నీటి సంరక్షణకు కుప్పంలో పైలెట్ ప్రాజెక్ట్
విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి
ఇన్నోవేషన్లను ప్రొత్సహిస్తున్నాం...
స్టార్టప్ కంపెనీలకు అండగా ఉంటున్నాం
విద్యార్థులతో ముఖాముఖీలో సీఎం చంద్రబాబు
కుప్పం నియోజకవర్గాన్నిఆధునాతన సాంకేతికత పద్ధతులు ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పం నియోజకవర్గానని 'ఇన్నోవేషన్ ల్యాబ్ 'గా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కుప్పంలో 25 ఏళ్లుగా ఆగస్త్య అకాడెమీ పమర్థవంతంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర భవిష్యత్తుకు సూచికలు అని ఆయన వ్యాఖ్యానించారు. కుప్పంలో రూ. 675.24 కోట్ల పెట్టుబడుల కోసం ఏడు సంస్థల ప్రతినిధులతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకోనున్నారు. కుప్పంలో కృష్ణా జలాల ముఖ్యమంత్రి హారతి ఇచ్చారు.
కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం సాయంత్రం ఆయన చేరుకున్నారు. నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కుప్పం సమీపంలోని అగస్త్య అకాడమీ ఆడిటోరియంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. అకాడమీ ప్రతినిధులు విద్యార్థులకు తమ సైన్స్, టెక్నాలజీ, అవిష్కరణ కార్యక్రమాలపై వివరణాత్మక వీడియో ప్రదర్శన నిర్వహించారు.
కుప్పం అగస్త్య ఫౌండేషన్ అకాడమీలో టీచర్ గా మారిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
"ప్రపంచంలో మారుతున్న పరిణామాలను అందిపుచ్చుకోవాలి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు.
కుప్పంకు నీటి భద్రత
కుప్పం నియోజకవర్గంలో ప్రజలు, రైతులకు హంద్రీ–నీవా ప్రాజెక్ట్ ద్వారా నీటి భద్రత పెంచామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. నీటి పరిరక్షణ, స్థిరమైన నీటి వినియోగ పద్ధతులపై ఆలోచించాలని అకాడమీ ప్రతినిధులకు సూచించారు. కుప్పంలో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని, విద్యార్థులు దీన్ని గమనించి, ప్రభుత్వం సృష్టించిన అవకాశాలను ఉపయోగించుకోవాలన్నారు.
గతాన్ని నెమరు వేసుకున్న సీఎం..
కుప్పంలో అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు అందించిన సహకారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విద్యార్థులతో పంచుకున్నారు.
"సుమారు 25 సంవత్సరాల క్రితం అగస్త్య అకాడమీ ఛైర్మన్ రామ్ జీ రాఘవన్ ఒక శక్తివంతమైన ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. ఆయన ఆ దృక్పథానికి మద్దతు ప్రకటించా. అప్పటి నుంచి అకాడమీ సమర్థవంతంగా నడిపిస్తూ దేశంలోని అనుభవాత్మక విద్య కేంద్రాల్లో ప్రధానమైందిగా గుర్తింపు సాధించింది" అని కొనియాడారు.
"ఇక్కడి పర్యావరణం, శుభ్రత, సహజమైన వాతావరణంలోని అకాడమీ ప్రభుత్వ భవిష్యత్తు దృష్టి విధానాలను ప్రతిబింబిస్తోంది" అని అభివర్ణించారు.
ఆలోచనలు మారాలి...
ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, వాటికి అనుగుణంగా విద్యార్థులు ఆలోచనలు పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విద్యార్థులకు కర్తవ్య బోధ చేశారు. ప్రపంచంలో తెలుగు వారు ఐటి రంగంలో గుర్తింపు సంపాదించారంటే, ఐటి ప్రాధాన్యం ఉన్న కాలంలో పునాది వేయడం వల్లే సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ,
"ఇన్నోవేటర్లకు, స్టార్టప్ ద్వారా అవకాశాలు అందిస్తున్నాం. డ్రోన్లు, అంతరిక్ష సాంకేతికత వంటి ప్రాజెక్టులు రాష్ట్ర దీర్ఘకాల అభివృద్ధి వ్యూహంలో భాగం" అని తెలిపారు. విద్యుత్ రంగంలో సాంకేతికత ప్రవేశపెట్టడం ద్వారా కొనుగోలు ఖర్చు తగ్గించడం, విద్యుత్ టారిఫ్‌లు సౌలభ్యంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఇన్నోవేషన్ ల్యాబ్
కుప్పం నియోజకవర్గాన్ని వివిధ అధునాతన సాంకేతికత కార్యక్రమాల అమలు ద్వారా ‘ఇన్నోవేషన్ ల్యాబ్’ గా అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. హంద్రీ–నీవా ప్రాజెక్ట్ ద్వారా కుప్పానికి నీటి భద్రత పెంచామని గుర్తుచేశారు. సృజనాత్మకతపై విద్యార్థులు దృష్టి సారింంచాలని ఆయన సూచించారు.
కుప్పంలో అగస్త్య ఫౌండేషన్ అనుభవాత్మక విద్య, నైపుణ్యాభివృద్ధి ప్రధాన కేంద్రంగా మారిందని ఈ కార్యక్రమంలో మాట్లాడిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు, అగస్త్య క్రియేటివిటీ క్యాంపస్ లో ఏటా సుమారు 20 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మూడు నుంచి నాలుగు వేల మంది టీచర్లు సుక్షితులు అవుతున్న విషయాన్ని ఆయన వివరించారు. ఇక్కడ 15 హ్యాండ్స్-ఆన్ లర్నింగ్ సెంటర్స్, సైన్స్, గణిత శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇది సెంథటిక్ బయోడైవర్సిటీ హబ్ గా కూడా ఉంది, ఇందులో వందల రకాల మొక్కలు, సీతాకోకచిలుకలు, పక్షులు ఉన్నాయని కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు.
మొదటి రోజు పర్యటనలో.. జలహారతి...
కుప్పం నియోజకవర్గం గుడుపల్లి వద్ద హంద్రీ నీవా కాలువలో కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మండలంలోని సమీప గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటనలో విభిన్న కార్యక్రమాలతో బిజీగా గడిపారు.
మొదటి రోజు పర్యటనలో...
1) కుప్పంలో రూ. 675.24 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సమక్షంలో ఏడు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
2) గుడిపల్లిలో రూ. 3 కోట్లతో నిర్మించిన ఆగస్త్య విద్యాచల్ అకాడెమీని ప్రారంభించారు.
3) రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న లెర్నర్స్ అకాడెమీ ఫెసిలిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
4) రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించే ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు.
5) కుప్పం మున్సిపాలిటీలో స్వర్ణ నవదిశ కేంద్రం పేరుతో ఏర్పాటు చేసిన కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను ప్రారంభించారు.
6) ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం.
7) కంగుంది హెరిటజ్ విలేజ్ బౌల్డరింగ్ పార్క్ ను ఆవిష్కరించారు.
8) డిస్కవర్ కుప్పం టూరిజం వెబ్ సైట్ లాంఛ్ చేశారు.
9) రూ. 4 కోట్లతో కుప్పం పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కంగుంది హెరిటెజ్ విలేజీలో 32 హోం స్టేలు, 9 టెంట్ అకామిడేషన్లను అందుబాటులోకి తెచ్చిన పర్యాటక శాఖ.
హోం స్టేలు, టెంట్ అకామిడేషన్లల్లో ఉన్న వసతులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
10) కుప్పంలో పున్నమి రిసార్ట్ ను ప్రారంభించారు.
ఇక్కడ 18 లగ్జరీ రూంలు, యాంఫీ థియేటర్, మీటింగ్ హాల్, రెస్టారెంట్లతో పున్నమి రిసార్ట్స్.