
తిరుమల:'స్వర్ణ దేవాలయం' తరహా సామాజిక శిక్ష?
టీటీడీలో బలమైన వ్యవస్థే ఉంది కదా..? గురుద్వార చట్టాల అధ్యయనానికి సీఎం ఆదేశం వెనుక ఆంతర్యం ఏమిటి?
తిరుమల లడ్డు లో కల్తీ నెయ్యి (Adulterated ghee ) వాడిన వ్యవహారం పై రాజకీయ ప్రకంపనాలు ఆగడం లేదు. అన్య మతస్తులను కట్టడి చేయడానికి టిడిపి కూటమి ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ స్వర్ణదేవాలయం ( Amritsar Golden Temple ) నమూనా చట్టాలను అమలు చేయడానికి పరిశీలించాలని నిర్ణయించింది. వైసీపీని ( YCP) టార్గెట్ చేసిన టిడిపి కూటమి ప్రభుత్వం ఆ పార్టీ నాయకులపై ఫోకస్ పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో కూడా తిరుమల శ్రీవారి ఆలయం లేదా వ్యవహారాలకు అపచారం కలిగించిన, అవినీతికి పాల్పడిన కఠినా కఠిన నిబంధనలు అమలు చేయాలని టిడిపి వ్యూహంగా కనిపిస్తోంది.
"చట్టాలు మనం చేసుకున్నవే. సాధ్యమైన చట్టం అవసరం. స్వర్ణదేవాలయం తరహా చట్టం అమలు చేయడం అనేది సాహసమే" అని తిరుపతికి చెందిన సీనియర్ న్యాయవాది విజయకుమార్ వ్యాఖ్యానించారు. ఆలయాల వద్ద ఉన్న నిబంధనలు యాత్రికులు, ప్రముఖులు చక్కగా ఆచరించడం వల్ల సమస్యలు ఉండవు అని ఆయన అన్నారు.
సీబీఐ దర్యాప్తు తరువాత..
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు పూర్తి చేసింది. ఈ నివేదికలోని అంశాలు టిడిపి ప్రభుత్వానికే కాకుండా, ఆ ప్రభుత్వం సారధ్యంలో నియమితులైన టీటీడీ (Tirumala Tirupati Devasthanams TTD) చైర్మన్ బి.ఆర్ . నాయుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
2019 నుంచి 25 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ వ్యవహారం రాజకీయ వివాదానికి కారణమైంది. తిరుమల లడ్డు, ఈ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి కొనుగోలు వ్యవహారం లో చోటు చేసుకున్న లావాదేవీలను వైసీపీ రోజుకో అస్త్రం ప్రయోగించడం టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది.
ఏపీ శాసనసభకు వైసిపి చీఫ్, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్. జగన్ సహా 11 మంది హాజరు కావడం లేదు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల బలం అధికంగా ఉండడంతో నెయ్యి వ్యవహారంపై రగడ ఆగడం లేదు. ఈ పరిస్థితుల్లో.. తిరుమల కేంద్రంగా ప్రారంభమైన వివాదానికి కఠిన చట్టాలతో చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భావిస్తున్నారు.
"పంజాబ్ లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయం నిర్వహణలో శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ ( Shiromani Gurdwara Prabandham Committee SGPC ) తరహా చట్టాన్ని పరిశీలించండి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు సూచనలు చేశారు. స్వర్ణ దేవాలయం చట్టాన్ని అధ్యయనం చేయాలని టిటిడి అధికారులు కూడా ఆయన ఆదేశించారు.
"తిరుమల ( Tirumala ) లో కూడా స్వర్ణ దేవాలయం తరహా చట్టం అమలు చేస్తే తప్పు చేసిన వారిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది" అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభిప్రాయంగా కనిపిస్తోంది.
"గురుద్వారా తరహా చట్టం ఏ మేరకు అమలు సాధ్యం అనేది పాలకులే ఆలోచన చేయాలి" అని న్యాయవాది విజయకుమార్ అభిప్రాయపడ్డారు.
ఉదాహరణకు: కల్తీ నెయ్యి కేసులో నిందితులకు శిక్ష విధిస్తే, వారితో గురుద్వారా తరహాలో ఆలయం వెలుపల చెప్పులు శుభ్రం చేయించడం అనేది అమలు చేయగలరా? అని కూడా విజయకుమార్ ధర్మసందేహం వ్యక్తం చేశారు.
బలమైన వ్యవస్థ
"శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ( Declaration ) ఇవ్వాలని నిబంధన కూడా తప్పనిసరిగా అమలు చేయాలి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులను ఆదేశించడం వెనక కూడా పరోక్షంగా మాజీ సీఎం, వైసిపి చీఫ్ వైఎస్. జగన్ తో పాటు ఆ పార్టీలోని క్రిస్టియన్ మతం ఆచరించే నేతలను టార్గెట్ చేసినట్లు అభిప్రాయపడుతున్నారు.
తిరుమలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం అమలవుతుంది. ప్రపంచంలోనే ధనిక ఆధ్యాత్మిక క్షేత్రం గా ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని టీటీడీ పాలకమండలి (TTD Governing Council ) కి కూడా విశేష అధికారాలు ఉన్నాయి. స్వామి వారి కంకర్యాల నిర్వహణకు ఆగమ శాస్త్రం ప్రకారం అనుసరించే అర్చక వ్యవస్థ ఉంది. దీనికి రామానుజాచార్యుల పరంపరలో పెద్ద జీయర్, చిన జీయర్ స్వాముల పర్యవేక్షణ ఉంది. టీటీడీకి గుండెకాయ లాంటి శ్రీవారు కొలువైన తిరుమల క్షేత్రం తో పాటు అనుబంధ ఆలయాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ (TTD vigilance and security wing) బలంగా ఉంది. ఈ విభాగం అధికారులు నిఘా ఉంచుతారు. భద్రత కల్పిస్తారు. నేరాలకు పాల్పడిన వారిని పోలీసులకు అప్పగించడం, కేసులు నమోదు చేయించడానికి మాత్రమే వీరికి అధికారం ఉంది. ఈ విభాగానికి ఐపీఎస్ స్థాయి అధికారి (chief vigilance and security officer Cv and so) పర్యవేక్షణలో 1500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. తిరుమలకు, ఇంత పటిష్టమైన వ్యవస్థ అందుబాటులో ఉంటే,
తిరుమలలో సిక్కుల చట్టం సాధ్యమా..?
"1925 సిక్కు గురుద్వారాల చట్టం ( Gurudwara Actఅమలు చేయడానికి పరిశీలించండి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇది ఎంత మేరకు సాధ్యమవుతుందనే విషయాన్ని పక్కన ఉంచితే, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) చట్టం అమలు చేయడం ఎంత మేరకు సాధ్యమవుతుందనే విషయం లోతుల్లోకి వెళ్లే ముందు ఆ చట్టాలు ఒకసారి పరిశీలిద్దాం.
పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం (హర్మేందర్ సాహెబ్) ఇతర చారిత్రక గురుద్వారా నిర్వహణ శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుంది.
గురుద్వార ప్రబంధ కమిటీకి ప్రత్యేకమైన చట్టాలతో పాటు సంప్రదాయాలు, శిక్షాస్మృతి (code of conduct) ఉన్నాయి. అందులో ప్రధానంగా 1925 సిక్కు గురుద్వారాల చట్టం ప్రకారం ఎస్ జి పి సి అనేది సిక్కు గురుద్వారాల చట్టం ద్వారా ఏర్పడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది గురుద్వారాల ఆస్తులు, నిధులు, ధార్మిక కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. సిక్కు ఓటర్లు ఈ కమిటీ సభ్యులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు
సిక్కు రోహిత్ మర్యాద..
ఈ కమిటీ గురుద్వార లోపల నియమావళిని "రహిత్ మర్యాద" అంటే జీవన నియమావళిని నిర్ణయిస్తుంది. ఆలయంలోపల లేదా సమీప ప్రాంతాల్లో జరిగేది ఏది తప్పు? ఏది ఒప్పు? అనేది ఈ రహిత్ మర్యాద కమిటీ నిర్ణయించడం ద్వారా పవిత్ర స్థలాల్లో నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలను అమలు చేస్తాయి.
గురుద్వార: వద్ద పొగాకు, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు వాడకం అనేది పూర్తిగా నిషిద్ధం.
తిరుమల:ఇదే పద్ధతి తిరుమల శ్రీవారి క్షేత్రంలో కూడా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ పగడ్బందీగా అమలు చేస్తుంది" పట్టుబడిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్నారు.
గురుద్వారాలకి ప్రవేశించాలంటే తలపై ముసుగు ఆచ్ఛాదన వేసుకొని ప్రవేశించాలి. గురుద్వారా వద్ద పవిత్రకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఎస్జీటీ క్షమించదు.
తిరుమల: యాత్రికులు సంప్రదాయ దుస్తులు ధరించిన వారిని అనుమతిస్తుంది. మహిళలు చీర రవిక ధరించడంతోపాటు, యువతులు లంగా ఓణీ ధరించాలి. పురుషులు తెల్లటి పంచ, లేదా ధోతి ధరించాలి. మోడరన్ దుస్తులు ధరించి దర్శనానికి టీటీడీ అనుమతించకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తుంది. శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధుల్లో పాదరక్షణ కూడా టీటీడీ అనుమతించదు. యాత్రికులు కూడా ఈ పద్ధతులకు అలవాటు పడ్డారు. నిబంధనలను అతక్రమించడానికి సాహసించడం లేదు.
పంజాబ్ రాష్ట్రం అమృత్ర్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద సామాజిక శిక్ష అమలు చేస్తారు. చట్టాలకు అతీతంగా ఈ శిక్షలు అమలు చేయడంలో గురుద్వారా ప్రబంధం కమిటీకి అధికారాలు ఉన్నాయి. ఈ శిక్షలను తన్ఖా (tankhah) శిక్షలు అమలు చేస్తారు.
గురుద్వారాల వద్ద తప్పిదాలకు పాల్పడితే అమలు చేసే శిక్షలు అక్కడి సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి. సిక్కు మత గురువులు (panj praye) అకాల తత్ ద్వారా శిక్ష ఖరారు చేస్తారు.
ఆ శిక్షలు ఎలా ఉంటాయంటే..
గురుద్వారా వెలుపల భక్తుల చెప్పులను శుభ్రం చేయించడం. ఉచిత భోజన శాలలో గిన్నెలు శుభ్రం చేయించడం. గురుద్వారా ప్రాంగణాన్ని ఓడిపించడం. బహిరంగంగా తమ తప్పును ఒప్పుకుంటూ అర్థాస్ ప్రార్థన చేయడం. ఒంటి శిక్షలను అమలు చేస్తారు.
గతంలో పంజాబ్ డిజిపికి కూడా ఈతరహా శిక్ష విధించిన సందర్భం ఉంది. అత్యంత తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి పంత్ (సిక్కు సమాజం నుంచి బహిష్కరిస్తారు. చట్టపరంగా తీసుకునే శిక్షలు కూడా విభిన్నంగా ఉంటాయి తప్పిదాలు తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి విధించే శిక్షల్లో గురుద్వారా ప్రబంధ కమిటీ విద్య శిక్షలు ఎవరైనా విగ్రహం ధ్వంసం లేదా మతం గ్రంథాల అగౌరవానికి పాల్పడితే భారతీయ శిక్షాస్మృతి, భారతీయ న్యాయ సంహిత ( BNS) ప్రకారం పోలీసులు అరెస్ట్ చేస్తారు పంజా ప్రభుత్వం నేరాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు అమలు చేస్తుంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం లోపల క్రమశిక్షణను పర్యవేక్షించడానికి టాస్క్ ఫోర్స్ కూడా ఉంటుంది. గురుద్వారాకు వచ్చే భక్తులతో మర్యాదగా ప్రవర్తించేలా ఈ టాస్క్ఫోర్స్ పర్యవేక్షిస్తుంది.
తిరుమలలో ఎలా ఉంది..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి టీటీడీ చైర్మన్ సారధ్యంలో పాలకమండలేని ఏర్పాటు చేస్తారు. టిటిడి బోర్డు ఇంతవరకు ఎవరికీ శిక్షలు విధించిన దాఖలాలు లేవు. తిరుమలలో నలుగురు ప్రధాన అర్చకులు ఉంటారు. శ్రీవారి ఆలయం లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కైంకర్యాలను నిర్వహించడానికి మాత్రమే వారికి వెసులుబాటు ఉంది. మినహా, అన్య మతస్తులు వస్తే డిక్లరేషన్ తీసుకుని బాధ్యత వారిది కాదు. అధికారులు మాత్రమే దీన్ని పర్యవేక్షిస్తారు. ఆలయంలో అభ్యంతరకరంగా వ్యవహరించిన, తప్పిదాలు పాల్పడే యాత్రికులను శిక్షించే అధికారం వారికి లేదు. ఆ బాధ్యతలను టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తుంది. వారికి కూడా శిక్షించే అధికారం లేదు. తప్పిదాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని సివిల్ పోలీసులకు అప్పగించడం, ఫిర్యాదు చేయడం వరకే వారి బాధ్యత.
ఈ పరిస్థితుల్లో పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం తరహా చట్టాలను అమలు చేయడానికి పరిశీలన జరపాలి అనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశం చర్చకు ఆస్కారం కల్పించింది. ఆ తరహా మతపరమైన శిక్షలు అమలు చేయడం టీటీడీలో సాధ్యం అవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
తిరుమలలో డిక్లరేషన్..
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే ఇతర మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
"శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై మాకు అచంచల భక్తి విశ్వాసం ఉంది. దర్శనానికి అనుమతించండి" అని ఇతర మతస్తులు తిరుమల శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో దరఖాస్తు పై సంతకం చేయాల్సి ఉంటుంది. సాధారణంగా రాష్ట్రంలోని రాయలసీమ వస్తా ప్రాంతాల నుంచి కూడా ఎక్కువమంది ముస్లిం యాత్రికులుకు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. వారు ఎవరై కోరి మరి డిక్లరేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు.
లడ్డు వివాదంతో తెరపైకి
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం తెరపైకి వచ్చింది. అందుకు ప్రధాన కారణం. ఉమ్మడి రాష్ట్రం, విభజిత ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్.రాజశేఖర్ రెడ్డి, ఆయన కొడుకు వైఎస్. జగన్ సీఎం, ప్రతిపక్ష నాయకుల హోదాలో వ్యక్తిగతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. మినహా వారి కుటుంబీకులు తిరుమలకు వచ్చిన దాఖలాలు లేవు. శ్రీవారి లడ్డూ ప్రసాదం లో కల్తీ నెయ్యి వాడారని విషయం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురు తో కలిసి తిరుమల యాత్రకు వచ్చినప్పుడు..
"తన కూతురి పక్షాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పై సంతకం చేసి" వైసిపి చీఫ్ జగన్ ఇరకాటంలో పడేశారు. ఈ వ్యవహారంపై న్యాయవాది విజయకుమార్ ఏమంటారంటే..
"శ్రీవారిపై భక్తి, నమ్మకం ఉన్న వారే తిరుమలకు వస్తారు కదా? ఇక డిక్లరేషన్ సమస్య ఎందుకు" అని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ చట్టం అమలులో ఉంది, ఆ చట్టాన్ని గౌరవించి, ప్రముఖులు పాటిస్తే, సమస్య అనేది ఉత్పన్నం కాదు కదా" అని విజయకుమార్ సూచించారు.
డిక్లరేషన్ ఎప్పటినుంచి..
తిరుమల శ్రీవారినీ దర్శించుకోవాలని వచ్చే ఇతర మతస్తులు డిక్లరేషన్ ఇచ్చే పద్ధతి 2012 ఆగస్టు 13వ తేదీ నుంచి అమలులోకి తీసుకొని వచ్చారు. అప్పటి టీటీడీ తిరుమల జేఈఓ గా పని చేసిన కేఎస్ శ్రీనివాసరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు.
"తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించే ఇతర మతాలకు సంబంధించిన యాత్రికులు డిక్లరేషన్ ఇవ్వాలి" అని మీడియాతో చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (జిఓ ఎంఎస్ నంబరు 311 రెవెన్యూ ఎండోమెంట్స్ -1) నిబంధన 136 ప్రకారం హైందవేతరులు తిరుమలలోని శ్రీవారి ఆలయానికి వచ్చినప్పుడు వైకుంఠం వద్ద ఉన్న రిజిస్టర్‌లో స్వామివారిపై విశ్వాసం ఉన్నట్టు ఒక డిక్లరేషన్‌పై సంతకం చేయాలేనే విషయాన్ని గుర్తు చేశారు.
తిరుమలోని జెఈఓ కార్యాలయం, పేష్కార్ కార్యాలయం, అన్ని సబ్ ఎంక్వైరీ(ఉప విచారణ) కార్యాలయాల్లో ఆయా రిజిస్టర్లు ఏర్పాటు చేశారు. హిందూ యేతరులు శ్రీవారి దర్శనానికి వస్తే స్వచ్ఛందంగా డెకరేషన్ పై సంతకం చేయాలి. దీనిని కచ్చితంగా అమలు చేస్తున్న దాఖలాలు మాత్రం తిరుమలలో కనిపించవు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Next Story

