కారు-క్రేన్ ఢీ .. కళ్లెదుటే భార్య, పిల్లలు మృతి. తల్లడిల్లిన తండ్రి..
x

కారు-క్రేన్ ఢీ .. కళ్లెదుటే భార్య, పిల్లలు మృతి. తల్లడిల్లిన తండ్రి..

బెంగళూరు శ్రీవారి భక్తులను డోన్ వద్ద వెంటాడిన మృత్యువు.


తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కారులో బయలుదేరిన కుటుంబాన్ని మృత్యువు వెంబడించింది. కారును క్రేన్ ఢీకొనడంతో ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారు నడుపుతున్న ఈ ఇంటి పెద్ద తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. కళ్ళెదుటే భార్య, పిల్లలు కనుమూయడాన్ని చూసిన ఆభర్త తల్లడిల్లాడు. ఈ సంఘటన నంద్యాల జిల్లా డోన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.

తిరుమలకు బయలుదేరి

బెంగళూరుకు చెందిన ప్రమోద్ తన కారులో భార్య, చిన్నపిల్లలు కొడుకు, కూతురుతో కలిసి. సరదాగా మాట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు. వారి కారు నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుంది. డోన్ సమీపానికి రాగానే జగదూతి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న భారీ క్రేన్ అదుపుతప్పి కారును బలంగా ఢీకొండినట్లు సమాచారం అందింది. ఈ ప్రమాదంలో కారు నుర్జునుజుగా మారిపోవడంతో ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డాడు. భారీ క్రేన్ ఢీకొన్న ధాటికి ప్రమోద్ భార్య ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారని సమాచారం అందింది.

కారులో చిక్కుకొని..

డోన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో కారులో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేస్తున్న ప్రమోద్ను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే ఆయనను 108 అంబులెన్స్లో డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ప్రమోద్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.
జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిందని సమాచారం అందగానే డోన్ సీఐ రాకేష్, ఎస్ఐ మమత సిబ్బందితో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును పక్కకు తొలగించి, మృతదేహాలను కూడా పోస్టుమార్టం కోసం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిసింది. బెంగళూరుకు చెందిన ప్రమోద్ భార్య పిల్లలతో కలిసి తిరుమలకు ఏ మార్గంలో బయలుదేరారని కొందరు చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More
Next Story