పక్షుల పండుగకు నేనూ వస్తున్నా...
x

పక్షుల పండుగకు నేనూ వస్తున్నా...

సూళ్లూరుపేట ఫ్లమింగో ఫెస్టవల్ 12వ తేదీ ముగింపు సభకు ముఖ్యమంత్రి రాక.


ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingo Festival)కు ఈ నెల 12వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరుకానున్నారు. దీంతో ఈ ఏడాది కూడా యథావిధిగానే మూడు రోజులపాటు పక్షుల పండుగ నిర్వహించడానికి కార్యక్రమాలు మార్పు చేశారు. సూళ్లూరుపేటకు సమీపంలోని నేలపట్టు వద్ద సైబీరియా వలస పక్షుల విడిది కేంద్రం. ఇక్కడ పక్షుల పండుగకు నాంది పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ ఉత్సవానికి మొదటిసారి హాజరు కానున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సరే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంక్రాంతికి తన స్వగ్రామం నారావారిపల్లెకు రావడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా తన సొంతఊరికి వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు సూళ్లూరుపేటలో ప్రారంభమయ్య ఫ్లెమింగో ఫెస్టివల్ లో 12వ తేదీ ముగింపు సభకు హాజరుకానున్నారు.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం సభ శనివారం జరుగుతుంది. ఈ సంవత్సరం గతానికి భిన్నంగా రెండు రోజులు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తోపాటు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు భద్రతా ఏర్పాట్లపై సూళ్లూరుపేటలో సమీక్షించారు.
"ఈ ఏడాది మొదట జనవరి 10, 11 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సందర్శకుల స్పందన. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే సూచనలు, స్థానిక రాజకీయ కమిటీ సలహా మేరకు ఈ ఫెస్టివల్‌ను జనవరి 10, 11, 12 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించాం" అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ శుక్రవారం రాత్రి మీడియాకు చెప్పారు.
సీఎం పర్యటన ఇలా..
ఫ్లెమింగో ఫెస్టివల్ ముగింపు రోజు జనవరి 12వ తేదీ సాయంత్రం సుమారు 3:30 నుంచి 4:00 గంటల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూళ్లూరుపేటకు వస్తారు. నేలపట్టు లేదా అటకాని తిప్ప ప్రాంతాల్లోని ఫ్లెమింగో పాయింట్‌ను సందర్శిస్తారు. అనంతరం సూళ్లూరుపేట జెడ్పి హైస్కూల్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
సూళ్లూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో 'ఫ్లెమింగో ఫెస్టివల్- 2026' నిర్వహణపై మీడియాతో మాట్లాడిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఏమన్నారంటే...
"దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్ సరస్సు తీరాన ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం" అని చెప్పారు. పులికాట్ సరస్సు ప్రాంతంలో గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఫ్లెమింగో ఫెస్టివల్‌ విజయవంతంగా నిర్వహించామని, గత సంవత్సరం ప్రభుత్వం ఈ ఫెస్టివల్‌ను పునరుద్ధరించి స్టేట్ ఫెస్టివల్‌గా, మెగా ఫెస్టివల్‌గా ప్రకటించిందన్నారు.
ఈ ఏడాది మొదటగా జనవరి 10, 11 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించామని, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సందర్శకుల స్పందన, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సూచనలు, స్థానిక రాజకీయ కమిటీ సలహాల మేరకు ఈ ఫెస్టివల్‌ను జనవరి 10, 11, 12 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించాం" అని చెప్పారు.
"ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 12వ తేదీ సాయంత్రం సుమారు 3:30 నుంచి నాలుగు గంటల మధ్య సూళ్లూరుపేటకు వస్తారు. నేలపట్టు లేదా అటకాని తిప్ప ప్రాంతాల్లోని ఫ్లెమింగో పాయింట్‌ను సందర్శిస్తారు. అనంతరం సూళ్లూరుపేట జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్‌లో నిర్వహించే ముగింపు సభలో పాల్గొంటారు" అని కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ వివరించారు.
ఈ మూడు రోజుల పక్షుల పండుగలో నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అటకాని తిప్ప ఫ్లెమింగో పాయింట్స్, సూళ్లూరుపేట జెడ్పిహెచ్ఎస్ స్కూల్‌లో వివిధ ఈవెంట్స్, స్టాల్స్,బీవీ పాలెంలో బోటింగ్ పాయింట్, ఉబ్బల మడుగులో వాటర్ ఫాల్స్,శ్రీ సిటీ ప్రాంతంలో రెండు రోజుల పాటు వర్క్‌షాప్, సింపోజియం, అడ్వెంచర్ టూరిజం, ఎకో టూరిజం కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ద్వీపాల అభివృద్ధి
సూళ్లూరుపేట ప్రాంతంలో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సులో పర్యాటక అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
"ఐలాండ్ టూరిజం, లేక్ టూరిజం కాన్సెప్ట్‌తో పాటు కొరిడి, పెర్నాడు వంటి ద్వీప మార్గాలను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ అమలు చేస్తున్నాం" అని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు
సూళ్లూరుపేట – నాయుడుపేట ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అదే సమయంలో అపారమైన పర్యాటక అవకాశాలు ఉన్న ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం అని ఆయన తెలిపారు .
మా ప్రాంత ప్రజల కోరిక మేరకు ఈ ఏడాది కూడా మూడు రోజులు ఫ్లెమింగో ఫెస్టివల్‌ నిర్వహించడానికి కార్యక్రమాల్లో మార్పు చేశామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ చెప్పారు. ఈ ఫెస్టివల్‌లో నేలపట్టు, అటకాని తిప్ప, బీవీ పాలెంతో పాటు కొత్తగా ఇరుకుం ఐలాండ్ , ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ కూడా సందర్శన కేంద్రాలుగా చేర్చామని తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా పర్యాటకానికి మరింత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ ఫెస్టివల్ పిల్లలకు పక్షులపై శాస్త్రీయ అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఫ్లెమింగో ఫెస్టివల్- 2026' కు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు.
"పటిష్టమైన భద్రతా చర్యలు చేశాం. ఫ్లెమింగో పక్షులు ఇంకా సుమారు నాలుగు నెలల పాటు ఈ ప్రాంతంలో ఉంటాయి. ప్రజలు ప్రశాంతంగా వచ్చి వీక్షించవచ్చు" అని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. అటవీశాఖ కన్జర్వేటర్ సెల్వం, అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ చారి, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, సూళ్లూరుపేట మునిసిపల్ ఛైర్మన్ శ్రీమంత్ రెడ్డి, టూరిజం ఆర్ డి రమణ ప్రసాద్, టూరిజం అధికారి జనార్దనరెడ్డి, మునిసిపల్ కమీషనర్ చెన్నయ్య, డిఎస్డిఓ శశిధర్, సెట్వీన్ సి ఈ ఓ యస్వంత్, డ్వామా పి డి శ్రీనివాస ప్రసాద్, ఆర్ అండ్ బి ఎస్ సి రాజా నాయక్, రెవిన్యూ సిబ్బంది, అధికారుతో కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షించారు.


Read More
Next Story