ఏం పనయ్యా.. ఇది.  రాసలీల వివాదంలో టిటిడి చైర్మన్..
x
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు (ఫైల్)

ఏం పనయ్యా.. ఇది. రాసలీల వివాదంలో టిటిడి చైర్మన్..

ఆ వీడియో ఎలా వచ్చింది. పదవి నుంచి తొలగించాలన్న వైసిపి.


టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు రాసలీలల వివాదంలో చిక్కుకున్నారు. మహిళలతో నాయుడు సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది కాస్తా వైసిపికి మరో అస్త్రంగా మారింది. ఈ పరిణామాలు టీడీపీ కూటమికి తలనొప్పిగా మారింది. టీటీడీలో ప్రస్తుతం బిఆర్ నాయుడు మహిళతో సన్నితంగా ఉన్న వీడియోల వ్యవహారం పైనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

కడప జిల్లా (తిరుపతి జిల్లా) రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళ చేసిన ఆరోపణల నేపథ్యంలో జనసేన చిక్కుల్లో పడింది. తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వ్యవహారం తెరపైకి వచ్చింది. అసలు ఈ వీడియోలు ఎలా బయటికి వచ్చాయనేది హాట్ టాపిక్ గా మారింది.
టీటీడీ చైర్మన్ ఓ విమానాశ్రయం వెలుపల మహిళతో ఉన్న వీడియోలు, వారిద్దరూ హైదరాబాద్ లోని ఓ విలాసవంతమైన భవనంలో సఖ్యతగా ఉన్న వీడియోలు బయటికి వచ్చాయి. బీఆర్. నాయుడు ఓ మహిళ కలిసి సోఫాలో ఎదురెదురుగా కూర్చుని కాఫీ తాగుతున్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ఈ అంశాలన్నీ పరిశీలిస్తే, కొన్నాళ్లుగా బీఆర్. నాయుడుపై దృష్టి సారించి, ఇవన్నీ చిత్రీకరించారా? లేక మహిళే వాటిని బయటపెట్టిందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం మొత్తం హైదరాబాద్ లో జరిగిందనే మాటలు వినిపిస్తున్నాయి.
తిరుపతిలో ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో టీడీపీ తో వైసీపి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ అంశాల్లో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు కూడా ఘాటుగా స్పందించి, హెచ్చరికలు కూడా చేశారు.
"తిరమల శ్రీవారి లడ్డూకు వాడిన కల్తీ నెయ్యి కొనుగోళ్లలో నిందితులను వదిలేది లేదు" అని నాయుడు ఘాటు హెచ్చరికలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీఆర్. నాయుడుపై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలు బయటికి రావడం వెనుక ఏమి జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఓ మహిళతో నాయుడు సఖ్యతగా ఉన్న దృశ్యాల్లో ఎక్కడా అశ్లీలత లేకపోవడం గమనార్హం. ఇది ఉద్దేశపూర్వకంగా స్టింగ్ ఆపరేషన్ చేసి ఉండవచ్చని నాయుడు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
"అవన్నీ ఫేక్ వీడియోలు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను" అని బి.ఆర్ నాయుడు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ట్విట్టర్ వేదికగా కూడా ఆయన స్పందించారు.

వైసీపీ మాటల దాడి..

"టీటీడీ 94 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనివి అనైతిక చర్యలకు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు పాల్పడ్డారు. ఆయనను పదవి నుంచి తప్పించాలి" అని వైసిపి అధికార ప్రతినిధి, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఓ మహిళతో ఉన్న దృశ్యాలతో హిందువుల హృదయాలు మండిపోతున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన బి.ఆర్ నాయుడు కూడా మీడియాతో మాట్లాడారు. సాయంత్రం తర్వాత..
"టిటిడి చైర్మన్ బిఆర్. నాయుడు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి" దీనిని అస్త్రంగా చేసుకున్న వైసిపి టిడిపి తో పాటు టీటీడీ చైర్మన్ నాయుడు పై కూడా మాటలతో ఎదురుదాడి ప్రారంభించింది.
"వైసిపి అధికారంలో ఉండగా సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వెంటనే పదవి నుంచి తొలగించాం" అని వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి గుర్తు చేశారు. పవిత్రమైన తిరుమలలో స్వామివారి సేవ చేయాల్సిన ప్రదేశంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు వాత్సాయనుడికి వారసుడిగా మారారు అని కరుణాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అవి నకిలీ వీడియోలు..


తనపై జరుగుతున్న ప్రచారంపై టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

"నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దృశపార జారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, టీటీడీ ప్రతిష్టకు కుట్ర చేశారు" అని టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు రియాక్ట్ అయ్యారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికను వాడిన కొందరు నా రూపం అనికరించే విధంగా వీడియోలో తయారు చేసే ప్రచారం చేస్తున్నారని కూడా బిఆర్ నాయుడు వివరణ ఇచ్చారు.
"ఈ కంటెంట్ మొత్తం అసత్యం, వక్రీకరించినది. ఇది టీటీడీ ప్రతిష్టలు దెబ్బతీసేందుకు పరిణ పథకం" అని వి ఆర్ నాయుడు ఆక్షేపణ చెప్పారు.
తనపై జరుగుతున్న ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది దీనికి వైసీపీకి చెందిన కొందరు ఈ టప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తాను చట్ట ప్రకారం ముందుకు వెళ్తానని కూడా బిఆర్ నాయుడు స్పష్టం చేశారు.
"నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చండి" అని క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని కూడా ఆయన వెల్లడించారు. నా వ్యక్తిత్వాన్ని ఖననం చేస్తూ టిటిడి ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలిపెట్టే సమస్య లేదని కూడా బిఆర్ నాయుడు హెచ్చరించారు.

దేవుడు వేసిన శిక్ష అంటున వైసీపీ

మా నాయకుడు వైయస్ జగన్ పై బిఆర్. నాయుడు దారుణంగా మాట్లాడిన సంఘటన ప్రస్తావించిన టిటిడి మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి
"టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు దేవుడు శిక్ష వేశారు" అని వ్యాఖ్యానించారు. వీడియోలు ఫోటోలు బయటకు రావడం అనేది భగవంతుని వేసిన శిక్షగానే భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని బియ్యనాడు చొప్పున మాట అబద్ధం. నేను కొందరు ఏఐ నిపుణులతో మాట్లాడాను. బి ఆర్ నాయుడు సాగిస్తున్న రాసాలీల వీడియో కరెక్టే అని చెప్పారు. ఏమాత్రం నైతికత ఉన్న టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి " అని భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుకు సవాల్ విసిరారు. ఈ సంఘటనపై టీడీపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Read More
Next Story