
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంబమాంబ నిత్యాన్నదాన సత్రం.
శ్రీవారి ద్వారా పేదలకు దాతల సహకారం..
ప్రాణదాన ట్రస్ట్ కు కోటి, అన్నదానానికి పది లక్షల రూపాయల విరాళం.
తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం యాత్రికుల ఆకలి తీరుస్తోంది. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి కూడా టీటీడీ స్విమ్స్ ఆసుపత్రి నిర్వహిస్తోంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఇద్దరు దాతలు మంగళవారం 1.10 కోట్ల రూపాయలు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు విరాళంగా అందించారు. మరో యాత్రికుడు శ్రీవెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ కు 10 లక్షల రూపాయల విరాళం అందించారు. వారికి శ్రీవారి దర్శనం తర్వాత ఆలయంలో తీర్థప్రసాదాలు అందించారు.
పేదల వైద్య సేవల కోసం..
తిరుపతిలో శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (Svims) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని టీటీడీ నిర్వహిస్తోంది. తక్కువ ఖర్చుతో ఇక్కడ పేదలకు వైద్య సేవలు అందిస్తోంది. పేదలైన రోగులకు శాస్త్ర చికిత్సల కోసం శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు నిర్వహిస్తోంది. ఈ ట్రస్టుకు అందే విరాళాల వడ్డీతో పేదలకు టీటీడీ వైద్య సేవలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం దర్శించుకున్న హైదరాబాదుకు చెందిన గుప్త హర్షసాయి చౌదరి ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు. తిరుమల క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ను కలిసిన హర్ష సాయి చౌదరి విరాళం డిడి అందించారు.
అన్నదాన సత్రం
తిరుమలలో అన్నదాన సత్రం ఏర్పాటు చేసి ఇప్పటికి 42 సంవత్సరాలు కావస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత యాత్రికులు అన్న ప్రసాదాలు స్వీకరించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.
తిరుమలలో నిత్యాన్నదాన సత్రం నిర్వహణకు దాతలు విరాళాలు అందించడం ద్వారా యాత్రికులకు సేవ చేస్తున్నారు. రోజుకు రెండువేల మంది యాత్రికులకు అన్నదానం చేసే లక్ష్యంగా ప్రారంభించిన ఈ కేంద్రంలో ప్రస్తుతం రోజుకు కనీసం గా 60 వేల నుంచి 70 వేల మంది యాత్రికులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ అన్న ప్రసాదం నిర్వహణకు నెలకు సుమారు 105 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గుంటూరు కు చెందిన యన్ సుధారాణి కుటుంబీకులు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10,01,116 రూపాయిలు విరాళంగా అందించారు. తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిని కలిసిన సుధారాణి కుటుంబీకులు విరాళం డిడిని అందించారు.
Next Story

