
తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ
ఆలయం వద్ద టీటీడీ అధికారుల ఇస్తికఫాల్ స్వాగతం
తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్ దర్శించుకున్నారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల న్యాయమూర్తుల బృందం కూడా ఉంది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయన తోపాటు వెంట ఉన్న న్యాయమూర్తులకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికి, బస ఏర్పాట్లు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు ఆదివారం ఉదయం జస్టిస్ సూర్యకాంత్ మిగతా న్యాయమూర్తులతో కలిసి చేరుకున్నారు. వారికి మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి ఆలయ అర్చకులతో కలిసి మేళతాళాల నడుమ, వేద మంత్రోచ్ఛారణతో సాంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
ఆలయంలోకి వెళ్లిన సీజేఐ ధ్వజస్తంభం వద్ద మొక్కులు చెల్లించారు అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. తిరిగి వచ్చాక రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించి శేషవస్త్రంతో సత్కరించారు.
ఆయనకు టీటీడీ చైర్మన్, ఈఓ వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అంతకుముందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవరాహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తులకు స్వాగతం పలికిన వారిలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీ&ఎస్వో మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, అధికారులు ఉన్నారు.
Next Story

