
తిరుమల శ్రీవారి ఆలయం.
గ్రహణం ఎఫెక్ట్: శ్రీవారి దర్శనం టోకెన్లకు బ్రేక్
మార్చి 1, 2వ తేదీల్లో SSD టోకెన్ల జారీ రద్దు.
తిరుమల శ్రీవారికి మార్చి మూడో తేదీ సుదీర్ఘ విరామం లభించబోతోంది. చంద్రగ్రహణం కారణంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు ఆలయం మూత వేయనున్నారు. రెండు రోజుల పాటు బ్రేక్ దర్శనాలతో పాటు సాధారణ యాత్రికులకు జారీ చేసే టైంస్లాటెడ్ టోకెన్ల జారీ కూడా రద్దు చేశారు. మార్చి 2, 3వ తేదీల్లో శ్రీవారి దర్శనాలకు సంబంధించి స్లాటెడ్ దర్శనం టోకెన్లు జారీ నిలిపి వేయనున్నారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ఎస్ఎస్డీ (SSD ) టోకెన్లు జారీ చేసే విషయం తెలిసిందే. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ రెండు కేంద్రాలు, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం వద్ద రోజుకు 25 వేల టైం స్లాటెడ్ టోకెన్లు జారీ చేస్తుంటారు.
"మార్చి 2, 3వ తేదీలకు సంబంధించిన SSD టోకెన్లు ముందురోజు మార్చి 1, 2వ తేదీల్లో జారీ చేయరు" అని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మళ్లీ మార్చి 4వ తేదీ శ్రీవారి దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను మార్చి మూడో తేదీ జారీ చేస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.
బ్రేక్ దర్శనాలు రద్దు
చంద్రగ్రహణం కారణంగా మార్చి మూడో తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు. మార్చి రెండో తేదీ వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించరని కూడా టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Next Story

