మేము పక్కా లోకల్.. బావ మాటే.. బంగారు బాట...
x
కుప్పంలో సీఎం చంద్రబాబు కుటుంబీకుల పూజ (ఫైల్) హిందూపురంలో సొంతింటి నిర్మాణానికి పూజలు చేస్తున్న నందమూరి బాలకృష్ణ, భార్య వసుంధర

మేము పక్కా లోకల్.. బావ మాటే.. బంగారు బాట...

కుప్పంలో బాబు. హిందూపురంలో సొంతింటి కోసం టెంకాయ కొట్టిన బాలకృష్ణ


స్థానికులు కాదనే వైసీపీ విమర్శలకు కుప్పంలో సీఎం చంద్రబాబు తరహాలోనే హిందూపురంలో ఆయన బావ, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దీటుగా సమాధానం ఇచ్చారు. 40 సంవత్సరాల తరువాత నారా చంద్రబాబు తరహాలోనే బాలకృష్ణ హిందూపురంలో రాజకీయంగా సమాధానం ఇచ్చారు. హిందూపురంలో సొంత ఇంటి నిర్మాణానికి శుక్రవారం ఆయన తన భార్య వసుంధరతో కలిసి భూమి శాస్త్రోక్తంగా పూజ చేశారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా నిలిచింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు తరువాత నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు.

"స్థానికంగా అందుబాటులో ఉండరు" అనే ప్రతిపక్ష వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కుప్పం తరహాలోనే హిందూపురంలో నందమూరి బాలకృష్ణ తెరదించారని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తెలుగుదేశం ఆవిర్భావం తరువాత రాయలసీమలో 1983 ఎన్నికల నుంచి చిత్తూరు జిల్లా కుప్పం తరువాత, అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం పార్టీ (TDP) కి కంచుకోటగా మారింది. నందమూరి కుటుంబాన్ని హిందూపురం ప్రజలు ఆదరిస్తున్నారు. కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీ హవా బలంగా వీచినా 2004, 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు.

కుప్పంలో చంద్రబాబు...

కుప్పం నియోజకవర్గం నుంచి మొదట 1989లో నారా చంద్రబాబు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ఎనిమిదోసారి ఆయనకు కుప్పం ప్రజలు పట్టంకట్టారు. ఇక్కడి నుంచి ఎన్నికైన తరువాత ఆయన ఆయన నాలుగోసారి సీఎంగా ఉన్నారు. కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఆయన ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సేదదీరడం, నియోజకవర్గంలో రెండు లేదా మూడు రోజులు పర్యటించి వేళ్లడం సర్వసాధారణంగా జరిగింది. ఇదే అస్త్రంగా చేసుకున్న వైసీపీ 2014 నుంచి విమర్శలు ఎక్కుపెట్టింది. 2024 ఎన్నికల్లో వైసీపీ మాటల దాడి ప్రారంభించింది.
"కుప్పం నుంచి ఇన్నీసార్లు ఎన్నికయ్యారు. ఆయన స్థానికుడు కాదు. కనీసం సొంత ఇల్లు లేదు" అని వైసీపీ చీఫ్ వైఎస్. జగన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా విమర్శలు సంధించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు.

2023లో శాంతిపురం మండలం కడపల్లె వద్ద సొంతింటి నిర్మాణం ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో ఎనిమిదోసారి నారా చంద్రబాబు విజయం సాధించిన తరువాత ఆలోచన మారింది. 2025 మే 25వ తేదీ నిర్మాణ పనులు పూర్తి చేయడం ద్వారా గృహప్రవేశం చేయడం ద్వారా వైసీపీ విమర్శలకు చెక్ పెట్టారు
"అప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబ సమేతంగా వచ్చానా, ఆయన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ వచ్చినా కడపల్లెలోని సొంతింటిలోనే బస చేస్తున్నారు" ఈ విధంగా వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు.

హిందూపురం టీడీపీ కోటలో..

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రాయలసీమలో కుప్పం తరువాత ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీకి అండగా నిలుస్తోంది. ఇక్కడ నందమూరి కుటుంబం నుంచి ఏడుసార్లు నందమూరి కుటుంబీకులే విజయం సాధించారు. వారిలో..
1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పామిశెట్టి రంగనాయకులు విజయం సాధిస్తే, 1985 నుంచి 1994 ఎన్నికల వరకు వరుసగా మాజీ సీఎం, ఎన్టీరామారావు హ్యాట్రిక్ సాధించారు. ఆయన మరణం తరువాత 1996 ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ గెలిచారు. 1999లో వెంకటరాముడు, 2004, 2009లో కాంగ్రెస్ గాలి బలంగా వీచినా, పామిశెట్టి వెంకటరాముడు, పి. అబ్దుల్ ఘని విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో రాజకీయ తెరగేంట్రం చేసిన నందమూరి బాలకృష్ణ, 2019, 2024 ఎన్నికల్లో తన తండ్రి ఎన్టీ. రామారాకు ఏమాత్రం తీసిపోకుండా వరుసగా విజయం సాధించడంలో హిందూపురం అండగా నిలిచింది.

బావ బాటలో బాలకృష్ణ


కుప్పం తరహాలోనే హిందూపురం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన నందమూరి కుటుంబీకుల్లో బాలకృష్ణపై వైసీపీ ఫోకస్ పెట్టింది. విమర్శల దాడి ప్రారంభించింది.
"నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిస్తే, హైదరాబాదుకు మాత్రమే పరిమితం అవుతారు. చుట్టపు చూపులా వస్తారు" అని వైసీపీ గత ఎన్నికల్లో స్థానికతను అస్త్రంగా ప్రయోగించారు. టీడీపీ ఆవిర్భవించిన 43 ఏళ్ల తరువాత కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాటలోనే హిందూపురంలో ఆయన తోడల్లుడు, బావ నందమూరి బాలకృష్ణ వైసీపీ విమర్శలకు చెక్ పెట్టారు.
"సినిమాల్లో, ఎన్నికలప్పుడు బాలకృష్ణ రాయలసీమకు దత్తపుత్రుడిని" అని వ్యాఖ్యానించడం గమనార్హం. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుప్పంలో అమలు చేసిన ఫార్ములా హిందూపురంలో బాలకృష్ణ కూడా అమలు చేసినట్లు కనిపిస్తోంది.
"నేనూ హిందూపురం వాసినే. ఇక్కడే నివాసం ఉంటా. నియోజకవర్గంలో పార్టీని పర్యవేక్షిస్తా" అని సమాధానం ఇచ్చే రీతిలో సొంతింటి నిర్మాణానికి భూమి చేశారు. ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి తోపాటు నియోజకవర్గంలోని టీటీడీ నాయకులు భారీగా హాజరయ్యారు.
హిందూపురం పట్టణానికి సమీపంలోని వనంకాలనీలో సంప్రదాయబద్ధంగా దేవతా మూర్తుల చిత్రపటాలకు పూజలు, హోమం నిర్మించడం ద్వారా నందమూరి బాలకృష్ణ టెంకాయ కొట్టారు.
Read More
Next Story