టీటీడీ చైర్మన్ నాయుడుతో ఉన్న ఈ మహిళ ఎవరంటే..?
x

టీటీడీ చైర్మన్ నాయుడుతో ఉన్న ఈ మహిళ ఎవరంటే..?

సీఎం, డిప్యూటీ సీఎంకు తన వేదన వివరిస్తూ రాసిన లేఖ వైసీపీకి ఎలా అందింది?


టీటీడీ ( Tirumala Tirupati Devasthanams TTD), TV 5 చైర్మన్ బి. రాజగోపాల నాయుడు (బీఆర్. నాయుడు) వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న మహిళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తన బాధ వివరిస్తూ 2019లో ఓ లేఖ రాసింది. ఆ లేఖ రాసిన ఆ మహిళకు ప్రభుత్వ పెద్దలకు మాత్రమే తెలుసు. టీవీ 5 చైర్మన్ బీఆర్. నాయుడుతో రిలేషన్ షిప్ లో ఉండడం వల్ల పడుతున్న బాధలు వివరిస్తూ, ఆయనకు రాజ్యాంగబద్ధ పదవులు ఇస్తే టీడీపీ పరువు పోతోందని హెచ్చరించారు.


Also Read:మా కుటుంబాలకు లేని ఇబ్బంది మీకేమిటో..


టీడీపీ కార్యాలయం నుంచి లీక్ అయిందా? లేక ఆ మహిళ ద్వారానే వైసీపీ నేతలు సంపాదించారో తెలియలేదు. కానీ, ఆ లేఖ వైసీపీ నేతల చేతికి చిక్కింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన కల్తీ నెయ్యి వ్యవహారం టీడీపీ కూటమి వైసీపీని టార్గెట్ చేసింది. ఈ అంశంపై రగులుతున్న వివాదం మలుపులు తిరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు కల్తీ నెయ్యి వ్యవహారంపై వైసీపీ నేతలపై ఒంటికాలితో లేస్తున్నారు. ఈ సమయంలో నాయుడుకు చెక్ పెట్టడానికి తిరుపతిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుకు
వైసీపీ
అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి, ఢిఫెన్స్ లో పడేశారు. ఇది టీడీపీ కూడా మింగుడు పడని విధంగా మారింది.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైదిక బ్రాహ్మణ కుటుంబం అని చెబుతూ 2019 ఎన్నికలకు ముందు రాసిన లేఖలో ఏ విషయాలు ప్రస్తావించారంటే..

సబ్జెక్ట్: రిలేషన్ షిప్ విత్ హానరరీ చైర్మన్ బీఆర్. నాయుడు టీవీ5.

గౌరవనీయ మాజీ, కాబోయే ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి నమస్కరించి రాయునది.
నా పేరు తాడేపల్లి... లేఖ (48) డాటర్ ఆప్ లేట్ తాడేపల్లి సత్యనారాయణ మూర్తి. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం. మా నాన్న తెనాలి. హెడ్ కరణంగా పనిచేశారు. తదనంతర పరిణామాలతో 36 ఏళ్ల కిందట వ్యాపారం నిమిత్తం హైదరాబాదులోని మణికొండ ప్రాంతంలో స్థిరపడ్డాం. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకుని రావాలనుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏమిటనగా..
బీఆర్. నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయం. ఆ పరిచయం. కొన్పేళ్ల తరువాత రిలేషన్ షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడుగారి వల్ల సుఖం, సంతోషం లేకపోగా అనేక అవమానాలు, ఇబ్బందులు పడ్డాను.ఇంకా పడుతూనే ఉన్నాను.
నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూసుకున్న దాఖలాలు లేవు. నేను అరగంట కోసమే అనే విషయం అర్థం అయ్యేసరికి నాకు ఏళ్లు పట్టింది. నాయుడు గారు నన్ను ప్రేమగా చూసుకుంటాను. నువ్వంటేనే ప్రేమ అని నన్ను వదిలేయవద్దు అని కళ్లనీళ్లు పెట్టకుంటే, రిలేషన్ షిప్ స్టార్ట్ చేశాను.
నాటే ఒకే కూతురు. ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE (Systemic Lupus Erythematosis) అనే జబ్బుతో పోరాడుతూనే ఉంది. ఇమ్యూన్ డిసీజ్ తో ప్రతిక్షణం జీవితంతో పోరాడుతునే ఉంది. నాయుడుతో రిలేషన్ షిప్ స్టార్ట్ చేశాక.. మా అమ్మాయికి ఎస్ఎల్ఈ జబ్జు వచ్చింది.
నేను మందులకై, ఖర్చులకి కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. నేను ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు అనేది అనుమానం ఆయనకు. ఆయన చూడాలి అంటే అళి కట్టూ, బాకీ ఉన్నానా, లం.. అనే మాటలతో కుక్క కన్న హీనంగా చూశాడు నన్ను. అన్ని అవమానాలు, బాధలు భరిస్తూ కూడా ఎవ్వరికీ ఏమి చెప్పు కోకుండా, రోడ్డున పడకుండా గడుపుతూ వస్తున్నాను.
నా గురించి తెలిసి, వైఎస్ఆర్ సీపీ వాళ్లు అప్రోచ్ అయ్యారు నాయుడును ఎక్స్ పోజ్ చేయమని అడిగారు. కారు, పది కోట్లు ఇస్తామని, నామినేటెడ్ పోస్టు ఇస్తామని అన్నారు. నామీద చాలా operation కూడా చేశారు. బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి TDP 6భిమానిని కావడంతో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఇలాంటి పనులు చెయ్యకూడదు, మరియు, మనస్ఫూర్తిగా నమ్మి, ప్రేమించిన నాయుడిని రోడ్డున పడేవేయడం ఇష్టం లేక, నేను వైసీపీ వాళ్లు చెప్పిన పని చేయలేదు. దేవుడే వాడ్ని శిక్షిస్తాడు అనుకొని అన్నింటికి సర్దుకుని పోయాను.
నామీద 2016 నుంచి ఎవరో నిఘా పెట్టి, నన్ను వెంబడిస్తూనే ఉన్నారు. ఒక వ్యక్తి పేరు వేరు వేరువేరు ప్లేసుల్లో కనిపిస్తూ ఉంటాడు. నన్ను హైదరాబాద్ విడిచి వెళ్ళమని, లోకుంటే చంపివేస్తామని చెదిరించారు. ఇందులో కూడా నాయుడు నాకు ఎలాంటి Help చెయ్యలేదు. బైటకి వెళ్లొద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పడం తప్ప ఇప్పటికీ ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాను
బీఆర్ నాయుడు భయంకరమైన ఉమెనైజర్ (Womanizer ), "వావి వరసలు" లేని వ్యక్తి. అతనితో పని ఉంది అంటే.. పడుకోకుండా చెయ్యను దీని మొహం మీదే చెప్తాడు. TDP అధికారంలోకి వచ్చాక తాను టీటీడీ చైర్మన్, ఎంపీ రాజ్యసభలో సభ్యుడిని అవుతాననే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్ధంగ. ఏ'పని చెయ్యడు. ఇలాంటి వ్యక్తికి మీరు అత్యున్నత పదవి ఇస్తే, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. అది పార్టీకి కూడా చెడ్డవీరు తెస్తుంది. ఈ ఉత్తరం లో వ్రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉన్నాను.
పెద్దలు, గౌరనినీయులైన మీరు నా ఆవేదన అర్ధం. చేసుకోగలరని భావిస్తున్నాను .
by to: Show: Nara Lokesh garu.
Shri: Konidela pawankalyan గారు
అని లేఖ ముగించారు.
Read More
Next Story