తిరుమల:సంప్రదాయ పూజలు చేయించుకోవాలా..
x
తిరుమల కల్యాణ వేదిక వద్ద పాపకు చెవిపోగులు కుట్టిస్తున్న తల్లదండ్రులు (ఫైల్)

తిరుమల:సంప్రదాయ పూజలు చేయించుకోవాలా..

కల్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం మీ కోసమే అంటున్న టీటీడీ.


తిరుమలలో కళ్యాణవీణలు మోగుతూనే ఉంటాయి. ఆ వేదికపై సంప్రదాయ పూజలకు కూడా ఆస్కారం ఉంది. అందుకు తగినట్టు టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలో ఉభయ దేవేరులతో శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు నిత్య కళ్యాణం నిర్వహించడం ఓ సంప్రదాయం. శ్రీవారి కల్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గృహస్తులకు అవసరమైన వివిధ సంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్దేశిత రుసుం చెల్లిచడం ద్వారా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. పాపవినాశనం వెళ్లే మార్గంలో టీటీడీ కల్యాణ వేదిక వద్ద ఎలాంటి వసతులు ఉన్నాయి? ఏ రకాల పూజలు చేయించుకోవడానికి అవకాశం ఉందనేది తెలుసుకుందాం..

కల్యాణ వేదిక వద్ద

తిరుమలలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్ద పేదలే కాదు. సంపన్నుల కూడా ఉచిత వివాహాలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన చాలా మంది ఇళ్ల వద్ద సత్యనారాయణ వ్రతం ఆచరించిన తరువాత కాబోయే దంపతులను తిరుమలకు తీసుకుని వస్తారు. ఇక్కడి కల్యాణ వేదికపై ఉచితంగా వివాహలు జరిపించడం ఓ మొక్కుగా భావిస్తారు. ఇక్కడే వివాహాల రిజిస్ట్రేషన్ కార్యాలయం అందుబాటులో ఉంచారు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకోవచ్చు..

సంప్రదాయ పూజలు


తిరుమలలోని పాపవినాశనం వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై సంప్రదాయ పూజలు చేయించుకోవడానికి కూడా అవసరమైన సేవలు టీటీడీ అందుబాటులో ఉంచింది. దీనికి తగినంత రుసుం కూడా నిర్ధారించారు. ఇక్కడ టీటీడీ పురోహిత సంఘం ద్వారా వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజలు వంటి ధార్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు వసతులు అందుబాటులో ఉంచారు. భక్తుల సౌకర్యం కోసం ఈ కార్యక్రమాలను తక్కువ ఖర్చుతో చేసుకునేవిధంగా టీటీడీ అందుబాటులో ఉంచింది. కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఫీజులు ఇవి.

వివాహం – ఉచితం
ఉపనయనం – రూ.300
సత్యనారాయణ వ్రతం – రూ.300
కేశఖండన – రూ.200
నామకరణం – రూ.200
అన్నప్రాసన – రూ.200
అక్షరాభ్యాసం – రూ.200
వాహన పూజ – రూ.200
చెవిపోగులు కుట్టడం – రూ.50
చెవిపోగులు కుట్టడం (కాటేజ్‌లో) – రూ.100
మేళం (ఒక సెట్టు) – రూ.100
మేళం (రెండు సెట్లు) – రూ.300
దస్త్ర పూజ – రూ.200
ఇతర ధార్మిక కార్యక్రమాలు – రూ.200
ముందస్తుగా ఎలాంటి రిజిస్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తిరుమలకు చేరుకునే యాత్రికులు నేరుగా కల్యాణ వేదిక వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్ లో ఏ పూజ, లేదా కార్యక్రమం నిర్వహిస్తున్నారనేది చెబితే చాలు. దానికి సంబంధించిన రుసుం చెల్లిస్తే, మిగతా వసతులు అక్కడి సిబ్బంది ఏర్పాటు చేస్తారని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ద్వారా చీఫ్ పీఆర్ఓ డాక్టర్ తలారి రవి చెప్పారు. యాత్రికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం తిరుమల కళ్యాణ వేదిక వద్దనున్న పురోహిత సంఘాన్ని సంప్రదించవచ్చు.


Read More
Next Story