జనసేన ఎమ్మెల్యే న్యూ(డ్) వీడియో.. రాసలీలలు..
x
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

జనసేన ఎమ్మెల్యే న్యూ(డ్) వీడియో.. రాసలీలలు..

ేడాదిగా వేధిస్తున్నాడని వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి..


తిరుపతి జిల్లా (కడప జిల్లా) జనసేన ( Jana Sena ) రైల్వే కోడూరు ( Railway Kodur )ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలు సాగించిన వ్యవహారంపై అడ్డంగా బుక్కయ్యారు. ఓ మహిళ ఉద్యోగి విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. రాష్ట్రంలో రాజకీయంగా ఇదే హాట్ టాపిక్ గా మారింది.


"నా కొడుకు చాలా మంచోడు. తప్పుడు పనులు చేయలేదు" అని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఇది సృష్టించారనేది ఆమె ఆరోపణ. టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి ముక్కా రూపానందరెడ్డితో కలిసి ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ వివరాలు ఇవి.

"2024 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే mla అరవ శ్రీధర్ కు ఫేస్బుక్లో ( Facebook ) శుభాకాంక్షలు చెప్పాను. ఆ పరిచయంతో నా నెంబర్ టెలిగ్రామ్ యాప్ లో నాకు వరుసగా మెసేజ్లు పెడుతూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు" అని రైల్వే కోడూరు పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నబద్వేలకు చెందిన ఇసుక పట్ల హర్ష వీణ ఓ వీడియో విడుదల చేశారు.
రైల్వే కోడూరు రాజకీయం..
2024 ఎన్నికల్లో రైల్వే కోడూరు ఎస్సీ శాసనసభ స్థానం నుంచి అరవ శ్రీధర్ కు అనూహ్యంగా జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కింది. వైసీపీ బయటకు వెళ్లిన ఓబులవారిపల్లి మండలం చెందిన ముక్కా రూపానంద రెడ్డి టిడిపిలో చేరారు. ప్రస్తుతం ఆయన రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జిగా కూడా ఉన్నారు. ఆయనకు ముక్కా వారి పల్లె పంచాయతీ వైసీపీ మద్దతుదారుడుగా సర్పంచ్ గా గెలిచిన శ్రీధర్ అత్యంత నమ్మిన బంటు అనేది రైల్వే కోడూరు నియోజకవర్గంలో వినిపించే మాట.
కలిసి వచ్చిన అదృష్టం
2024 ఎన్నికల్లో రైల్వే కోడూరు ఎస్సీ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ముక్కావారిపల్లి సర్పంచ్ గా ఉన్న అరవ శ్రీధర్ కు దక్కింది. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మొక్క రూపానందరెడ్డి అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మెప్పించి జనసేన టికెట్ శ్రీధర్ కు రావడానికి కీలక పాత్ర పోషించారు. అరవ శ్రీధర్ విజయం సాధించడంలో ముక్కా రూపానందరెడ్డిది ప్రధాన భూమిక అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపికి కంచుకోటగా ఉండేది. నాయకత్వ సమస్యతో బాధపడుతున్న టిడిపి ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించింది. రైల్వే కోడూరు ఎస్సీ అసెంబ్లీ స్థానంలో వైసీపీ సీటింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పై అరవ శ్రీధర్ 11, 101 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఫేస్ బుక్ సందేశంతో.. మలుపు తిరిగింది
ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లి పంచాయతీ అమృతవారి పల్లెకు చెందిన అరవ శ్రీధర్ 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
"రైల్వే కోడూరు పంచాయతీలో ఉద్యోగిగా ఉన్న నేను ఎమ్మెల్యే శ్రీధర్ కు ఫేస్బుక్లో శుభాకాంక్షలు చెప్పాను" అని హర్ష వీణ అనే మహిళ ఓ వీడియో విడుదల చేశారు. తనతో ఎమ్మెల్యే శ్రీధర్ మరింత పరిచయం పెంచుకొని, దగ్గరయ్యాడని ఆమె చెబుతున్నారు.

ఆమె మాటల్లోనే..
2024 జూన్ 14వ తేదీ రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్ కు ఫేస్బుక్లో కంగ్రాట్స్ మెసేజ్ పెట్టాను. మొదటి రెండు రెండు రోజులు ఆయన నాతో మాట్లాడాడు. నా సెల్ ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన నెంబరు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత టెలిగ్రామ్ యాప్ లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి నా కుటుంబ నేపథ్యం గురించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలుసుకుంటూ వచ్చారు నేను నా భర్తకు దూరంగా ఉంటున్నానని విషయం తెలుసుకున్న అరవ శ్రీధర్.. నేను నా బాబుతో ఉంటానని చెప్పాను. నువ్వు ఒంటరి కాదు నీకు అండగా ఉంటానని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భరోసా ఇచ్చారు" అని హర్ష వీణ వీడియోలో స్పష్టం చేశారు
కొద్దిరోజులు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాతో సాధారణంగానే మాట్లాడుతూ వచ్చారని , రెండు రోజుల తర్వాత అన్నా న్యూడ్ ఫోటోలు అడగడం స్టార్ట్ చేశారు అని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత తనను బలవంతం చేసి న్యూడ్ గా వీడియో కాల్స్ చేయడం ప్రారంభించాడని, నన్ను ఒత్తిడి చేసి జూలై 9వ తేదీ మొదటిసారి ఆయనతో స్వయంగా కలిశానని ఆమె వివరించారు. కడపకు వెళ్దామని కారులో తీసుకెళ్లి రాజంపేట వద్ద నిర్మాణస్య ప్రదేశానికి తీసుకెళ్లి నా ప్రైవేట్ పార్ట్స్ తాగడంతో పాటు బలవంతంగా దగ్గరకు తీసుకున్నాడు అని కూడా ఆమె ఆరోపించారు. కారులోనే తనను అనుభవించే స్థితికి వెళ్లి లొంగదీసుకోవడానికి కూడా ఆమె ఆరోపించారు.
"ఈ విషయం ఎవరికన్నా చెప్తే చంపేస్తానంటూ ఎమ్మెల్యే శ్రీధర్ నన్ను బెదిరించాడని" హర్ష వీణ వీడియోలు స్పష్టం చేశారు. అబార్షన్ చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి చేయడం వల్ల ఆగస్టులో ఎమ్మెల్యే శ్రీధర్ చెప్పినట్టు చేశానని. ఏడాదిన్నరలో నన్ను ఐదు సార్లు అబార్షన్ జరిగిందని కూడా ఆమె ఘాటు ఆరోపణ చేశారు. తనకి ఇప్పుడు న్యాయం చేయండి అంటూ ఆమె వీడియోను ముగించారు.
నా కొడుకు మంచివాడు..

మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ రైల్వే కోడూరు ఇన్ చార్జి ముక్కా రూపానందరెడ్డి, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ

రైల్వే కోడూరు పంచాయతీ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేసే మహిళ చేసిన ఆరోపణలపై టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి ముక్కా రూపానందరెడ్డి స్పందించారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర తల్లి ప్రమీలమ్మ మాట్లాడారు.
"నా కొడుకు చాలా మంచివాడు. ఎలాంటి తప్పు చేయలేదు. అనవసరంగా వేధిస్తున్నారు" అని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ వ్యాఖ్యానించారు.
"ఈ సంఘటన వెనక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉంది" అని ప్రమీలమ్మ సందేహం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా నిందలు మోపడం సమంజసం కాదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఆమె రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

"మహారాజశ్రీ గౌరవనీయులైన రైల్వే కోడూరు పట్టణ ఎస్హెచ్ ఓ గారి దివ్య సముఖమునకు రైల్వేకోడూరు అంటేద్కర్ నగర్ లో నివాసం ఉంటున్న వెంకటయ్య భార్య అరవ ప్రమీలమ్మ రాసుకున్న ఆర్జీ..
మా కుటుంబానికి రూపానంద రెడ్డిగారి కుటుంబానికి గత 20 సంవత్సరాల నుంచి మంచి సంబందాలు ఉన్నవి. నా కొడుకు మీద నమ్మకంతో ఆ రెడ్డిగారి దయతో ముక్కావారి పల్లె సర్పంచిగా నిలబెట్టి వారి ప్రోత్సాహం తో గెలిపించి, మేము ఎప్పుడు కని విని ఎరుగని రాజకీయ భిక్ష పెట్టినాడు. 2024 ఎలక్షన్లో మా అదృష్టం మేరకు రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు దయతో కూటమిలో భాగమై జనసేన పార్టీ తరపున మళ్లీ మా అబ్బాయికి ఎమ్మెల్యే సీటు ఇప్పించి, ఎమ్మెల్యేగా గెలిపించి మా కొడుకును మా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నారు.
మా అబ్బాయి ఎమ్మెల్యే అయినా తరువాత ఇసుకపట్ల హర్ష వీణ అనే అమ్మాయి, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది" అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ ఫిర్యాదులో అనేక ఆరోపణలు చేశారు.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదు అందిందని సీఐ చంద్రశేఖర్ చెప్పారు. బాధితురాలు అని చెబుతున్న మహిళ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.


Read More
Next Story