కిడ్నాపింగ్ కేసులో బిగుస్తున్నఉచ్చు..?
x

కిడ్నాపింగ్ కేసులో బిగుస్తున్నఉచ్చు..?

తిరుపతిలో ఈనెల 3న విద్యార్థి సంఘ నేతలపై జరిగిన ఘటన.


తెలుగ సినీ దర్శక, నిర్మాత మోహన్ బాబు యూనివర్సిటీ ( MBU ) ఛాన్సులర్ మంచు మోహన్ బాబుకు కిడ్నాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఆయనను అరెస్టు నుంచి మినహాయించడానికి హైకోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్ ను జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తోసిపుచ్చారు.

"బాధితుడైన విద్యార్థి నాయకుడు (SFI) అక్బర్, వినోద్ వాదనలు వినివ తర్వాత నిర్ణయం తీసుకుంటాం" అని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ గురువారం జరగనున్న నేపథ్యంలో ఎంబీయూ ఛాన్స్లర్ మంచు మోహన్ బాబు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మంచు మోహన్ బాబు పక్షాన న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ వాదనలు వినిపించారు.

ఆరోపణలు ఇవి

తిరుపతికి సమీపంలోని రంగంపేట వద్ద మంచు మోహన్ బాబు (MBU) డీమ్డ్ యూనివర్సిటీ నిర్వహిస్తున్నారు. Student federation of India (SFI) నాయకుల ఆరోపణలు ఇవి.
"ఈ యూనివర్సిటీలో డే స్కాలర్ల నుంచి కూడా మెస్ బిల్లులు వసూలు చేస్తున్నారు. యూనిఫాం పేరిట పదివేలు, ప్లేస్మెంట్ కల్పించడానికి డబ్బు వసూలు చేశారు" అనేది ఎస్ఎఫ్ఐ నాయకుల ఆరోపణ. సంబంధం లేని ఫీజుల పేరిట విద్యార్థుల నుంచి 26 కోట్ల రూపాయలు వసూలు చేశారని sfi నాయకులు ఆరోపించారు. ఈ యూనివర్సిటీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంఘటన ఇది

తిరుపతికి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం రంగంపేట వద్ద ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని, ఆ యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఈనెల మూడవ తేదీ ర్యాలీ చేపట్టారు. తిరుపతి నగరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి బయలుదేరారు. అదే సమయంలో మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి చెందిన బౌన్సర్లు దాడి చేసి, ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్, వినోద్ ను కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన సమాచారం తెలిసిన వెంటనే సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, అదనపు ఎస్పి రవి మనోహరాచారికి సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు గంటల వ్యవధిలోనే బాధితులను మోహన్ బాబు పాం హౌస్ లో ఉన్నట్లు తెలుసుకుని కాపాడారు. కిడ్నాపింగ్ కు పాల్పడిన నిందితులను కూడా అరెస్టు చేశారు.
ఈ ఘటనలో ఎంబియు (MBU) ఛాన్సులర్, దర్శక, నిర్మాత మంచు మోహన్ బాబు (A2), యూనివర్సిటీ డైరెక్టర్ గా ఉన్న మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు (A3), మంచు విష్ణు పీఆర్వో సతీష్ (A1) నిందితుడుగా ఉన్నారు. ఆ మేరకు ఈ ఘటనలో మొదటి నిందితుడిగా ఉన్న సతీష్ తోపాటు 13 మంది బౌన్సర్లపై కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. కిడ్నాపింగ్ కేసుపై తిరుచానూరు పోలీసులు ఇప్పటికే మంచు మోహన్ బాబు కొడుకు మంచి విష్ణుకు నోటీసులు పంపించారు. మోహన్ బాబు అందుబాటులో లేరని చెబుతున్నారు.
Read More
Next Story