మార్చిలో సెలవుల పండుగలు.. పిల్లలకు సంబరం..
x

మార్చిలో సెలవుల పండుగలు.. పిల్లలకు సంబరం..

పరీక్షల వేళ విద్యార్థులకు ఆటవిడుపు.


పాఠశాలలకు వచ్చే నెలలో భారీగా సెలవులు రాబోతున్నాయి. ఒక వైపు పరీక్షల సీజన్ ప్రారంభం అయింది. ఒంటి పూట బడుల షెడ్యూల్ ప్రకటించారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. మార్చి నెలలో పరీక్షలు ఉన్నప్పటికీ విద్యార్థులకు రిలీఫ్ కలిగించేలా కొన్ని సెలవులు ఆటవిడుకు కానున్నాయి. వస్తున్నాయి. వీకెండ్స్, పండుగలు కలుపుకొని ఏపీలో విద్యార్థులకు 11 రోజులు సెలవుల పండుగలు వరుసకట్టాయి.

వరుస పండుగలు

మార్చి నెలలో విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి. వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు సెలవులు వస్తున్నాయి. మార్చి 3వ తేదీన హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రా ల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. అదే విధంగా మార్చి 19న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. దీంతో పాఠశాలలకు సెలవు ఉంటుంది. అలాగే మరుసటి రోజు మార్చి 20వ తేదీన రంజాన్ పండగా, అలాగే మార్చి 21న శనివారం వస్తుంది. ఈ ఒక్క రోజు కొన్ని పాఠశాలలు కొనసాగుతాయి. మరి కొన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మార్చి 27న శ్రీరామ నవమి, మార్చి 31న మహావీర్ జయంతి (ఆప్షన్ హాలీడే) వంటి పండుగల్లో పాఠశాలలకు సెలవులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక మార్చి 14న రెండో శనివారం కారణంగా పాఠశాలలకు సెలవు ఉండనుంది. వీటితో పాటు మార్చి నెలలో 5 ఆదివారాలు ఉన్నాయి. ఇవి కూడా సెలవు దినాలుగా పరిగణించినా.. మార్చి నెలలో మొత్తంగా 11 రోజుల పాటు సెలవులు రానున్నాయి.

ఒంటిపూట బడి

ఇదిలా ఉండగా, ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలో మార్చి 10 -25 తేదీల మధ్య పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటి పూట బడులు కూడా మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో విద్యా శాఖ అధికారికంగా ఒంటి పూట బడుల షెడ్యూల్ ను ప్రకటించింది. కొత్త టైమింగ్స్ ప్రకారం మార్చి 16 నుంచి స్కూళ్లు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటాయి. ఇక.. ఇప్పటికే అనేక పాఠశాలల్లో పదో తరగతి కోసం విద్యార్ధులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. సాధారణ పరీక్షలు మార్చి నెలలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వేసవి సెలవులు ఏప్రిల్ నాలుగో వారంలో మొదలై జూన్ రెండో వారం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
Read More
Next Story