
చంద్రప్రభ వాహనంలో ఘటాటోపం కింద ఉన్న శ్రీమలయప్పస్వామి వారిని స్పర్శిస్తున్న వాన చినుకులు
తిరుమల: వర్షంలోనూ ప్రసరించిన చంద్రకాంతులు..
శ్రీవారి క్షేత్రంలో రథ'సప్త'మి 'వాహనసేవ'లు ఇలా సాగాయి..
తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆదివారం రాత్రి వర్షం కురుస్తోంది. అయినా చంద్రోదయం ప్రభవించింది. రథసప్తమిలో ఉదయం నుంచి యాత్రికులకు దర్శనం ఇచ్చిన శ్రీమలయప్పస్వామివారు చంద్రోదయాన సేదదీరాలి. అనూహ్యంగా వర్షం కురుస్తున్నప్పటికీ ఘాటాటోపం (గొడుగు) నీడన చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి వారు తిరుమల వీధుల్లో విహరించారు. ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీల నుంచి యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమలలో రథసప్తమి (సూర్య జయంతి) సందర్భంగా మినీ బ్రహ్మోత్సవం ఆదివారం ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైంది. సాలకట్ల బ్రహ్మోత్సవాలను తలపించే రీతిలో సప్త వాహనాలపై శ్రీమలయప్ప స్వామి వారు మొదట సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో విహరిస్తూ యాత్రికులకు దర్శనమిచ్చారు.
తిరుమలలో ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణం కనిపించింది. శీతాకాలంలో సాధారణంగా మంచు కురుస్తుంది. చలిగాలులు గిలిగింతలు పెడతాయి. అనూహ్యంగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల తేరికపాటి జల్లులు కురుస్తూ విభిన్న వాతావరణం ఏర్పడింది. చలిలో వణుకుతూనే గ్యాలరీల్లోని షెడ్ల కింద నిరీక్షిస్తున్న యాత్రికులు వాహనసేవలను దర్శించుకున్నారు.
యథాతధంగా వాహన సేవలు
తిరుమలలో ఇలాంటి వాతావరణం ఉన్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహించడానికి టిటిడి ఏర్పాట్లు చేస్తుంది. ఆ కోవలోనే రథసప్తమి సందర్భంగా ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగిశాయి.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఉత్సవాలు నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాటు చేస్తారు. మంగళవారం రాత్రి నుంచి తిరుపతి తోపాటు తిరుమలలో కూడా జల్లులు కురుస్తున్నాయి. ఈ వాతావరణంలోనే శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వాహన మండపం నుంచి సర్వాలంకార భూషితుడైన శ్రీమల్లప్ప స్వామి వారిని చంద్ర వాహనంపై అర్చకులు ఆసీనులు చేశారు. తిరు మాడవీధుల్లో విహారానికి బయలుదేరిన సమయంలోనే వర్షం ప్రారంభమైంది. ఘటాటూటోపం (గొడుగు) నీడ కింద స్వామివారిని ఊరేగించారు.
దర్శనం కోసం..
తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలో యాత్రికులు భారీగానే చేరారు. వర్షంలో కూడా చంద్రప్రభ వాహనాన్ని దర్శించుకోవడానికి వాతావరణాన్ని కూడా లెక్క చేయని పరిస్థితి తిరుమలలో కనిపించింది. వాహన సేవలో నిర్వహణలో టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలికాలం కావడం వల్ల యాత్రికులకు ఇబ్బంది లేకుండా మాడవీధుల్లోని గ్యాలరీలపై జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. చలికి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.
యాత్రికులతో మమేకం.
తిరుమలలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రీ మల్లప్ప స్వామి వారి వాహన సేవలు నిరాటంకంగా సాగాయి. ఈ సందర్భాల్లో టిటిడి చైర్మన్ డి.ఆర్ నాయుడు తోపాటు టిటిడి అధికారులు గ్యాలరీలో ఉన్న యాత్రికులతో మాటలు కలిపారు.
ఆ దృశ్యాలను చెప్పే చిత్రాలు..
వాహనసేవ ముందు టీటీడీ అధికారులు ఇలా కనిపించారు..
గ్యాలరీల్లోని యాత్రికులతో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాటామంతీ..
శ్రీవారి సేవకుల స్వచ్ఛంద సేవలు...
అభిప్రాయసేకరణ: తిరుమలలో ఏర్పాట్లపై యాత్రికుల నుంచి శ్రీవారి సేవకులు ప్రత్యేకంగా అభిప్రాయ సేకరణ చేశారు. టీటీడీ అధికారులు దీనికోసం శ్రీవారి సేవకులను ప్రత్యేకంగా రంగంలోకి దించారు.
Next Story

