
శాసనసభలో మాట్టాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.
తిరుమల:బ్రిటీషర్లు చేయలేని విధంగా.. 'వైసీపీ మహాపాపం'.. ఎవరినీ వదలం..
ఏకసభ్య కమిషన్ తో నిజాలు బయటపెడతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
వైఎస్ఆర్, జగన్ తో పోలిస్తే.. బ్రటీషర్లే నయం
వైఎస్ కాలం నుంచి తిరుమల పవిత్రతపై దాడి
ఏకసభ్య కమిషన్ తో నిజాలు బయటికి తీస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు
బీజేపీ సుబ్రహ్మణ్యస్వామికి భక్తి ఉందా?
జగన్ తో ఆయనకు విడదీయని బంధం
జ్యోతుల నెహ్రూ సెటైర్లు
బ్రిటిషర్లు కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జోలికి వెళ్లలేదు. కల్తీ నెయ్యి వాడకంతో వైయస్ జగన్ ప్రభుత్వం అంతకుముందు వైఎస్. రాజశేఖరరెడ్డి కూడా హిందువుల మనోభావాలతో ఆడుకుని మహాపాపానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యికి సంబంధించి సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఉన్న నిందితులకు అండగా తెర వెనక ఉన్న పెద్దన్న లను వదిలే సమస్య లేదు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టిడిపి ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ కూడా హెచ్చరించారు.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో 59.71 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి వాడడం ద్వారా 20.01 కోట్ల లడ్డూలు తయారుచేసి ఘోర అపచారానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోపించారు.
తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం పై రగులుతున్న విభాగం నేపథ్యంలో అసెంబ్లీలో మంగళవారం స్వల్పకాలిక చర్చకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత 12 మంది ఎమ్మెల్యేలు ఈ చర్చలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానం తర్వాత చివరగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమాధానం చెబుతూ,
తిరుమలపై జగనే కాదు. ఆనాడు వైఎస్. రాజశేఖరరెడ్డి కూడా ఒక పద్ధతి ప్రకారం కుట్రతో అపవిత్రం చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీగా దేవసంగీతం అనే వ్యక్తిని నియమించారు. యూనివర్సిటీలో శ్రీవెంకటేశ్వరస్వామివారి ఫోటోలు కూడా దేవసంగీతం తొలగించారు.
టీటీడీ (Tirumala Tirupati devasthanam TTD) గ్రాండ్స్ తో నడిచే శ్రీ పద్మావతి యూనివర్సిటీ (Shri Padmavati University) కి వీణ నోబుల్ దాస్ అనే క్రైస్తవ మహిళను కూడా వైఎస్. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వీసీ (VC) గా నియమించారు. వీణ నోబుల్ దాస్ కూడా విశ్వవిద్యాలయంలో వెంకటేశ్వరస్వామి ఫోటోలు తీసి జీసస్ ఫోటోలు పెట్టారు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వైఎస్ కుటుంబీకులు హిందుత్వం పై దాడి చేసిన విధానాన్ని ఆవిష్కరించారు. అని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
తాను ఎప్పుడూ వెంకటేశ్వర స్వామిని మా ఇంటి దైవంగా చూస్తాను. ఏ కష్టం, బాధ వచ్చిన ఆయనను తలచుకుని ముందుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అదే నా శక్తి. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న సరే నేను క్యూ లోనే వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటాను. ఆయన సేవలో ఉంటే రాష్ట్రానికి మనకు మంచి జరుగుతుందని తిరుమల శ్రీవారి పై ఉన్న భక్తిని గౌరవాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాటుకునే ప్రయత్నం చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు చైర్మన్ పాలకమండలి సభ్యులు టిడిపి కూటమిపై విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మండిపడ్డారు. కల్తీ నెయ్యి వాడి, దొరికిపోయిన వారందరికీ వైసిపి నేత జగన్ (YS jagan) అండగా నిలవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
కల్తీ నెయ్యి పై ఎదురుగా ప్రారంభించిన వైసీపీ నేతలు మా కుటుంబీకులు నిర్వహించే హెరిటేజ్ (heritage milk diary) పై విష ప్రచారం చేయడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. చీజ్ "(Cheese ) పాకెట్లు పట్టుకొని నెయ్యి అనే వైసిపి నేతలు మాట్లాడడం వారి దిగజారుతునానికి నిదర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు. హెరిటేజ్ డైరీ ఎక్కడ కూడా నెయ్యి టెండర్లలో పాల్గొనలేదు అని ఆయన స్పష్టం చేశారు.
తిరుమల నెయ్యి కొనుగోలు తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిబిఐ రిపోర్టు ఇచ్చింది. అందులో పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో లోతుగా అధ్యయనం చేయడానికి ఏకసభ్య విచారణ కమిటీ వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు.
తప్పు చేశారు..
లడ్డు వ్యవహారంలో అనేక తప్పులు జరిగాయి 2019 14 మధ్య 59.71 లీటర్ల కల్తీ నెయ్యి వాడారు. దీనికోసం 231.51 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను నీరు కార్చారు. ఒక పద్ధతి ప్రకారం లాలూచీపడిన లూటీ అని విషయం స్పష్టంగా తేలింది. వైసిపి ప్రభుత్వం లోనే కల్తీ నెయ్యి అనే నిర్ధారణ అయిన రిపోర్టును తొక్కి పెట్టారు. లడ్డూలో జంతువు కలిసిందని నేను సొంతంగా ఏమీ చెప్పలేదు. ఎన్డిడిబి ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ప్రకటించాను అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తిరుమలలో నెయ్యి కొనుగోలుకు సంబంధించిన నిబంధనలను గారికి వదిలేశారని టిడిపి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆరోపించారు.
"టిటిడి బోర్డులో సభ్యుడిగానే కాకుండా ఇప్పుడు నేను పర్చేసింగ్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నాను. అందువల్లే చాలా విషయాలు స్పష్టంగా తెలిశాయి. ఆరోపణలకు వివాదాలకు ఆస్కారం లేని విధంగా మా పాలకమండలి నిర్ణయాలు తీసుకుంటుంది" అని జ్యోతుల నెహ్రూ చెప్పారు.
టిటిడి పర్చేసింగ్ కమిటీలో బోర్డులోని ముగ్గురు సభ్యులు ఉంటారు. వారికి అదనంగా వైసిపి ప్రభుత్వం లో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్న ప్రభాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్ణయాలు చేసి బోర్డుకు సమర్పించారు. దీనిని ఆనాటి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సారథ్యంలోని బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. కల్తీ నెయ్యి కొనుగోలులో వీరందరికీ సమిష్టి భాగస్వామ్యం బాధ్యత ఉంది అని జ్యోతులను తేల్చారు.
2014 నుంచి టీటీడీలో కొనుగోళ్లకు సంబంధించి పటిష్ట విధానాలు ఫ్రేమ్ చేశారని జ్యోతుల నెహ్రూ గుర్తు చేశారు. 2020 ఫిబ్రవరి 19 పాలకమండలిలో కల్తీ నెయ్యి వ్యవహారానికి తెర తీశారు అని ఆయన ఆరోపించారు. నిబంధనలను సడలించడమే దీనికి పునాది పడిందని జ్యోతుల నెహ్రూ చెప్పారు.
"తిరుమలకు సప్లై చేసింది నెయ్యి కాదు. నెయ్యిలో కల్తీ జరగలేదు. రసాయనలతో నెయ్యిని మరిపించారు. నెయ్యిలో కల్తీ తిరగడం వేరు. కల్తీ నెయ్యి వాడడం వేరు. డైరీలో పాలు లేవు. వెన్న తయారు కాలేదు. నెయ్యి ఎలా వచ్చింది" అని జ్యోతుల నెహ్రూ వైసిపి ప్రభుత్వం లో ఘోరమైన తప్పిదాలకు పాల్పడ్డారు అని ఆరోపించారు
స్వామీ మీకు భక్తి ఉందా..?
బిజెపిపై సెటైర్లు..
తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి అసెంబ్లీలో మంగళవారం జరిగిన లఘు చర్చలో మాట్లాడిన టిటిడి బోర్డు మెంబరు, టిడిపి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బిజెపి పై అనేక విసుర్లు విసిరారు.
"బిజెపి నేతగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి కి దేవుని పైన విశ్వాసం, నమ్మకం ఉందా? ఉంటే అపచారానికి పాల్పడిన వైసిపి నేతలకు అండగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారా?" అని జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. సీబీఐ సారధ్యంలోని సిట్ (special investigation team) చేసిన దర్యాప్తులో పరిపాలన నిబంధనలను పరిశీలించకపోవడం, అసలైన నిందితులు తెరపైకి రాకపోవడం వల్ల, వాస్తవాలను వెలుగులోకి తీసుకొని రావడానికి ఏకసభ్య విచారణ కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
"బిజెపి నేత సుబ్రమణ్య స్వామికి వైసిపి చీఫ్ వైఎస్ జగన్ కు అత్యంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అవి ఎలాంటి సంబంధాలు, పరిచయాలు అనేది మనకు అందరికీ తెలిసిందే. మనమందరం అక్కడ నుంచి వచ్చామంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, దేవాదాయ శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి ని చూస్తూ, సరదాగా వ్యాఖ్యానించారు" వారి నుంచి కూడా అదే తరహా స్పందన లభించడం కాసేపు హాస్యం పండించింది.
అంతకుముందు లఘు చర్చలో సమాధానం చెప్పిన దేవాదాయ శాఖ మంత్రి అనేక విషయాలను ప్రస్తావించారు. అందులో..
" 2014 నుంచి టీటీడీ టెండర్ విధానం పటిష్టంగా ఉంది. నెయ్యి కొనుగోలు చేయాలి అంటే పాల సేకరణ, వెన్న ఉత్పత్తి, వ్యాపార లావాదేవీలు, డైరీ నిర్వహణలో అనుభవాలను ప్రామాణికంగా తీసుకుంటారు. వై వి సుబ్బారెడ్డి సారధ్యంలోని టీటీడీ పాలక మండలి తరలించడం వల్ల తప్పిదం జరిగింది". అని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సిబిఐ నివేదికలోని అంశాలను మంత్రి ఆనం సభలో వివరించారు.
టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నెయ్యిలో కల్తీ జరిగిందని cftri ఇచ్చిన రిపోర్టును జగన్ ప్రభుత్వంలో బయటపడకుండా తొక్కి పెట్టారని సీనియర్ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రశ్నించారు.
"ఆ రిపోర్టును ఎందుకు దాచి పెట్టారు ఎందుకు చర్యలు తీసుకోలేదు కావాలనే కల్తీ నెయ్యిని ఎందుకు ఉపయోగించారు. కల్తీ నెయ్యి విషయంలో అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు హెరిటేజ్ పై విష ప్రచారం చేయడం ద్వారా సమస్యను పక్కదారి పట్టించడమే" అని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 2011, 2016, 2018 లో కూడా సహకార రంగంలోని ప్రైవేటు పాల పరిశ్రమలు టెండర్లలో పాల్గొనవచ్చని జీవోలను 2022 లో మార్చడం వెనక ఆంతర్యం ఏమిటి అని ధూళిపాళ్ల నిలదీశారు. టీటీడీకి నై సరఫరా చేయడానికి ఇంద్రాపూర్ తో పాటు సంఘం డైరీ కూడా టెండర్ దాఖలు చేసిందని ఆయన గుర్తు చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించడంలో ప్రతిష్ట ఉందని ఆయన గుర్తు చేశారు.
అసత్య ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్
రాష్ట్రంలో వైసిపి ఏర్పడిన తర్వాత అసత్య ప్రచారం అబూత కల్పనలు చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ గా మారారని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
"2018లో తిరుమలలో పింక్ డైమండ్ పేరుతో అసత్య ప్రచారం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ డైమండ్ గల్లంతయిన విషయంలో కోర్టులో కేసు కూడా దాఖలు చేసి రెండు కోట్లు ఫీజు చెల్లించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత yv సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పింక్ డైమండ్ కేసు విత్ డ్రా చేసుకున్నారు" అని కూన రవికుమార్ గుర్తు చేశారు.
తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఏమాత్రం తీసుకొని రీతిలో వైయస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు తిరుమల పై దాడి చేసిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని కోన రవికుమార్ వ్యాఖ్యానించారు.
"ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఏడుకొండలు కాదు రెండు కొండలు అంటూ జీవో నెంబర్ 338 జారీ చేశారు. ఆనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు, హిందూ సంఘాల పోరాటాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో సీఎం గా ఉన్న రాజశేఖర్ రెడ్డి తక్కువ అయిందని గుర్తించి ఆర్జీవో వెనక్కి తీసుకున్నారు. చివరికి రెండు కొండల కాదు ఏడుకొండలు అంటూ మళ్ళీ జీవో జారీ చేశారు. ఆ పోరాటం ఫలించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నారా చంద్రబాబు కాలినడకన తిరుమలకు వెళ్లి మొక్కు చెల్లించారు" అని కూన రవికుమార్ వివరించారు.
Next Story

