
తిరుమల శ్రీవారికి ముడుపు మనియార్డర్ చేయడం ఎలా?
తిరుమల పోలేక పోతున్నవారు డబ్బు ఎంవో చేసి శ్రీవారి 'ఆశీర్వచనం' పొందడం ఎలాగో తెలుసా?
యాత్రికులు, తిరుమల శ్రీవారి హుండీ మధ్య తపాలశాఖ అనుసందానకర్తగా నిలిచింది. శ్రీవారి హుండీ, టీటీడీ తొమ్మిది ట్రస్టుల (TTD 9 Trust's )కు కూడా యాత్రికులు ఈఎంఓ 'eMO' ( మనియార్డర్) ద్వారా విరాళాలు అందింవచ్చు. దీనికోసం తపాలా శాఖ (indian post's) "ఆశీర్వచనం" అనే పథకం ద్వారా మనీయార్డర్ పంపించే సేవలు అందిస్తోంది.
తిరుమల తోపాటు దేశంలోని మూడు ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్ల (Kiosk machines) ద్వారా విరాళం అందించవచ్చు. ఈ యంత్రాల్లో క్యూఆర్ కోడ్ (QR code) ఆండ్రాయిడ్ మొబైల్ లో స్కాన్ చేసి శ్రీవారి హుండీకి విరాళం ఇవ్వవచ్చు.
"2024 డిసెంబర్ చివరిలో ప్రారంభించిన కియోస్క్ మిషన్లకు స్పందన బాగుంది" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేశారు.
టీటీడీకి యాత్రికుల మధ్య తపాలా శాఖ అనుసంధానకర్తగా ఎలా నిలిచిందంటే..
తిరుమల శ్రీవారి హుండీకి ఈఎంఓ 'eMO' కానుకలు పంపించవచ్చు. ఒకేసారి రూ. పది వేలు పంపించడానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది.దీనికి తపాలా శాఖ రూ. 500 కమిషన్ తీసుకుంటుంది. మనీయార్డర్ ఎలా పంపాలో తెలుసుకుందాం..
టీటీడీ నిర్వహించే ట్రస్టులకు తపాలా శాఖ ఆశీర్వచనం అనే పథకంతో అనుసంధాన కర్తగా మారింది. ఈ పథకంలో తపాలాశాఖ యాత్రికుల నుంచి కానుకలు పంపించడానికి టిటిడితో ఒప్పందం కుదుర్చుకుంది.
"గతంలో ఐదు వేల రూపాయలు మాత్రమే పంపించడానికి వెసులుబాటు ఉండేది. ఆ మొత్తాన్ని 10 వేల రూపాయలకు పెంచారు" అని తిరుపతిలోని ఓ పోస్టుమాస్టర్ చెప్పారు.
1. ఏ పోస్ట్ ఆఫీస్ లో అయినా ఈఎంఓ eMO 'ఫారం తీసుకోవాలి.
2. మనీ ఆర్డర్ అడ్రస్
కార్యనిర్వహణాధికారి,
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుపతి. పిన్ 517501 నెంబర్. రాయాలి.
2. eMO ఫారంలో ఎంత విరాళం పంపిస్తున్నారనేది నమోదు చేయాలి. ఆ దరఖాస్తులో విరాళం పంపించే వ్యక్తి అడ్రస్, పిన్ కోడ్ (PIN Code) తో సహా నమోదు చేయాలి.
3. టీటీడీ నిర్వహిస్తున్న తొమ్మిది ట్రస్టుల్లో దేనికి పంపుతున్నారు అనేది స్పష్టం చేయాలి.
4. టీటీడీ నిర్వహించే తొమ్మిది ట్రస్టుల్లో ఒకటి ఎంచుకోవాలి. ఆ దరఖాస్తులలో ఆ సంఖ్య (కోడ్ నంబర్) నమోదు చేయాలి.
5. ఒక యాత్రికుడు గరిష్టంగా 10,000 వరకు పంపడానికి వెసులుబాటు ఉంది. ఈ మొత్తం పంపించాలంటే తపాలా శాఖ 500 రూపాయలు కమిషన్ గా తీసుకుంటుంది. ఆ తరువాత
టీటీడీ నుంచి సమాధానం
1. యాత్రికుడు పంపిన మొత్తం అందిన వెంటనే టీటీడీ నుంచి ఒక రసీదు పోస్ట్మాన్ ద్వారా అందుతుంది.
2. కొన్ని రోజులకు మనీ ఆర్డర్ ద్వారా విరాళం పంపిన భక్తుడికి టీటీడీ ముద్రించిన రసీదు కార్డు వస్తుంది.
3. స్వామి అమ్మవారు ఉన్న ఫోటో, అక్షింతలు కవర్ లో పంపిస్తారు. ఇలా 'ఈఎంఓ' ద్వారా శ్రీవారి హుండీకి విరాళం పంపడానికి అవకాశం ఉందని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు.
తొమ్మిది ట్రస్టులు... తొమ్మిది సేవలు
టీటీడీ నిర్వహిస్తున్న తొమ్మిది ట్రస్టులకు కూడా యాత్రికులు విరాళాలు అందించవచ్చు. జాతీయ బ్యాంకుల తోపాటు ఈ హుండీకి కానుకలు సమర్పించడానికి టీటీడీ ఆన్లైన్ పద్ధతిని అమలులో ఉంది. కియోస్క్ మిషన్లు కూడా ఏర్పాటు చేసింది. తిరుమలలో కియోస్క్ మిషన్ల ద్వారా విరాళాలు అందించడం సులభం. దీంతో సామాన్య యాత్రికుల నుంచి మంచి స్పందన ఉందని కూడా టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు.
2024 డిసెంబర్: కియెస్క్ మిషన్లు ప్రారంభించిన 50 రోజుల్లోనే తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 55 లక్షల విరాళం అందిందని చౌదరి గుర్తు చేశారు. దీంతో తిరుమల, తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయం, కడప జిల్లా శ్రీకోదండరామస్వామి ఆలయం, బెంగళూరులోని శ్రీవారి ఆలయంలో కూడా కియోస్క్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఈ మూడు ఆలయాల్లో కేవలం 15 రోజుల్లోనే రూ. ఐదు లక్షల రూపాయలు విరాళాలు అందాయని నాయుడు వివరించారు.
స్కానింగ్ ఇలా..
కియోస్క్ యంత్రంలో క్యూ ఆర్ కోడ్ మొబైల్ ఫోన్ నుంచి స్కాన్ చేసి యూపీఏ పేమెంట్ తరహాలో విరాళాలు అందించవచ్చు. తిరుమలలో నగదు రహిత చెల్లింపు విధానాన్ని మరింత విస్తృతం చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు చెప్పారు. తిరుమలలో క్యాష్ లెస్ పేమెంట్స్ కోసం ఈ మెషిన్లు వాడవచ్చని ఆయన సూచించారు.
"ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల లోపు ఈ యంత్రం ద్వారా చెల్లించవచ్చు" అని టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు తెలిపారు.
టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులు
శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ ని స్కీం
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (svbc)
శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్ ట్రస్ట్
శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్
శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్
శ్రీ వెంకటేశ్వర విద్యా దాన ట్రస్ట్
శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Svims)
టీటీడీ నిర్వహించే ఈ ట్రస్టులకు విరాళాలు అందించే దాతలకు కొన్ని ప్రయోజనాలు కూడా అందుతాయి. తిరుమల శ్రీవారి దర్శనం, లడ్డు ప్రసాదాలు, వేద ఆశీర్వచనం, శాలువతో సత్కారం, శ్రీవారి డాలర్లు అందిస్తారు. ఆ వివరాలు ఇవి.
1. రూపాయి నుంచి పదివేల వరకు
2.రూ లక్ష నుంచి ఐదు లక్షల చెల్లిస్తే..
టిటిడి రసీదు కూడా ఇస్తుంది. ఓ బుక్ లెట్ అందిస్తుంది. దాత కు తిరుమల లో శుపథం నుంచి ఐదుగురికి దర్శనం కల్పిస్తారు. ఒక రోజు 100 రూపాయల గది ఉచితంగా కేటాయిస్తారు. ఆరు చిన్న లడ్డు ప్రసాదాలు అందిస్తారు. దాతకు ఒక శాలువాతో సత్కారం, ఆయన భార్యకు ఒక రవిక వస్త్రం అందిస్తారు.
3. ఐదు లక్షల నుంచి 10 లక్షలు చెల్లిస్తే..
ఏడాదికి మూడు రోజుల దర్శనం (ఒకోసారి ఐదుగురు).
మూడు రోజులు వసతి గది కేటాయింపు.
10 చిన్న లడ్డూలు, ఒక ఐదు మహా ప్రసాదం. ఒక దుపట్టా, ఒక రవిక.
4. రూ. పది లక్షల నుంచి 25 లక్షలు చెల్లిస్తే..
. శ్రీవారి దర్శనానికి మూడుసార్లు ప్రారంభం బ్రేక్ దర్శనం (ఒక్కోసారి ఐదుగురికి).
మూడు రోజులు వెయ్యి రూపాయల గది.
20 చిన్న లడ్డూలు, మహా ప్రసాదాలు
ఒక దుపట్టా ఒక రవిక, 50 గ్రాముల శ్రీవారి వెండి నాణెం.
5. రూ.25 నుంచి 50 లక్షలు చెల్లిస్తే.
తిరుమలలో సుపథం నుంచి ఐదుగురికి ఒకరోజు దర్శనం
మూడు రోజులు బిగినింగ్ బ్రేక్ దర్శనం (ఒకోసారి ఐదుగురు)
రూ. 1500 గది మూడు రోజులు కేటాయింపు.
నాలుగు పెద్ద లడ్డులు, ఐదు చిన్న లడ్డూలు, పది మహా ప్రసాదాలు,
ఒక దుపట్టా, రవిక. ఐదు గ్రాముల శ్రీవారి బంగారు డాలర్, 50 గ్రాముల వెండి డాలర్ బహుమానం.
6. రూ. 7. 50 నుంచి 75 లక్షలు చెల్లిస్తే..
శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవకు ఐదుగురిని అనుమతిస్తారు.
రెండు రోజులు సుపథం నుంచి ఐదుగురిని దర్శనానికి అనుమతి
మూడు రోజులు బిగినింగ్ బ్రేక్ దర్శనం (ఒక్కోసారి ఐదుగురు)
మూడు రోజులు 2000 రూపాయల వసతి గది ఉచితంగా కేటాయింపు
ఆరు పెద్ద లడ్డూలు, 10 చిన్న లడ్డులు, 10 మహా ప్రసాదాలు ఒక దుపట్టా, రవిక. ఐదు గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ , 50 గ్రాముల శ్రీవారి వెండి డాలర్
8. రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయలు ఇస్తే..
తిరుమలలో శ్రీవారికి జరిగే సుప్రభాత సేవలో రెండు రోజులు (ఒక్కోసారి ఐదుగురికి) అనుమతి.
మూడు రోజులు సపథం నుంచి శ్రీవారి దర్శనానికి ఒక్కోసారి ఐదుగురికి అనుమతి.
మూడు రోజులు బిగినింగ్ బ్రేక్ దర్శనం ఒక్కోసారి ఐదుగురికి అనుమతి.
రూ. 2500 గది ఉచితంగా మూడు రోజుల కేటాయింపు.
8 పెద్ద లడ్డూలు, 15 చిన్న లడ్డూలు, 10 మహా ప్రసాదాలు, ఒక దుపట్టా, ఒక రవిక, ఐదు గ్రాముల బంగారు, 50 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ బహుమానం
9. ఒక కోటికి పైన విరాళామందిస్తే..
తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవకు ఏడాదికి మూడుసార్లు దర్శనం ( ప్రతిసారి ఐదుగురు)
మరో నాలుగు రోజులు సుపథం ద్వారా శ్రీవారి దర్శనం
మరో మూడు రోజులు బిగినింగ్ బ్రేక్ దర్శనం (ఒక్కోసారి ఐదుగురు)
3000 రూపాయలు విలువైన గది మూడు రోజులు ఉచితంగా కేటాయింపు, పది పెద్ద లడ్డులు, 20 చిన్న లడ్డూలు, పది మహా ప్రసాదాలు, ఒక దుప్పటా, రవిక. ఐదు గ్రాముల శ్రీవారి బంగారు డాలర్, 50 గ్రాముల వెండి డాలర్ బహుమానంగా టిటిడి అందిస్తుంది.
Next Story

