కల్తీ నెయ్యి ఓ పాఠం: కొనుగోళ్ల టెండర్లకు డిజిటల్ పద్ధతి..
x

కల్తీ నెయ్యి ఓ పాఠం: కొనుగోళ్ల టెండర్లకు డిజిటల్ పద్ధతి..

పది సూత్రాలు ప్రామాణికంగా కొత్త పోర్టల్ పై టీటీడీ కసరత్తు.


ఆహార పదార్థాల తయారీకి అవసరమైన వస్తువుల కొనుగోలు తోపాటు టెండర్ల ప్రక్రియ మరింత పారదర్శకంగా నిర్వహించడానికి టీటీడీ కసరత్తు చేస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా టీటీడీ టెండర్ పోర్టల్ (TTD Tender Portal)పై దృష్టి నిలిపింది. విమర్శలు, ఆరోపణలకు ఆస్కారం లేని విధంగా నెయ్యి, ఆహార పదార్థాల తయారీకి అవసరమైన వస్తువుల కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ పోర్టల్ ( e-portal ద్వారా కొనుగోలు, టెండర్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలోనిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం" అని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చెప్పారు.
తిరుమలలో ఈ పోర్టల్ ( e-portal ) ద్వారా కొనుగోలు, టెండర్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో ప్రోక్యూర్‌మెంట్, టెండర్ పోర్టల్ అభివృద్ధిపై టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి పద్మావతి అతిథి గృహంలో అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు, టెండర్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేడియంట్ ఇన్ఫోనెట్ ప్రైవేట్ లిమిటెడ్ (Radiant Infonet Private Limited) సంస్థ రూపొందించిన వెబ్ సైట్ ప్రోటోటైప్, డిజైన్ పై అధికారులతో వెంకయ్య చౌదరి చర్చించారు.

కల్తీ నెయ్యి వివాదంతో..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిపై వివాదం మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అన్నప్రసాదాలతో పాటు, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యత మెరుగుదలపై దృష్టి సారించారు. గత ప్రభుత్వం నాటి ఆరోపణలు పునరావృతం కాకుండా, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీటీడీకి నెయ్యి తో పాటు బియ్యం, పప్పు దినుసులు, డ్రై ప్రూట్స్ కొనుగోలుకు కూడా ఈ టెండర్లు నిర్వహిస్తున్నారు. ఇందులో మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ణానం వినియోగించే దిశగా కసరత్తు ప్రారంభించారు.

డిజిటల్ విధానంలో కొనుగోలు..

టీటీడీకి అవసరమైన ముడిసరుకుల కొనుగోలుకు పూర్తి స్థాయిలో ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు, టెండర్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో ఆరోపణలు, వివాదాలకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని టీటీడీ యంత్రాంగం స్థిర నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు వెబ్ సైట్ ప్రోటోటైప్, డిజైన్ పై టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి చర్చించారు.

ఆ ముఖ్యాంశాలు ఇవీ..
1) టీటీడీకి అవసరమైన వస్తువులు సరఫరా చేయడానికి టెండర్ ప్రక్రియలో పాల్గొనే సరఫరాదారులు ముందుగా పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు కావాలి.
2) నమోదైన సరఫరాదారుల వివరాలు, అర్హతలు, నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలిస్తారు. అర్హత కలిగిన సరఫరాదారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు.
టీటీడీ పాలక మండలిలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటి ఉంది. వారితో పాటు అధికారుల్లో ప్రధానంగా టీటీడీ ప్రోక్యూర్ మెంట్ జీఎం, టీటీడీ ఎఫ్ఏ&సీఏఓ తోపాటు డిప్యూటీ ఈఓ స్థాయి అధికారులు ఉంటారు.
3) భవిష్యత్ కొనుగోలు ప్రక్రియలకు ఉపయోగపడే విధంగా ధ్రువీకరించిన సరఫరాదారుల విశ్వసనీయ డేటాబేస్ రూపొందింస్తారు.
4) ఈ వ్యవస్థ ద్వారా నకిలీ సరఫరాదారులు, మధ్యవర్తులను గుర్తించి తొలగించడం సాధ్యమవుతుంది. దీంతో టెండర్లలో నిజమైన సరఫరాదారులకు సమాన అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఉంటుంది.
5) మార్కెట్ ధోరణులు, ధరల మార్పులు, సరఫరా పరిస్థితులను విశ్లేషించేందుకు ఏఐ సాంకేతికతను ఉపయోగించి మెరుగైన కొనుగోలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది.
6) టెండర్ ప్రక్రియ, సరఫరా నిర్వహణ, చెల్లింపుల వ్యవస్థలను ఒకే వేదికపై సమగ్రంగా అనుసంధానిస్తారు.
7) డిజిటల్ విధానంలో చెల్లింపులు వేగంగా జరిగేలా ఈ వ్యవస్థ సహకరిస్తుంది. దీని ద్వారా సరఫరాదారుల్లో విశ్వాసం పెరుగుతుంది.
8) పారదర్శక వ్యవస్థ కారణంగా ఎక్కువ మంది అర్హత కలిగిన సరఫరాదారులు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
9) ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా నిర్వహించబడుతుంది.
అని సమీక్షలో అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో టీటీడీ అడిషనల్ ఎఫ్ఏ&సీఏఓ రవి ప్రసాదు, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ వెంకట రమణ, టీటీడీ ప్రోక్యూర్ మెంట్ జీఎం పద్మావతి, అధికారులు పాల్గొన్నారు.
ఈ విధానం అమలులోకి తీసుకుని రావడం ద్వారా టీటీడీలో పారదర్శక విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. ఇది ఎంతమేరకు సఫలం అవుతుంది? ఇందులో పాలక మండలి పాత్ర, ప్రధానంగా పర్చేజింగ్ కమిటీ ప్రమేయం ఎంతమేరకు ఉంటుందనేది తుది నిర్ణయం తీసుకున్న తరువాతే తెలిసే అవకాశం ఉంది.


Read More
Next Story