గిన్సిస్ రికార్డు లక్ష్యం:5,555 సైకిళ్లతో భారీ ర్యాలీ
x

సైకిల్ తొక్కుతున్న సీఎం నారా చంద్రబాబు

గిన్సిస్ రికార్డు లక్ష్యం:5,555 సైకిళ్లతో భారీ ర్యాలీ

కుప్పంలో ఈ-సైకిల్ ఎక్కనున్న సీఎం


గిన్సిస్ బుక్ ఆప్ రికార్డు (Guinness Book of Records) లక్ష్యంగా వేలాది ఈ-సైకిళ్ల (E-cycle) తో శనివారం కుప్పంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రానా చంద్రబాబు కొన్ని ఒక కిలోమీటరు మహిళలతో కలిసి సైకిల్ తొక్కనున్నారు. 5,555 మంది మహిళలకు ఈ సైకిళ్ల పంపిణీ అనంతరం ర్యాలీ జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో మహిళలతో కలిసి కిలోమీటర్ల దూరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ-సైకిల్ పై వెళ్లనున్నారు.

కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం బెగిలపల్లె నుంచి శెట్టిపల్లె వరకూ వేలాది ఇ-సైకిళ్లతో ర్యాలీ జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ ర్యాలీలో సైకిల్ ఎక్కనున్నారు.

కుప్పం (Kuppam) నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం రెండో రోజు ఎన్టీఆర్ భరోసా సామాజికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లె మండలం బెగిలపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా పంపిణీ చేస్తారు.


ఈ-సైకిళ్ల పంపిణీ

గుడుపల్లె మండలంలో డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 5,555 ఇ-సైకిళ్ల పంపిణీ చేస్తారు. ఆ తరువాత బెగిలపల్లె నుంచి శెట్టిపల్లె వరకూ వేలాది ఇ-సైకిళ్ల ర్యాలీలో ఆయన పాల్గొని సందడి చేయనున్నారు. ఒకేసారి వేలాది ఇ-సైకిళ్ళ ర్యాలీతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించేలా కార్యక్రమం నిర్వహణ ఉంటుందని కుప్పం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు తెలిపారు.

కుప్పంలో...

గుడుపల్లె నుంచి సైకిల్ ర్యాలీ తరువాత కుప్పంలో ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొంటారు. ప్రజలతో ముఖాముఖి నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ లబ్దిదారులతో కూడా ఆయన భేటీ అవుతారు. పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో మాట్లాడతారు. ఈ కార్యక్రమం తరువాత కుప్పంలో సీఎన్జీ కాంపాక్టర్లను ఆవిష్కరించనున్నారు. నెట్ జీరో, వేస్ట్ మేనేజ్మెంట్ పై ఐఐటీ కాన్సూర్ ఇచ్చిన నివేదికను పరిశీలించడం, అనంతరం సీఎం సమక్షంలో కుప్పంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన ఏడు కంపెనీలతో రూ. 675 కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకుంటారు. కుప్పంలో ప్లాస్టిక్ ఉత్పత్తులు, గార్మెంట్స్ తయారీ, వుడ్ స్టోన్ ఉత్పత్తుల పరిశ్రమ, ఇంటిగ్రేటెడ్ చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ఈ ఒప్పందాలు చేసుకుంటారని అధికారవర్గాలు తెలిపారు. దీంతో పాటు విద్యుత్, ఎలక్ట్రానిక్స్ తయారీ ఉత్పత్తుల సంస్థలతో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు చేసుకోనున్నారు.

ఒక రీఛార్జితో 40 కిలోమీటర్ల ప్రయాణం


కుప్పంలో పంపిణీ చేయనున్న ఈ- సైకిళ్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముందుగానే పరిశీలించారు."ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్లు తిరగవచ్చు" అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. గుడుపల్లిలో ఈ-సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారమే ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు.

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఏమి చెప్పారంటే..
"జిల్లాలోని 32 మండలాల్లో 5,026 మంది లబ్ధిదారులకు ఈ-సైకిళ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుంది" అని కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. నాలుగు గంటల చార్జింగ్‌తో ఒక్కో ఈ-సైకిల్‌ సుమారు 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని తెలిపారు. పర్యావరణ హితమైన ఈ వాహనాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు రవాణా అవసరాలను తీర్చడంలో ఈ-సైకిళ్ల ఉపయోగపడతాయని అన్నారు.
మోర్టార్డ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 24 గంటల్లో 5,026 ఈ-సైకిళ్ల పంపిణీ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Read More
Next Story