బాలికను చిదిమేసిన ఘటన:మదనపల్లె వద్ద 24 గంటల్లో భారీ ట్విస్ట్
x
నిందితుడు కులవర్ణన్. మదనపల్లెలోె నిరసనకు దిగిన జనం (ఫైల్)

బాలికను చిదిమేసిన ఘటన:మదనపల్లె వద్ద 24 గంటల్లో భారీ ట్విస్ట్

చెరువులో శవంగా మారిన నిందితుడు


మదనపల్లె పట్టణంలో ఏడేళ్ల పాలబుగ్గల పసిపాపను చిదిమేసిన నిందితుడు అనూహ్యంగా చెరువులో శవమై తేలాడు. ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రజాకోర్టులో నిందితుడికి శిక్ష వేయాలని బాధిత కుటుంబం, బంధువులు పట్టుబట్టారు. ఏమి జరిగిందో తెలియదు.

ఏడేళ్ల బాలికను సోమవారం హత్య చేసిన నిందితుడు శవాన్ని తన ఇంటి డ్రమ్ములో పడేశాడు. రాత్రంతా హాయిగా నిద్రపోయాడు. మంగళవారం ఉదయం ఘటనకు బాధ్యుడిని గుర్తించారు. 24 గంటల తరువాత నిందితుడు కులవర్ధన్ కూడా అనూహ్యంగా చెరువు నీటిలో శవంగా మారాడు.
మదనపల్లె పట్టణం నీరుగట్టువారి పల్లె వద్ద బాలికను కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత ఆ పాపపై లైంగిక దాడి చేసి చంపేసిన విషయం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏడేళ్ల బాలికను అమానవీయంగా హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ (27) కురబలకోట మండలం అంగళ్లు గ్రామానికి సమీపంలోని చెరువులో బుధవారం ఉదయం శవమై కనిపించాడు. కులవర్ధన్ మృతదేహాన్ని మదనపల్లె పట్టణ పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రి మార్చూరీకి తరలించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లెకు సమీపంలోని కట్లాటపల్లె రోడ్డులో నివాసముంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్. ఆయన ఏడేళ్ల కూతురు సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటివద్ద ఆడుకుంటూ ఉంది. కూలి పనికి వెళ్లిన బాలిక తల్లి తన తండ్రి కి ఫోన్ చేసి వాకబు చేసింది. పాప ఇంట్లో లేదని, బయట ఆడుకోవడానికి వెళ్లిందని భావించారు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతుకులాట ప్రారంభించారు. ఫలితం లేకపోవడంతో మదనపల్లి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లి పట్టణ పోలీసులు కూడా స్థానికంగా గాలించడం తోపాటు సీసీ టీవీ పుటేజీ పరిశీలించారు. డాగ్ వాళ్లు కూడా రంగంలోకి దించారు.

ఎదురింట్లోనే కాలయముడు..

కిడ్నాప్ గురైన బాలిక ఎదురింట్లోనే ఉన్నఇంటిలో శవమై డ్రమ్ములో పడి ఉందని గ్రహించలేకపోయారు.
చేనేత కార్మికుడు గోపీనాథ్ ఇంటికి ఎదురుగానే నివాసం ఉంటున్న కులవర్ధన్ పై నేర చరిత్ర ఉంది. కులవర్ధన్ పై అప్పటికే నేర చరిత్ర ఉన్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఆ సందేహంతో సోమవారం రాత్రి పోలీసులు సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఇంటి వద్దకు వెళ్లారు. గాఢ నిద్రలో ఉన్నట్టు గ్రహించిన పోలీసులు వెళ్లిపోయారు.
"మా మనవరాలు చివరిసారిగా కులవర్ధన్ తోనే కనిపించింది" అని బాలిక తాత గట్టిగా చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. గతంలో ఓ మహిళపై కొడవలితో దాడి చేయడం, కొందరితో అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు బెదిరింపులకు భయపడిన బాధితులు కూడా ఫిర్యాదులు వెనక్కు తీసుకున్నట్లు కూడా తెలిసింది.
మంగళవారం ఉదయం ఏడు గంటలు: కులవర్ధన్ ఇంటికి వెళ్లిన మదనపల్లె పోలీసులు ఎంత పిలిచినా సమాధానం లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టారు. ఇంటిలోకి వెళ్లి చూస్తే డ్రమ్ములో చిన్నారి మృతదేహం పడి ఉండడం గమనించారు. సోమవారం సాయంత్రం అపహరించిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, చంపేశాడని పోలీసులు సందేహిస్తున్నారు. ఈ విషయం బయట తెలియగానే ఒక్కసారిగా మదనపల్లె పట్టణంలో పరిస్థితి మారిపోయింది.
నిందితుడు కులవర్ధన్ ను మాకు అప్పగించండి. అతడికి ప్రజా కోర్టులోనే శిక్ష విధిస్తాం" అని పోలీసులను ప్రాధేయపడ్డారు. బాలిక తల్లిదండ్రులతో కలిసి బంధువులు, ప్రజలు పట్టణంలో అనేక ప్రాంతాల్లో నిరసనకు దిగారు.మంగళవారం సాయంత్రం వరకు జాతీయ రహదారిపై నిరసన కొనసాగింది.

అట్టుడికిన మదనపల్లె

డ్రమ్ములో బాలిక శవాన్ని పడేసి, అదే ఇంటిలో నిందితుడు కులవర్ధన్ నిద్రపోవడం ద్వారా అతనిలో ఉన్న రాక్షస స్వభావం కనిపిస్తోందని నీరుగట్టుపల్లె ప్రజలు ఆగ్రహం చెందారు. దీంతో ట్రాన్స్ జెండర్స్ భారీగా నీరుగట్టువారిపల్లెకు చేరుకున్నారు. పట్టణంలోని ప్రజలు కూడా వీధిలోకి చేరుకుని, ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలియడంతో మదనపల్లె అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు పట్టణానికి చేరుకున్నారు.
నీరుగట్టు వారిపల్లెలో హత్యకు గురైన బాలిక రిషిక మృతదేహం ఉన్న ఇంటిలోకి వెళ్లిన పోలీసులు, ఆధారాలు సేకరించిన తరువాత మృతదేహాన్ని సాయంత్రం మదనపల్లె ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.న అప్పటికే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కూడా మదనపల్లెకు చేరుకున్నారు. బాలిక శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని మంగళవారం రాత్రి కుటుంబసభ్యులకు అప్పగించారు.
బాధిత కుటుంబంతో హోం మంత్రి వంగలపూడి అనిత కూడా స్వయంగా ఫోన్ చేసి, మాట్లాడారు.
"పాపను తీసుకుని రాలేకపోవచ్చు. విచారణకు సహకరించండి. మీకు న్యాయం జరుగుతుంది" అని ఊరడించారు.

శవంగా మారిన నిందితుడు

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యను హత్య చేసిన నిందితుడు కులవర్థన్ బుధవారం చెరువులో శవమయ్యాడు. పట్టణానికి శివారులో ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లు గ్రామానికి సమీపంలోని చెరువులో అనూహ్యంగా బుధవారం శవమై తేలడం సంచలనం రేకెత్తించింది. బాలిక హత్య కేసులో నిందితుడు కులవర్ధన్ శవమై తేలడం పట్టణంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పట్టణంలోని ప్రజల ఆగ్రహం కూడా చల్లారినా, ఏడేళ్ల కూతురిని పోగొట్టుకున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ ఇంటిలో విషాదం వర్ణనాతీతంగా మారింది.
పాపను చింపేసిన నిందితుడు చెరువులో ఎలా శవంగా మారాడనేది చర్చనీయాంశంగా మారింది. మదనపల్లె డీఎస్పీ మహేంద్రతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
Read More
Next Story