స్విమ్స్లో డాక్టర్లుగా పని చేస్తారా.. ఈ సమాచారం మీ కోసమే..
x
తిరుపతిలో టీటీడీ స్విమ్స్ ఆస్పత్రి (ఫైల్)

'స్విమ్స్'లో డాక్టర్లుగా పని చేస్తారా.. ఈ సమాచారం మీ కోసమే..

మార్చి మూడో తేదీ నుంచి 16 పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు


టీటీడీ ధార్మిక కార్యక్రమాలే కాకుండా పేద రోగులకు స్విమ్స్ ద్వారా ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తోంది. ప్రాణదాన ట్రస్టు ద్వారా 193 మంది పేద రోగులకు ఉచితంగా శస్ర్త చికిత్సలు చేయాలని నిర్ణయించింది.

తిరుపతిలోని స్విమ్స్ ( Sri Venkateswara Institute of Medical Sciences SVIMS) ఆస్పత్రిలోని పది విభాగాల్లో

26 వైద్య సిబ్బంది ఖాళీల భర్తీ చేయనున్నారు. మార్చి మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
తాత్కాలిక ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నట్లు సిమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా తెలిపారు
"స్విమ్స్ ఆస్పత్రి కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ఎవల్యూషన్ ఆఫ్ క్యాన్సర్ అవేర్‌నెస్, స్క్రీనింగ్ ప్రోగ్రామ్- యాన్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్” అనే ఎం.ఆర్.సి ప్రాజెక్టులో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అర్హత పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ఆమె సూచించారు.

పోస్టుల వివరాలు ఇవి

తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో ఎంఆర్సీ ప్రాజెక్టు ద్వారా వైద్య సిబ్బందిని నియమించనున్నారు. ఆ ఖాళీల వివరాలు ఇవి.
1. మెడికల్ ఆఫీసర్ - 4
2. స్టాఫ్ నర్సు - 4
3. ఏఎన్ఎం - 4
4. మామోగ్రఫీ టెక్నీషియన్ - 2
5. కార్డియోవాస్క్యులర్ టెక్నీషియన్ గ్రేడ్- II -2
6. డేటా ఎంట్రీ ఆపరేటర్ -2
7. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ -2
8. మెడికో సోషల్ వర్కర్ -2
9. ఎలక్ట్రీషియన్ - 2
10. డ్రైవర్ - 2
ఈ పోస్టులకు అర్హతలు స్విమ్స్ అధికారిక వెబ్ సైట్ లో వివరాలు ఉన్నాయని సిమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా తెలిపారు. నోటిఫికేషన్ తోపాటు దరఖాస్తు, ఇతర వివరాలు https://svimstpt.ap.nic.in వెబ్‌సైట్ లో ఉంచామని ఆమె వివరించారు.

193 మంది పేదలకు ప్రాణదానం

తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో 193 మంది పేద రోగులకు ఉచితంగా శస్ర్త చికిత్సలు చేయడానికి ఎంపిక చేశామని ఆ ఆస్పత్రి డైరెక్టర్ ఆర్.వి. కుమార్ చెప్పారు.
టీటీడీ నిధులు, దాతలు అందించే విరాళాల వడ్డీతో పేదరోగులకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడానికి తిరుపతిలో స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రి 2104లో విశ్వవిద్యాలయం హోదాలో వైద్య కళాశాల స్థాయికి తీర్చిదిద్దారు.
"ఆధునిక వైద్య శాస్ర్తం, సాంకేతిక సేవ, శిక్షణ, విద్య ప్రధాన లక్ష్యాులుగా పేదలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి" అని స్విమ్స్ డైరెక్టర్ ఆర్.వి. కుమార్ చెప్పారు.
టీటీడీ నిధులతో నిర్వహించే ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పేద రోగులకు తక్కువ ఫీజులకు వైద్య సేవలు అందిస్తోంది. టీటీడీ నిర్వహిస్తున్న తొమ్మిది ప్రధాన ట్రస్టుల్లో ప్రాణదాన పథకం కూడా ఒకటి. దాతలు అందించిన విరాళాలను టీటీడీ ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం ద్వారా వస్తున్న వడ్డీ, ఇతర గ్రాంట్ల ద్వారా ప్రాణదాన పథకంలో పేదరోగులకు ఖరీదైన వైద్యం స్విమ్స్ ద్వారా అందించడానికి టీటీడీ సహకారం అందిస్తోంది.
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలోని వివిధ జబ్బులతో బాధ పడుతున్న పేదరోగుల పరిస్థితి అర్థం చేసుకుని, వారికి టీటీడీ నిధుల్లో ప్రాణదాన పథకం కింద ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయడానికి అర్హులను ఎంపిక చేసినట్లు ఆయన డాక్టర్ ఆర్వీ. కుమార్ చెప్పారు. శ్రీ పద్మావతీ చిన్న పిల్లల హృదయాలయ, డాక్టర్ శ్రీనాథరెడ్డి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ రామమూర్తి, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమకుమారి, రుయా ఆస్పత్రి డాక్టర్ సుబ్బలక్ష్మి, ప్రసూతి వైద్య శాఖ డాక్టర్ శ్రీనివాసులుతో వివిధ విభాగాల్లోని రోగుల పరిస్థితిపై చర్చించినట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ.కుమార్ చెప్పారు. ఆ వైద్యుల సూచనలతో 193 మంది పేద రోగులకు టీటీడీ ప్రాణదాన ట్రస్టు ద్వారా ఉచితంగా శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో కార్డియాలజీలో ఇద్దరు, కార్డియో థోరాసిక్, 14 మందికి, ఈఎన్టీ ఒకరు, జనరల్ సర్జరీ ఐదుగురు, మెడిసిన్ విభాగంలో 16, మెడికట్ ఆంకాలజీలో ఒకరు, నెఫ్రాలజీలో 63 మంది, న్యూరాలజీలో 18 మంది, న్యూరోసర్జరీలో 35, గైనకాలనీలో నలుగురు, రేడియేషన్ ఆంకాలజీలో ముగ్గురు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో 29, సర్జికల్ ఆంకాలజీలో ఒరు, యూరాలజీలో ఒకరికి శస్త్ర చికిత్సలు చేయాలని నిర్ఱయించినట్లు డాక్టర్ ఆర్వీ. కుమార్ వెల్లడించారు.
Read More
Next Story