రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ( TDP alliance ) మిత్రధర్మం పాటించాల్సిన అవసరంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాడెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యాలు చేశారు.
"బీజేపీ, టీడీపీ సహకారంతో గెలిచామని జనసైనికులు చెప్పాలి. టీడీపీ, బీజేపీ నేతలు కూడా జనంలో ఇదే మాట చెప్పాలి" అని నాదెండ్ల నొక్కి చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటనేది చర్చకు ఆస్కారం కల్పించింది. పార్టీలో గ్రూపులు కట్టవద్దని, ఉద్యమి సభ్యత్వం పెంచాలని ఆయన పార్టీ శ్రేణులకు తిరుపతిలో ఆదివారం దిశానిర్దేశం చేశారు.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పిఓసి, సాధిక్ లు, ముఖ్య నాయకులతో ఆదివారం నగరంలోని ఓ కళ్యాణ మండపంలో సభ్యత్వం నమోదుపై కీలక సమావేశం నిర్వహించారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తోపాటు జిల్లాలోని పార్టీ సభ్యత్వ నమోదు సమన్వయకర్తలు హాజరైన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోెహర్ మాట్లాడారు.
జన సైనికులు కూటమి ధర్మాన్ని పాటించాలని ఆ పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫలాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గట్టిగా నొప్పి చెప్పారు. కూటమిలోని మూడు పార్టీలు పరస్పర సహకారంతో వ్యవహరించడం వల్లే అధికారంలోకి రాగలిగామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన ప్రస్తావించారు.
"నియోజకవర్గాల్లో అంతర్గత గ్రూపులు, మిత్రపక్షాలతో వైరం తెచ్చుకునే విధంగా వ్యాఖ్యలు చేయవద్దు. సోషల్ మీడియాకు ఎక్కే ప్రయత్నం ఇవ్వకండి" అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గట్టిగా చెప్పారు.
"పార్టీ పరువు, ప్రతిష్ట జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆశయాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించవద్దు" అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యం తిరుపతిలో జరిగిన ఘటనలే ప్రధాన కారణమని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
సభ్యత్వ లక్షమే.. పదవులకు సోపానం
జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మనోహర్ పార్టీ శ్రేణులకు ప్రధానంగా ముఖ్య నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
"నామినేటెడ్ పదవులు అనేది క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించడంలోనే కీలకం" స్పష్టం చేశారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14వ తేదీ నిర్వహించుకోబోతున్న నేపథ్యంలో 10వ తారీఖు లోపు ఉద్యమి సభ్యత్వ నమోదును సాధిక్లు పూర్తి చేయాలని ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు అంతా యువత మీదే ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకొని ఉద్యమే క్రియాశీలక సభ్యత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సాధిక్లను కోరారు. కింది స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎదిగేందుకు ఉద్యమిని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని కూడా ఆయన సూచన చేశారు.
"సభ్యత్వ నమోదులో టార్గెట్ పేరిట గ్రూప్లో కట్టడం మానేయండి. పార్టీలో పవన్ కళ్యాణ్ ఒక్కరే బాస్. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని, పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసేలా సభ్యత్వ నమోదు చేయించాలి" అని నాదెండ్ల మనోహర్ కర్తవ్యాన్ని గుర్తు చేశారు.
సోషల్ మీడియాతో జాగ్రత్త..
జన సైనికులు వ్యక్తులు కాదు. పార్టీకి వ్యవస్థ లాంటి వారు అనే విషయాన్ని గుర్తుంచుకొని బాధ్యతగా వ్యవహరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మొత్తం చేశారు.
"పార్టీలో భిన్నాప్రాయాలు ఉంటాయి. అంతమాత్రాన సోషల్ మీడియాకు ఎక్కే ప్రయత్నం చేయవద్దు. అంటే జాగ్రత్తగా పని చేయాలని అర్థం" అని నాదెండ్ల మనోహర్ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం జనసేన పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డారు.
రాజకీయ పార్టీలకు ముందస్తు విహాలు ఉన్నట్లే జనసేనకు కూడా అదే పద్ధతిలో సాగుతోందని నాణేండ్ల మనోహర్ స్పష్టం చేశారు. 2019 డిసెంబర్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలపై తిరుపతి వేదికగానే పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని నిర్దేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని బిజెపి అవసరాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ 2019లోనే ప్రకటన చేయడం వెనక ముందుచూపు ఉందనే విషయాన్ని అర్థం చేసుకున్నారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పేయుట దోచుకున్నారు. ఆ పార్టీ నాయకుల తీరు వల్ల జనసేన వీర మహిళలు కూడా వ్యక్తిత్వ అనడానికి పాల్పడిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. వీటన్నిటికీ తట్టుకునే నిలబడిన కారణంగానే ప్రజలు విశ్వసించి ఎన్డీఏ కూటమికి ఊహించిన మెజారిటీ కట్టబెట్టారని ఆయన తెలిపారు. ఇది ఒక బాధ్యతగా భావించి ప్రజల సంక్షేమం కోసం జనసైనికులు మరింత బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు.
కూటమిలో కొట్లాట వద్దు..
టిడిపి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన నాయకులు శ్రేణులు మిత్ర పక్షాలతో స్నేహపూర్వకంగా మెలగాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
"రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఎంతో అవసరం ఉంద. జనసేన ప్రతినిధులు ప్రజల్లేకి వెళ్లే సమయంలో టిడిపి, బిజెపి మద్దతుతో గెలిచాం అని చెప్పాలి. టిడిపి బిజెపి కూడా జనసేన మద్దతు వల్లే విజయం సాధించాం" అని మిత్రపక్షాలు కూడా చెప్పడం ద్వారా కూటమి ఐక్యతను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా వివరించారు.
"జనసేన ఉద్యమి సభ్యత్వంతో ఐదు లక్షల ప్రమాద భీమా కార్యకర్తకు ఉంటుంది. రాజకీయ పార్టీలు ప్రజా సంక్షేమంతో పాటు వారి కుటుంబ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంలో కూడా జనసేన ముందు ఉంది" అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
పార్టీ నాయకత్వంలో నామినేటెడ్ పదవుల్లో క్రియాశీలక సభ్యత్వం ఉంటేనే ఇకపై పదవులు దక్కుతాయని ఆయన తేల్చి చెప్పారు. జనసేన పార్టీని మరింత పటిష్టం చేసుకునే దిశగా యువత, పార్టీ సానుభూతిపరులు, తటస్థలను ఆకర్షించే గతానికి భిన్నంగా సభ్యత్వ నమోదు పెంచాలని జన సైనికులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్, శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సర్వేపల్లి నియోజకవర్గ పిఓసి సురేష్ నాయుడు, మోహన్ (గూడూరు), సూళ్లూరుపేట నుంచి ప్రవీణ్, సత్తి బడి నియోజకవర్గ పిఓసి లావణ్య కుమార్, వెంకటగిరి నియోజకవర్గంలో నుంచి ఇన్చార్జి తోట కృష్ణయ్య, కీర్తన, ఆకుల వనజ తదితరులు హాజరయ్యారు.