ఈ పాపను కిడ్నాప్ చేసింది ఎవరు ..?
x

ఈ పాపను కిడ్నాప్ చేసింది ఎవరు ..?

తిరుపతిలో బుధవారం రాత్రి కలకలం రేపిన ఘటన


తిరుపతిలో 13 నెలల పాపను కిడ్నాప్ చేశారు. బుధవారం రాత్రి ఈ ఘటన కలకలం రేపింది. తల్లి పక్కన ఉండాల్సిన ఆ బిడ్డ ఏ వేదన పడుతుందో తెలియదు. ఆ బిడ్డ కోసం ఆ పేద తల్లి తల్లడిల్లుతోంది. పాలు తాగే పసిపాపను ఎందుకు కిడ్నాప్ చేశారనేది మిస్టరీగా మారింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు పసిబిడ్డను అపహరించిన నిందితుల కోసం గాలింపు చర్యలకు రంగంలోకి దిగారు.

కూతురు జయశ్రీతో సుచిత్ర (ఫైల్)

తిరుపతి నగరం ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలచేను వద్ద ఉన్న స్టార్ లైట్ బిల్డింగ్ సమీపంలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో (కొద్దిసేపటి కిందట) ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో సుచిత్ర అనే మహిళ కుటుంబంతో నివాసం ఉంటుంది. ఈమెకు 13 నెలల కూతురు జయశ్రీ. ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా తన బిడ్డ జయశ్రీ ని ఎత్తుకునిపోయారని ఆమె తల్లి సుచిత్ర ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

రంగంలోకి పోలీసులు
ఆడబిడ్డను కిడ్నాప్ చేశారనే సమాచారం అందుకున్న వెంటనే ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గాలింపు చర్యల కోసం రంగంలోకి దిగారు. చింతల చేను స్టార్ లైట్ బిల్డింగ్ సమీప ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాల పుటేజీని పరిశీలించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఉన్న సిసి ఫుటేజీలను కూడా ఈస్ట్ పోలీసులు పరిశీలించారు.
నిందితులు వారేనా
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చింతలచెరువు వద్ద సుచిత్ర ఇంటికి సమీపంలోనే ఇంకొందరు నివాసం ఉంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు సుచిత్ర ఇంటికి సమీపంలోనే ఉన్న మారెమ్మ, మురుగన్ దంపతులు 13 నెలల పసిపాప జయశ్రీని ఎత్తుకుని వెళ్ళినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ మేరకు సీసీటీవీ ఫుటేజ్ లో వారి కదలికలు పోలీసులు గమనించారు. పాపను అపహరించిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు చెప్పారు. ఈ ఘటన వెనుక ఏం జరిగిందనేది దర్యాప్తులో తేలుతుందని ఆయన స్పష్టం చేశారు.
Read More
Next Story