన కీలక సమావేశానికి వైసీపీ అధికార ప్రతినిధి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ భాష, మాజీ మంత్రులు ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్, సాకే శైలజానాథ్, ఆదిమూలపు సురేష్, మాజీ చీఫ్ విప్ వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప అన్నమయ్య జిల్లాల పార్టీ అధ్యక్షులు పీ. రవీంద్రనాథ్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి తో పాటు అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకట్రామిరెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎస్పీ మోహన్ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్ తో పాటు పార్టీ కీలక నాయకులందరూ హాజరయ్యారు.
ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రులు కూడా వివిధ అంశాలపై చర్చించారని పార్టీవర్గాల సమాచారం. అందులో ప్రధానంగా టీడీపీ కూటమిపై పోరాటాలు సాగించడంలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలనే వ్యూహం కూడా సిద్ధం చేశారని తెలిసింది. అవినీతి ఆరోపణలతో కేసులు నమోెదు చేయడం, ఆందోళనల తరువాత పరిస్థితి ఎలా ఉండబోతుందనే విషయలపై సమాలోచన లు సాగించినట్లు పార్టీ వర్గాల భోగట్టా.
Next Story

