TV5 నాయుడూ.. ఈ లేఖకు ఏమి బదులిస్తావ్...
x
తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషా యాదవ్ తో కలిసి మీడియాతో మాట్టాడుతున్న వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి

TV5 నాయుడూ.. ఈ లేఖకు ఏమి బదులిస్తావ్...

నాయుడు స్నేహితురాలు సీఎంకు ఫిర్యాదు చేసిన రహస్య లేఖ విడుదల చేసిన భూమన


ఇరకాటంలో పడిన టీటీడీ చైర్మన్

ఇంతకీ ఆ మహిళ ఏమని లేఖ రాశారు

ఇబ్బందుల్లో సీఎం, డిప్యూటీ సీఎం.

చైర్మన్ విషయంలో ఏమి చేస్తారో..?

వైసీపీ వ్యూహంలో చిక్కిన టీడీపీ కూటమి

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఈ ఎపిసోడ్ లో టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు, వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. పరస్పర ఆరోపణలతో తగ్గేదే లేదంటున్నారు.

Also Read:మా కుటుంబాలకు లేని ఇబ్బంది మీకేమిటో..


2019 ఎన్నికలకు ముందే బీఆర్. నాయుడుపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేస్తూ ఆ మహిళ రాసిన రహస్య లేఖను భూమన కరుణాకరరెడ్డి సోమవారం మీడియా సమావేశంలో విడుదల చేయడం ద్వారా టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడును చిక్కుల్లో పడేశారు. టీడీపీ కూటమిని, ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కూడా మింగుడు పడని పరిస్థితి కల్పించారు.
తిరుపతి నగరం పద్మావతి పురం లోని వైసీపీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీషా యాదవ్ తో కలిసి వైసిపి అధికార ప్రతినిధి, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆ సీక్రెట్ లేఖను విడుదల చేశారు.
"టీటీడీ చైర్మన్గా వీఆర్ నాయుడు అనైతిక, అప్రాచ్య వ్యవహారాలు సాగించారు. ఆయనను ఇంకా పదవిలో ఉంచడం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానపరచడమే" అని భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సూచించారు.

"టీటీడీ చైర్మన్ పదవికి తనకు తాను నాయుడు రాజీనామా చేస్తే కొద్దిగా అయినా పరువు దక్కుతుంది. లేదంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆ పని చేయాలి" అని భుమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
బీఆర్. నాయుడుతో సఖ్యతగా ఉన్న మహిళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఉద్దేశించి రాసిన లేఖకు టీడీపీ కార్యాలయం ఇచ్చిన రసీదు కూడా ఉంది. ఆ లేఖ వైసీపీ చేతికి ఎలా చిక్కిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం పక్కన ఉంచితే.. వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి వెల్లడించిన అంశాల ప్రకారం,
ఆ మహిళ లేఖలో ఇలా రాశారు...
"ఆ మహిళతో 30 ఏళ్లుగా ఆత్మీయ అనుబంధం ఉంది. మా ఇద్దరి కుటుంబాలకు లేని ఇబ్బంది మీకేమి వచ్చింది" అని టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు చెప్పడమే కాకుండా, వైసీపీ ప్రభుత్వంలో వై వి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అక్రమాలను బయటపెడతా. వదిలేది లేదు" అని ఆదివారం మీడియా సమావేశంలో బి. నాయుడు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వ్యాఖ్యలపై మీడియా సమావేశంలో వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి సంచలన లేఖ బహిర్గతం చేశారు.
"2019 ఎన్నికల సమయంలోనే బి.ఆర్ నాయుడు చేస్తున్న ఆకృత్యాలపై ఆ మహిళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ" భూమన మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖలో రాసిన అంశాలను కూలంకషంగా కరుణాకర్ రెడ్డి చదివి వినిపించారు.
"నా పేరు తాడేపల్లి (48)... మా తండ్రి తాడేపల్లి సత్యనారాయణ. మాది గుంటూరు జిల్లా తెనాలి. వైదిక బ్రాహ్మణ కులానికి చెందిన మహిళను. మా నాన్న తెనాలి హెడ్ కరణంగా పనిచేశారు. 36 ఏళ్ల కిందట వ్యాపారం నిమిత్తం హైదరాబాదులోని మణికొండ ప్రాంతంలో స్థిరపడ్డాం. 25 సంవత్సరాలుగా బి.ఆర్ నాయుడుతో నాకు ఉన్న పరిచయం కాస్త, రిలేషన్షిప్ గా మారింది. నాయుడు గారి వల్ల నాకు సుఖం సంతోషం లేకపోగా అనేక అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూసుకున్న దాఖలాలు లేవు" అని ఆ మహిళ సీఎం నారా చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు.
"అరగంట కోసం మాత్రమే నేను. అనే విషయం అర్థం అయ్యే నాటికి వీళ్ళ కాలం పట్టింది" అని ఆ మహిళ తన వెధను వ్యధ ఏకరువు పెట్టింది. బాధ్యతగా, ప్రేమగా చూసుకుంటాను అని నాయుడు కన్నీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్ స్టార్ట్ చేశాను. నాకు ఒకే కూతురు. 16 ఏళ్లుగా నిమ్యున్ డిసీజ్ to పోరాడుతోంది. మా కూతురు మందులు వైద్యం కోసం చాలా ఇబ్బంది పడ్డాను. నన్ను ఎవరితో నాయుడు మాట్లాడించేవాడు కాదు. ఆంక్షలు విధించారు" అని ఆ లేఖలో పేర్కొన్న అంశాలను భూమున వెల్లడించారు.
"వైసిపి వాళ్లు నాకు డబ్బు, కారు ఇస్తానని ఆశపెట్టారు. బేసికల్గా నేను చిన్నప్పటి నుంచి టిడిపి అభిమానిని. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నా వల్ల ఇబ్బంది జరగకూడదని నేను వైసీపీ ఇచ్చిన ఆఫర్లు తిరస్కరించాను. మనస్ఫూర్తిగా ప్రేమించిన నాయుడును రోడ్డుపై పడవేయకూడదని, టిడిపికి నష్టం కలిగించకూడదు అని నిబద్ధతగా ఉన్నాను. 2016 నుంచి నాపై నిఘా పెట్టారు. వెంబడిస్తూనే ఉన్నారు. హైదరాబాదు విడిచి వెళ్లకుంటే చంపే వేస్తామని కూడా బెదిరించారు. అప్పుడు కూడా నాయుడు ఇలాంటి సహాయం చేయలేదు" అని కూడా ఆరోపించారు.
"బిఆర్. నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, అతనికి వావి వరసలు ఉండవు. అతని వద్దకు పనుల కోసం వెళితే మహిళలకు లైంగిక వేధింపులు తప్పవు" ఆ మహిళ తన లేఖలో తీవ్ర పదజాలంతో రాసిన లేఖలో ఉన్న వివరాలను భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు.

ఆమె ఏమీ ఆరోపించారంటే..

"టిడిపి అధికారంలోకి వచ్చాక నేను టీటీడీ చైర్మన్ అవుతా, లేదంటే రాసభ సభ్యుడిని అవుతా అనే పగాడమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్ధంగా ఏ పని చేయడు. ఇలాంటి వ్యక్తికి అత్యున్నమైన పదవి ఇస్తే, ఏదైనా పనిపై ఆడవాళ్లు ఆయన వద్దకు వెళితే నాయుడు కోరికలు తీర్చమని ఇబ్బంది పెడతాడు. ఇది పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తుంది. ఇందులో రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉంటాను" అని ఆ మహిళ రాసిన లేఖలోని సారాంశాన్ని అక్షరం అక్షరం భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందు ఆవిష్కరించారు.

ఇప్పుడు చెప్పు నాయుడు..


టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడుకు నా గురించి, మా అధినాయకుడు వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదు అని భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు.

"నాకు సంస్కారం ఉంది. ఎప్పుడూ ఎవరిని నేను బూతులు మాట్లాడలేదు. నా కాలిగోటికి కూడా సరిపోని నువ్వు నా గురించి మాట్లాడతావా? అని కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
"నేను కూడా రెండు సార్లు టిటిడి చైర్మన్ గా పని చేశాను. నా దగ్గరికి ఎలాంటి ఫైల్స్ రాలేదు. అయినా నాకు తెలియక అడుగుతా చైర్మన్ దగ్గర ఫైల్స్ ఎందుకు వస్తాయి. నీ దగ్గర ఉన్న ఆధారాలు బయటపెట్టు. నీ చేతనైంది చేసుకో. నేను కూడా తగ్గేది లేదు" అని భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుకు ప్రతి సవాల్ విసిరారు.

ఆ ఉత్తర్వు అమలు చేయండి..

టిటిడిలో ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు నిబద్ధతతో పనిచేయాలి. రాసలీల వ్యవహారం ఇతర కార్యకలాపాలు పాల్పడితే దండన ఉంటుందననే విషయాన్ని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెరపైకి తీసుకొని వచ్చారు.
ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నదని కారణంతో లక్ష్మయ్య అనే ఉద్యోగిని టీటీడీ నుంచి తొలగించిన విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి తెరపైకి తెచ్చారు. ఆ ఉద్యోగిపై ఆరోపణల తర్వాత 2002 లో అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వకాలంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆ ఉద్యోగిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని భూమన ప్రస్తావించారు.
అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడును ఆ పదవి నుంచి తప్పించాలి" అని నేను మొదటిసారి డిమాండ్ చేస్తున్నాన అని భూమన చెప్పారు. రాసలీలలతో ఓ మహిళ జీవితంతో ఆడుకుంటూ, శ్రీవారి సేవ సే హక్కు బి.ఆర్ నాయుడు కోల్పోయాడని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 2002 లో ఆనాటి టిడిపి ప్రభుత్వంలో టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయం ప్రస్తుత టిటిడి చైర్మన్ పై ప్రయోగించాలని కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
"తన వీడియోలు ఫోటోలు మార్ఫింగ్ చేసి తనను అభాసపాలు చేసే ప్రయత్నం చేశారని వైసీపీపై టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే"
"సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఏఐ (artificial intelligence) స్కానింగ్ చేయడంలో పేరు ఎన్నికల ఏజెన్సీకి వీడియో పంపించామని. బి ఆర్ నాయుడు సరసాలు సాగిస్తున్న వీడియో, ఫోటో కూడా ఒరిజినల్" అని ఏఐ సంస్థ జారీచేసిన సర్టిఫికెట్ కూడా కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో విడుదల చేశారు.


Read More
Next Story