అంతా మీ వల్లే...!
x

అంతా మీ వల్లే...!

అధికారం కోల్పోవడానికి వైఎస్. జగనే కారణం. వాస్తవాలు చెప్పినా వినలేదు. చెప్పడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. అందువల్లే పరిస్థతి ఏర్పడింది. ఆ ఒక్కమాట చెప్పి ఉంటే, అధికారం మాదే. అని రాయలసీమలో ఓ మాజీ ఎమ్మెల్యే మొదట గళం విప్పారు.


జోశ్యం..

"తెలంగాణ కేసీఆర్ పై ఆ పార్టీపై ఎమ్మెల్యేలు, నాయకుల్లో అంతర్గతంగా మండుతున్న అసంతృప్తి ఆరు నెలల తరువాత భగ్గుమనింది. ఆంధ్రాలో వైఎస్. జగన్ అధికారం కోల్పోతారు. ఆ తరువాత సొంత పార్టీ ఎమ్మెల్యేలు గొంతు విప్పడానికి 60 గంటలు కూడా పట్టదు" అని బీజేపీ తాజా ఎంపీ సీఎం. రమేష్ చేసిన వ్యాఖ్య ఇది. ఫలితాలకు ముందు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఇవి.
పెగిలిన గొంతుక
"మా మాట వినలేదు. పట్టంచుకోలేదు. అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. దీనికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగనే కారణం" అని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
దీని ద్వారా సీఎం హోదాలో వైఎస్. జగన్ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం కావడం. జిల్లాలు అటుంచి, చివరికి సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు వెళ్లినా, పరదాలు కట్టడం. జనాన్ని కలవకపోవడం. పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్ ఇవ్వకపోవడం. సలహదారులదే పెత్తనం కావడం. వంటి అంశాలతో పాటు సొంత ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని గుర్తించడంలో విఫలం అయ్యారనే మాటలకు ఊతం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
రుణమాఫీ లేకపోవడం దెబ్బే

రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ అధికారానికి దూరం కావడానికి ఐదు అంశాలు బాగా దెబ్బతీశాయి. అందులో టైటిల్ డీడ్, ఇసుక పాలసీ, మద్యం విధానం వల్ల నష్టం జరిగితే, టీడీపీ సూపర్-6 పథకాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వైఎస్ఆర్ సీపీని అధికారానికి దూరం చేయడానికి బలంగా పనిచేశాయి. రైతుల రుణాల్లో కనీసం రూ. లక్ష మాఫీ ప్రకటన చేసి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదనే భావన వ్యక్తమైంది. అయిదేళ్ల పాటు పార్టీ నాయకుల్లోనే కాదు. ప్రధానంగా ప్రజాప్రతినిధుల్లో వైఎస్. జగన్ వ్యవహరించిన తీరుపై గూడుకట్టుకున్న అసంతృప్తి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాటలతో బహిర్గతమైంది.
సాధారణ ప్రజల మాట అటుంచితే, సీఎం అయ్యాక వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు కలవడానికి అపాయింట్ ఇవ్వరు. షాడో సీఎం, అంతా తానే అయి ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించడం. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేదనే విషయాలు బట్టబయలయ్యాయి. ఈ పర్యవసానం వల్లే..
ఊహించని ఫలితాలు...
రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో వైఎస్ఆర్ సీపీ అధికారం కోల్పోయింది. అందరి అంచనాలు తల్లకిందులయ్యే విధంగా 11 సీట్లకు పరిమితమై, ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో175 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేసిన ఆ పార్టీ 151 సీట్లు సాధించి, రికార్డు సాధించిన విషయం తెలిసిందే. ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, నగదు బదిలీ వంటి అంశాలు అనుకూలిస్తాయని బలంగా విశ్వసించారు. ఆ ధీమాతోనే ’వై నాట్ 175‘ నినాదంతో ఆ పార్టీ చీఫ్ వైఎస్. జగన్ పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచారు. ఈ నెల నాల్గవ తేదీ వెలువడిన ఫలితాలు వైఎస్ఆర్ సీపీనే కాదు. పరిశీలకులను కూడా దిమ్మెరపోయేలా చేశాయి. సీట్లు తగ్గినా బలమైన ప్రతిపక్షం ఉంటుదని ఆశించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేని స్థితిలో చెదుగుళికలు మింగినట్లు ఆవేదనలో ఉన్నారు. ఫలితాలు వెలువడిన రోజే.. తాజా వారిని ఊరడించే రీతిలో మాజీ సీఎం వైఎస్. జగన్ స్పందించారు.
’ ఇన్ని పథకాలు, రూ. లక్షల కోట్లు అక్కాచెల్లెళ్లకు పంపిణీ చేశా. అన్ని వర్గాలను ఆదుకున్నా. వారి అభిమానం, ప్రేమ ఏమైందో.. తెలియడం లేదు. ఎందు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు. సమీక్షించుకుని, పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తా‘ అని వ్యాఖ్యనించారు. ’అన్ని వేళల పేదల పక్షానే ఉంటా‘ అని కూడా చెప్పారు.
బాంబుల్లా పేలిన మాటలు ..
వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ స్పందించిన రోజుల వ్యవధిలోనే కర్నూలు జిల్లా పాణ్యం నుంచి పోటీ చేసి, ఓటమి చెందిన మాజీ ఎమ్మేల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బాంబుల్లాంటి మాటలు పేల్చారు. రెండు రోజుల కిందట పార్టీ నేతలు, కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ’ పార్టీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పెద్ద దెబ్బతిసింది. గడప గడపకు తిరిగే సమయంలో రైతులు ఈ విషయం మమ్మల్ని అడిగినారు. అప్పడే సందేహంవచ్చింది‘ అని కాటసాని చెప్పారు. ’ ఎలక్షన్ అయ్యేదాకా వద్దు అని మా సీఎం వైఎస్. జగన్ కు చెబితే వినలేదు. అధికారులు మా మాట ఆలకించలేదు‘ అని కూడా కాటసాని వైఎస్. జగన్ తీరును తప్పుబట్టారు. ’ఇది టీడీపీకి బాగా కలిసి వచ్చింది. నామినేషన్లు పూర్తయిన 10 రోజుల్లో సీన్ మారిపోయింది. ’ప్రచారంలో మా నాయకుల వెంట వస్తున్న రైతులంతా మెల్లగా జారుకున్నారు. ఏమి అని అడిగితే, మా భూములు మీ ప్రభుత్వమే తీసుకుని, తాకట్టు పెడుతుందంట కదా! అని రైతులుచెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ పక్కకు ఉంచితే, మ్యానిఫెస్టోలో రైతుల ప్రస్తావన లేకపోవడం కూడా దారుణమని ఆయన తప్పుబట్టారు. ’ఎన్నికలకు ముందు రైతులు తీసుకున్న రుణాల్లో రూ. లక్ష మాఫీ చేస్తాం‘ అని ప్రకటన చేసి ఉంటే మాత్రం రైతులు దూరమయ్యే వారు కాదని కాటసాని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ నేరుగా ప్రజలతో సంబంధాలు కల్పించుకోవాలనే భావనతో వ్యవహరించారు. మినహా, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల మాటలను పరిగణలోకి తీసుకోలేదు. అనడం కంటే తనను కలవడానికి అవకావం ఇవ్వలేదనేదనే మాటలు వాస్తవం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఆయన తరహాలోనే ఇంకెంతమంది ధైర్యం చేస్తారనేది వేచి చూడాలి. సూచనలు, సలహాలు కూడా పాటించాలనే గుణపాఠం నేర్పించిందని అభిప్రాయపడుతున్నారు. పార్టీ నిర్మాణం ఎలా ఉండబోతుందనే విషయంలో కూడా క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
Read More
Next Story